ట్రబుల్ షూటర్ కు ఊరట
డీకే శివకుమార్ గుర్తున్నారా. దేశ రాజకీయాల్లోనే కాదు కర్ణాటక పాలిటిక్స్ లో మోస్ట్ పాపులర్ లీడర్ గా ఆయనకు పేరుంది. కాంగ్రెస్ పార్టీకి అతడో ఆయుధంగా, అంది వచ్చిన నాయకుడిగా అనతి కాలంలోనే ఎదిగాడు. అంతే కాకుండా విపక్షాలను ధీటుగా ఎదుర్కోవడంలో డేకి ను మించిన పొలిటికల్ లీడర్లు లేరంటే అతిశయోక్తి కాదు. పార్టీ కష్టాల్లో ఉన్నప్పుడు శివకుమార్ ఎంటర్ కావడం, సమస్య తలెత్తకుండా పరిష్కరించడం గత కొన్నేళ్లుగా జరుగుతోంది. అయితే కర్ణాటకలో కొలువు తీరిన ఉమ్మడి సంకీర్ణ సర్కార్ ను అడ్డం పెట్టుకుని డీకే కోట్లు వెనకేసుకున్నాడని, అధికార దుర్వినియోగానికి పాలడ్డాడని ఆరోపణలు వచ్చాయి. కన్నడ నాట రాజకీయాల్లో డీకే మోస్ట్ ఫెవరబుల్ లీడర్.
దేనినైనా ఢీకొనే మనస్తత్వం కలిగి ఉన్న ఈ లీడర్ మాట్లాడటం లోను, ప్రతిపక్ష పార్టీలను మెస్మరైజ్ చేయడం లోను తనకు తానే సాటి. ఓడలు బళ్లవుతాయి. బళ్ళు ఓడలువుతాయి అన్న నానుడి ఇప్పుడు డీకే విషయంలో నిరూపితమైంది. సంకీర్ణ సర్కార్ కూలి పోకుండా డీకే విశ్వ ప్రయత్నం చేశారు. ముంబైకి వెళ్లారు. అయినా వర్కవుట్ కాలేదు. కుమార స్వామి నేతృత్వంలోని ప్రభుత్వం విశ్వాస పరీక్షలో ఓడి పోయింది. దీంతో అప్పటి నుంచి డీకేకు కష్టాలు మొదలయ్యాయి. ఆయన కాంగ్రెస్ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్నారు. అంతే కాకుండా బీజేపీని టార్గెట్ చేశారు. దీనిని దృష్టిలో పెట్టుకున్న హోమ్ శాఖా మంత్రి అమిత్ షా డీకేపై ఈడీ, ఐటీ దాడులు చేయించారు.
మనీ లాండరింగ్ కేసులు పెట్టించారు. ఈ విషయంపై బీజేపీకి చెందిన సీఎం యడ్యూరప్ప సైతం డీకే అరెస్టు పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. డీకేను భారీ భద్రత నడుమ తీహార్ జైలుకు తరలించారు. మరో లీడర్ చిదంబరం కూడా ఆయనతో పాటే ఉన్నారు. కాగా తనను కావాలనే ఇరికించారని, బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ ఢిల్లీ కోర్టులో నామినేషన్ దాఖలు చేసారు. ఆయనకు ఊరట నిస్తూ కోర్టు డీకే శివకుమార్ కు బెయిల్ మంజూరు చేసింది. అంతకు ముందు కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ శివకుమార్ ను జైలులో కలిసి పరామర్శించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి