జనం కోసం జనసేనాని
నా శరీరం ఈ భూమి మీద ఉన్నంత దాకా, నా ఒంట్లో శక్తి ఉన్నంత కాలం సమస్యలపై పోరాడుతూనే ఉంటా. జనాన్ని జాగృతం చేస్తూనే ఉంటా. ఊపిరి ఉన్నంత వరకు జనసేన పార్టీని నడిపిస్తా. గెలిచినా లేదా ఓడినా నా ప్రయాణం ప్రజల బాగు కోసం, సమాజ అభివృద్ధి కోసం కృషి చేస్తూనే ఉంటానని జనసేన పార్టీ అధినేత, ప్రముఖ నటుడు, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలులో పవన్ కళ్యాణ్ మాట్లాడారు. ఈ సందర్బంగా ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం పై నిప్పులు చెరిగారు. జగన్ మోహన్ రెడ్డి ప్రజా వ్యతిరేక విధానాలను అవలంభిస్తున్నారంటూ మండి పడ్డారు.
మంత్రులు ఏం చేస్తున్నారో జనానికి, ఇతర నేతలకు అర్థం కావడం లేదన్నారు. పార్టీలను దృష్టిలో పెట్టుకోకుండా ప్రతి ఒక్క జనసేన కార్యకర్త, నాయకులు అంతా జనం ఎదుర్కుంటున్న ప్రధాన సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. ఆరోపణలు, విమర్శలు చేయడం వల్ల ఒరిగేది ఏమీ ఉండదన్నారు. పార్టీ పదికాలాల పాటు ఉంటుంది. ప్రాణం ఉన్నత దాకా దానిని కాపాడుతా. జనం కోసమే అది పుట్టింది.
అధికారం మన లక్ష్యం కాదు. ప్రజా సంక్షేమమే మన గమ్యం..గమనం కూడా. ఆ దిశగా మనందరం పాటుపడదామని పవన్ అన్నారు. విశాఖలో భవన నిర్మాణ కార్మికుల కోసం జరిపే ర్యాలీని సక్సెస్ చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్బంగా జనసేనాని పోస్టర్ ను విడుదల చేశారు. తాను కోట్లు కాదనుకుని రాజకీయాల్లోకి వచ్చానని, ఎవ్వరికీ సంజాయిషీ ఇచ్చు కోవాల్సిన పనిలేదన్నారు. ఏవైనా సమస్యలు వుంటే తన దృష్టికి తీసుకు రావాలని చెప్పారు పవన్ కళ్యాణ్.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి