స్వామే మా సీఎం - స్పష్టం చేసిన మంత్రివర్గం
బీజేపీ అధినేత, ఇండియన్ ప్రైమ్ మినిష్టర్ మిష్టర్ నరేంద్ర మోదీ సృష్టించిన విజయోత్సవ సునామీ దెబ్బకు ప్రతిపక్షాలు విలవిలలాడి పోతున్నాయి. ఏం చేయాలో తెలియక మిన్నకుండి పోయాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశ వ్యాప్తంగా జరిగిన 17వ సార్వత్రిక ఎన్నికల్లో స్పష్టమైన మెజారిటీని సాధించింది బీజేపీ. ఈ క్రెడిట్ అంతా మోదీ, షాలదే. 12 రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ అడ్రస్ లేకుండా పోయింది. రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రంగంలోకి దిగినా మోదీ ప్రభంజనాన్ని ఆపలేక పోయారు. కర్ణాటకలో కొలువు తీరిన కాంగ్రెస్, జేడీఎస్ ల జోడి లకు కోలుకోలేని షాక్ తగిలింది ఈ ఎన్నికల్లో. కేవలం 2 సీట్లకే పరిమితమై పోయాయి ఈ రెండు పార్టీలు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుత సంకీర్ణ ప్రభుత్వానికి ఓ రకంగా హెచ్చరికను జారీ చేసినట్లు భావిస్తున్నారు.
అనూహ్యంగా పవర్ ను పొందలేని బీజేపీ ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో ఘన విజయాన్ని నమోదు చేసుకుంది. మాజీ ప్రధాని దేవెగౌడ కుమారుడు కుమారస్వామి ముఖ్యమంత్రిగా తాను కొనసాగలేనని..ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ తాను తప్పుకుంటానని మంత్రివర్గంతో జరిగిన సమావేశంలో స్పష్టం చేశారు. దీనిని ఏ ఒక్క మంత్రి ఒప్పుకోలేదు. లోక్‌సభ సీట్లలో ఓడినంత మాత్రాన తమ ఓటు బ్యాంకుకు ఢోకా లేదని మీరే సీఎంగా ఉండాలని కోరుతూ ఏకపక్షంగా మంత్రివర్గం తీర్మానం చేసింది. తమ సీఎం కుమారుడేనని చెప్పకనే చెప్పింది. రాహుల్ గాంధీ, చంద్రబాబు, దేవెగౌడ, తదితర రాజకీయ నేతలు ఇక్కడ ప్రచారం చేశారు. అయినా ఫలితాలు ప్రభుత్వానికి ప్రతికూలంగా వచ్చాయి. మరింత బలాన్ని పెంచుకుంది బీజేపీ.
ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే..సౌమ్యుడైన కుమార స్వామి ఇక కొనసాగలేనంటూ..హుటాహుటిన కేబినెట్ భేటీ ఏర్పాటు చేశారు. విధాన సౌధలో సమావేశం ఉంటుందని సమాచారం ఇచ్చారు. చివరి క్షణంలో సీఎం అధికారిక నివాసం కృష్ణకు మార్చారు. అందుబాటులోని మంత్రులంతా హాజరయ్యారు. కీలక మంత్రిగా ఉన్న డికె శివకుమార్ విదేశీ పర్యటనలో ఉన్నారు. కేబినెట్‌లో సీఎంగా ఉండలేనంటూ రాజీనామాకు సిద్ధమయ్యారు కుమారస్వామి. కానీ మంత్రులంతా ముక్త కంఠంతో ఒప్పుకోలేదు. తమ సీఎం నీవే నీవేనంటూ సంపూర్ణ మద్ధతు ప్రకటించారు స్వామికి. మైత్రీ సర్కార్‌కు ఢోకాలేదని, స్పష్టమైన మెజారిటీ ఉన్నందున సంకీర్ణ ప్రభుత్వాన్ని కొనసాగించాలని ఉప ముఖ్యమంత్రి పరమేశ్వర్ ప్రతిపాదించగా..దాదాపు మంత్రులంతా చప్పట్లతో మద్ధతు పలికారు. లోక్‌సభ స్థానాల్లో నష్టం వాటిల్లినా అసెంబ్లీ స్థానాల్లో ఢోకా లేదని చెప్పడంతో స్వామి తన రాజీనామాను వెనక్కి తీసుకున్నట్టు సమాచారం. మొత్తం మీద కర్ణాటక రాజకీయం చల్లబడింది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి