కమనీయం..కళ్యాణోత్సవం - భక్తుల పారవశ్యం..ఓలలాడిన ఒంటిమిట్ట
తండోప తండాలుగా భక్తులు తరలి రావడంతో కడప జిల్లా ఒంటిమిట్టలోని కోదండరామస్వామి ఆలయంలో శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం అంగరంగ వైభవోపేతంగా జరిగింది. ఆలయ నిర్వాహకులు భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. ఏ ఒక్క భక్తుడు..భక్తురాలు ఇబ్బంది పడకుండా ..మహిళలు, తల్లులు, పిల్లలు, వృద్ధులకు ప్రత్యేక సౌకర్యాలను కల్పించారు. ఈ ఆలయం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు. తిరుమలను దర్శించుకునేందుకు వెళ్లే ప్రతి భక్త కుటుంబమంతా తప్పనిసరిగా ఈ పుణ్య క్షేత్రాన్ని సందర్శించుకోవడం గత కొన్నేళ్లుగా ఆనవాయితీగా జరుగుతూ వస్తోంది. ఉత్సవాల సమయంలో లక్షలాది మంది భక్తులు ఏపీ, తెలంగాణ నుంచే కాక మహారాష్ట, కర్ణాటక, తమిళనాడు, తదితర రాష్ట్రాల నుండి ఇక్కడికి రావడం పరిపాటి. జాతీయ రహదారి పక్కనే ఉండడంతో ఎక్కువ మంది భక్తులు వచ్చేందుకు అవకాశం ఏర్పడుతోంది.
భారతీయ సంస్కృతిని ప్రతిబింబించేలా హిందూ వైభవాన్ని చాటి చెప్పేలా దేశ వ్యాప్తంగా శ్రీ సీతారాముల కళ్యాణాన్ని నిర్వహించడం సర్వ సాధారణం. శ్రీరాముడు, ఆంజనేయ స్వామి కలిసి వుండే ప్రతి ఆలయం దేశంలోని ప్రతి గ్రామంలో ఉంటుంది. అంతటా మూడు రోజుల ముందుగానే శ్రీరామనవమి సందర్భంగా రాముడు, సీతమ్మకు కళ్యాణం జరిగితే..ఒంటిమిట్ట ఆలయంలో మాత్రం పండగ తర్వాత కళ్యాణ మహోత్సవాన్ని నభూతో నభవిష్యత్ అన్న రీతిలో నిర్వహిస్తూ వస్తున్నారు. ఈసారి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్వయంగా పట్టు వస్త్రాలు, తలంబ్రాలు స్వామి , అమ్మవార్లకు బహూకరించారు. భక్తులు భారీగా ..ఇసుక వేస్తే రాలనంతగా తరలి రావడంతో ఒంటిమిట్ట భక్త జనసందోహంతో నిండి పోయింది. శ్రీరామ శ్రీరామ..సీతమ్మ తల్లి ..అంటూ భక్తులు రామ జపాన్ని భక్తి పారవశ్యంతో జపిస్తుండగా ..రాములోరి కళ్యాణం అద్భుతమైన రీతిలో సాగింది.
భగవన్నామ స్మరణ చేస్తే...సకల దోషాలు తొలగి పోతున్నాయని..సనాతన హైందవ ధర్మాన్ని పుణికి పుచ్చుకున్న ఉమ్మడి రాష్ట్రాల గవర్నర్ దంపతులు నరసింహన్ కళ్యాణోత్సవానికి విశిష్ట అతిథిగా హాజరయ్యారు. జగత్ ప్రభువుగా పేరొందిన జానకిరాముడు..సీతమ్మలకు కళ్యాణమూర్తులకు భక్తులు కొలిచారు. గవర్నర్, ముఖ్యమంత్రిలకు ప్రత్యేకంగా టీటీడీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అనిల్ కుమార్ సింఘాల్, మాజీ ఛైర్మన్ పాల్గొన్నారు. రామభద్రా కరుణించవయ్యా..సీతారమణ..సర్వేశా..ఏమని చెప్పగ..ఇదుగో నీ ప్రతాపం..రామ భద్రా సీతారణ సర్వేశ..అంటూ ఆలాపించిన గీతాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కన్నుల పండువగా సాగిన ఈ కళ్యాణోత్సవాన్ని లక్షలాది మంది భక్తులు కనులారా వీక్షించారు. వివిధ రంగాలకు చెందిన అతిరథ మహారథులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, వ్యాపారవేత్తలు..పెద్ద ఎత్తున ఈ కలియుగ కళ్యాణోత్సవాన్ని తిలకించారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి