దమ్మున్న మగాడు కేసీఆర్ - వర్మ బయోపిక్
ఇండియన్ సినిమా చరిత్రలో తనకంటూ ఓ స్పేస్‌ను క్రియేట్ చేసుకున్న సంచనాలకు నెలవైన డైనమిక్ డైరెక్టర్ రాం గోపాల్ వర్మ మరో సెన్సేషనల్ క్రియేట్ చేశారు. కోట్లాది అభిమానులను ఆయన షాక్‌కు గురి చేస్తూ ట్విట్టర్ లో దమ్మున్న మగాడు..ఒకే ఒక్కడు..తెలంగాణ రాష్ట్ర సాధకుడు..ప్రస్తుత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జీవితాన్ని ఓ చరిత్రగా బయో పిక్ తీస్తున్నానంటూ ట్వీట్ చేశాడు. ఇది దావానలంలా వ్యాపించింది..ఈ వార్తే దేశమంతటా వైరల్ అయ్యింది. కేసీఆర్ అంటేనే ఓ మెరుపు..ఓ కుదుపు కూడా. ఆయన ఏది మాట్లాడినా మంటలే. మాటలతో రగిలిస్తాడు..ఆలోచించేలా చేస్తాడు..లక్షలాది మందిని తన మాటల చాతుర్యంతో అలాగే కూర్బోబెట్టగలరు కూడా.
కేసీఆర్ ఆ మూడు అక్షరాలు ఇపుడు ఇండియాలో సెన్సేషన్. లోతైన విశేష పరిజ్ఞానం..అన్ని అంశాల పట్ల..సమస్యల పట్ల అవగాహన. పలు భాషల్లో పాండిత్యం..అద్భుతమైన రీతిలో ..సమయోచితంగా ప్రసంగించడం కేసీఆర్‌కు ఒక్కడికే చెల్లింది. అవసరమైతే నేర్చుకోగలరు..లేదంటే తానే టీచర్ అవతారం ఎత్తగలరు. బక్క పల్చగా వుండే ఈ నాయకుడు ..ఇండియాలోనే మోస్ట్ వాంటెడ్ లీడర్‌గా ఎదిగారు. ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతూ ఉండడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. మోస్ట్ క్రియేటివ్ డైరెక్టర్‌గా ఇప్పటికే తనకంటూ ఓ బ్రాండ్ ను స్వంతం చేసుకున్న ఈ అరుదైన దర్శకుడు ఏది రాసినా..లేక ఏది మాట్లాడినా అదో సంచలనమే.
మొదటి నుంచి రామూ కేసీఆర్ పట్ల కాస్త మెతక వైఖరిని అవలంభిస్తూ వస్తున్నారు. ఎంతటి స్థాయిలో ఉన్నా సరే..ఎవరినీ వదిలి పెట్టని మనస్తత్వం కలిగిన ఆర్జీవి ..ఉన్నట్టుండి కేసీఆర్ పై ప్రేమను కురిపించారు. ఇటీవలే దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు జీవితంలోని అన్ని కోణాలను స్పృశించేలా ..లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ఇటీవలే బయో పిక్ ను విడుదల చేశారు. మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది. ఇది తమకు అభ్యంతరకరంగా ఉందంటూ ఏపీ సర్కార్ అక్కడ ప్రదర్శించకుండా ఆంక్షలు పెట్టింది. అయినా వర్మ తగ్గలేదు. అనుకున్న దానికంటే ఎక్కువ ఆదరణ లభించింది. ఆ పిక్‌కు ..ఆ సినిమా ఇచ్చిన కిక్ తో మరో సెన్సేషనల్‌కు తెర తీశారు రామూ.
ఏది ఎప్పుడు చేయాలో..ఎవరిని ఎప్పుడు వాడుకోవాలో..ఏయే సందర్భాలలో ఎవరికి అప్పగించాలో..కేసీఆర్‌కు తెలిసినంతగా మరే నాయకుడికి తెలియదంటే అతిశయోక్తి కాదు. కేసీఆర్ జీవితాధారంగా ఓ బయో పిక్ ను తెరకెక్కించ బోతున్నట్లు ప్రకటించారు. కాన్సెప్ట్ తో కూడిన పోస్టర్ ను విడుదల చేశారు. పోస్టర్‌లో టైగర్ కేసీఆర్ అని రాసి వుంది. బహుషా సినిమా టైటిల్ ..ఇదే అయి వుండవచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఆడు తెలంగాణ తెస్తనంటే అందరూ నవ్విండ్రు..ది అగ్రెస్సివ్ గాంధీ ..అన్న క్యాప్షన్స్‌తో పోస్టర్‌లో ఉండేలా చూశారు వర్మ. ఆంధ్ర వాసులు తెలంగాణ వాసులను తక్కువ చేసి తట్టుకోలేక కేసీఆర్ ఏం చేశారన్న నేపథ్యంలో తీస్తున్న చిత్రమిది అంటూ ఆర్జీవి ట్వీట్ చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి