మోదీ పాలనలో ఉద్యోగాలు మటాష్
స్వచ్ఛ్ భారత్ అంటూ జనాన్ని బురిడీ కొట్టించి ..కేంద్రంలో అధికారంలోకి వచ్చిన నరేంద్ర మోదీ దెబ్బకు జనం అబ్బా అంటున్నారు. ఏ ముహూర్తాన నోట్ల రద్దు నిర్ణయం తీసుకున్నారో ఆరోజు నుండి నేటి దాకా ఆర్థిక వ్యవస్థ గాడిన పడలేదు. ఈ విషయాన్ని దేశంలో విద్యాబోధనలో పేరుగాంచిన అజీం ప్రేమ్ జీ యూనివర్శిటీ తో పాటు సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండియన్ ఎకానమీ సంస్థలు చేపట్టిన సర్వేలో వెల్లడించింది. జాతి యావత్తు నివ్వెర పోయేలా వాస్తవాలను వెలుగులోకి తీసుకు వచ్చాయి. ఎన్నికల వేళ బీజేపీ సర్కార్‌కు ఇదో అతి పెద్ద దెబ్బ. ఏకంగా మోదీ ఏకపక్ష నిర్ణయం వల్ల..దాదాపు 50 లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయారని పేర్కొన్నాయి. 2016 నవంబర్ 8..రాత్రి 10 గంటలు..ఉరుములు ..పడుతున్నట్టు..రాకెట్లు దూసుకు వచ్చినట్టు మోదీ నోట్లను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు.
కోట్లాది ప్రజలు ఆ రోజు రాత్రంతా నిద్రపోలేదు..జాగరణ చేశారు. కంటి మీద కునుకే లేకుండా పోయింది వాళ్లకు. ఇళ్లల్లో ఉన్న ప్రజలు రోడ్లపైకి వచ్చారు. సామాజిక సేవలో పేరుగాంచిన ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు దివాళా తీసినంత పనిచేశాయి. చాలా రోజుల వరకు నోట్లు లేకుండా పోయాయి. జనం పనులు మానేసి డబ్బుల కోసం క్యూలో నిలబడ్డారు. దేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత జరిగిన అత్యంత అనాలోచితమైన నిర్ణయం ఇది. దీని వల్ల కోట్లాది ప్రజలు నానా రకాల ఇబ్బందులకు లోనయ్యాయి. నోట్ల రద్దు నిర్ణయం తర్వాత దేశ వ్యాప్తంగా నిర్వహించిన సమగ్ర సర్వేలో..ఆసక్తికరమైన..దిగ్ర్భాంతికర వాస్తవాలు వెలుగు చూశాయి. వందలు ..వేలు కాదు అన్ని రంగాలలో 50 లక్షల మందికి పైగా ఉపాధి కోల్పోయారు.
బెంగళూరులోని అజీమ్ ప్రేమ్‌జీ యూనివర్శిటీకి చెందిన సెంటర్ ఫర్ సస్టేయినబుల్ ఎంప్లాయిమెంట్ వెల్లడించింది. వీటిని భారీ ఎత్తున కోల్పోవడానికి నోట్ల రద్దు తో పాటు జీఎస్టీ కూడా మరో కారణం. పాలకులు నిర్ణయాలు తీసుకునే ముందు సునిశితంగా ఆలోచించాలి. లేక పోతే ఇలాంటి అనార్థాలే ఎక్కువగా జరిగేందుకు వీలుకలుగుతుంది. అన్నిటికంటే ఏ దేశానికైనా ఉద్యోగాల కల్పనే ముఖ్యం. అప్రకటిక నిరుద్యోగం మరో తీవ్రవాదానికి దారి తీస్తుంది. అది ఆర్థిక వ్యవస్థపై అత్యంత ప్రభావం చూపిస్తుంది. ఉద్యోగాలు కోల్పోవడం అన్నది అనాదిగా మెల మెల్లగా జరిగితే ..బీజేపీ పాలనలో అది ఊహించని స్థాయికి చేరుకుంది. 2011లో భారీ ఎత్తున కొలువులు కోల్పోయారు. నైపుణ్యం ఉండి..ఉద్యోగాలు రాక నానా తిప్పలు పడుతుంటే..ఇంకో వైపు అత్యున్నతమైన కోర్సులు చేసిన వారు చిన్న చిన్న ఉద్యోగాల కోసం పోటీ పడుతున్న పరిస్థితి ఈ దేశంలో దాపురించడం పాలకుల పనేనని సంస్థ ఆరోపించింది.
2017-2018 సంవత్సరంలో నిరుద్యోగుల సంఖ్య తో పాటు ఉపాధి కోల్పోయిన వాళ్లు లక్షలకు చేరారు. స్కిల్ డెవలప్‌మెంట్ పేరుతో పథకాలను ప్రవేశ పెట్టిన కేంద్ర సర్కార్ ..శాశ్వత ఉపాధి కల్పించేందుకు ఆ దిశగా చర్యలు చేపట్టలేక పోయారు. గ్రామాల్లో ఉపాధి హామీ పథకం లాగే పట్టణంలో గ్యారెంటీ హామీ పథకాన్ని ప్రవేశ పెడితే బాగుంటుందని సూచించింది. ఆయా గ్రామాల్లో 3 కోట్లకు పైగా చదువుకున్న వారు ఉద్యోగాల కోసం నిరీక్షిస్తున్నారు. జీడీపీలో ఎడ్యూకేషన్, వైద్యం, ఉపాధి కోసం ఎక్కువ నిధులు కేటాయించాలని కోరింది. ఎంతో వ్యవయప్రయాసలకు ఓర్చి ..అప్పులు చేసి పెద్ద పెద్ద చదువులు చదివిన వారు ఇపుడు కూలీ పనులకు రెడీ అంటున్నారు. మొత్తం మీద మోదీ సర్కార్ చదువుకున్న వారిని బిక్షగాళ్లను మార్చేశారు. మోదీజీ హ్యాట్స్ ఆఫ్ యూ..సర్..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి