ఎట్టకేలకు తెలంగాణ ఇంటర్ ఫలితాలు విడుదల
గత కొన్ని రోజులుగా ఎంతో ఉత్కంఠకు లోనవుతున్న తెలంగాణ రాష్ట్రంలోని ఇంటర్మీడియట్ విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు శాఖ ఉన్నతాధికారులు డాక్టర్ అశోక్, కార్యదర్శి జనార్దన్ రెడ్డిలు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను ప్రకటించారు. మేడ్చెల్ ప్రథమ స్థానంలో నిలువగా ..మెదక్ జిల్లా ఆఖరు స్థానంలో నిలిచింది. ఇంటర్ ప్రథమ సంవత్సరానికి సంబంధించిన ఫలితాల్లో 59.8 శాతం ఉత్తీర్ణత సాధించగా..ద్వితీయ సంవత్సరంలో 65 శాతంగా నమోదైంది. ఈ ఫలితాల్లో బాలికలే పై చేయి సాధించారు. బాలురు వెనక్కి తగ్గారు. గత ఏడాదితో పోలిస్తే ఈసారి పాస్ ఉత్తీర్ణత శాతం తగ్గడం గమనార్హం.
2018లో జరిగిన ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రథమ సంవత్సరం ఇంటర్ లో 62.73 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా..ఈ డాది 60.5 శాతం మాత్రమే రావడం ఆశ్చర్యానికి గురి చేసింది. గతేడాది ద్వితీయ సంవత్సరం ఇంటర్ లో 67.06 ఉత్తీర్ణత శాతం నమోదు కాగాఉ..ఈ ఏడాది ప్రకటించిన ఫలితాల్లో కేవలం 64.8 శాతం మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. తేడా 3 శాతంగా ఉన్నది. వెల్లడైన ఫలితాల్లో ఉత్తీర్ణతను గ్రేడ్ల వారీగా పరిశీలిస్తే ఇలా ఉన్నాయి. ఇంటర్మీడియట్ ఏ - గ్రేడ్లో 1, 28, 913 మంది ఉత్తీర్ణులయ్యారు. వీరి ఉత్తీర్ణత శాతం 52.1 గా నమోదైంది. ఇక బి - గ్రేడ్ పరంగా చూస్తే 70 వేల 54 మంది పాస్ కాగా..28.3 శాతం ఉత్తీర్ణత సాధించారు.
సి - గ్రేడ్ పరంగా చూస్తే 33 వేల 449 మంది పాసయ్యారు. వీరి శాతం 13.5 శాతంగా ఉంది. డి - గ్రేడ్‌లో 14 వేల 991 మంది విద్యార్థులు పాస్ కాగా ..6 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొదటి సంవత్సరం ఇంటర్ లో బాలికల ఉత్తీర్ణత శాతం 66 శాతంగా ఉండగా బాలుర ఉత్తీర్ణత శాతం 55 శాతం నమైదైంది. ఇక సెకండ్ ఇయర్ ఇంటర్ ఫలితాలను చూస్తే ఏ - గ్రేడ్ లో లక్షా 49 వేల 574 మంది ఉత్తీర్ణులు కాగా 60.4 శాతం సాధించారు. బి - గ్రేడ్‌లో 65 వేల 388 మంది పాస్ కాగా 26.4 ఉత్తీర్ణత శాతంగా ఉండగా..సి గ్రేడ్ లో 25 వేల 013 మంది హాజరు కాగా 10.1 శాతం ..డి - గ్రేడ్ లో 7 వేల 780 మంది పాస్ కాగా 3.1 ఉత్తీర్ణత శాతంగా నమోదైంది.
రెండో ఏడాది ఇంటర్ లో బాలికలు 70.8 శాతం ఉత్తీర్ణత సాధించగా ..బాలుర ఉత్తీర్ణత శాతం 58.2 శాతంగా నమోదైంది. మొత్తంగా చూస్తే ఈసారి బాలురను దాటేసి బాలికలు తామేమిటో నిరూపించుకున్నారు. వీరి ఫలితాలు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థినులకు స్ఫూర్తి కలిగిస్తుందనే అనుకోవాలి. తెలంగాణ రాష్ట విద్యా శాఖ కంటే ముందే ఆంధ్రప్రదేశ్ ఇంటర్ బోర్డు ఫలితాలు ప్రకటించింది. టీఎస్ విద్యా శాఖ ఫలితాల వెల్లడిలో జాప్యంపై విద్యార్థులే కాకుండా వారి తల్లిదండ్రులు కూడా తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఎట్టకేలకు రిజల్ట్స్ డిక్లేర్ చేయడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు..
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి