భాగ్యనగరానికి మరో మణిహారం
ఐటీ పుణ్యమా అని హైదరాబాద్ అన్ని రంగాల్లో దూసుకెళుతోంది. వ్యాపార, వాణిజ్య, ఐటీ రంగాలలో తనకంటూ ఓ స్పేస్ ఏర్పాటు చేసుకుంది ఈ నగరం. దేశ, విదేశాల నుండి వచ్చే వారంతా ఈ నగరాన్నే ఎన్నుకుంటున్నారు. పర్యాటక పరంగా కూడా తెలంగాణ ఇపుడు టాప్ పొజిషన్‌లో ఉంటోంది. ఇక్కడ కొలువుతీరిన కొత్త ప్రభుత్వం విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది. ఏ ఒక్కరికి ఇబ్బంది లేకుండా చూస్తోంది. ఇప్పటికే లక్షలాది జనాభా పెరిగి పోతుండడం..వసతుల కల్పనలో కొంత ఇబ్బంది ఏర్పడడంతో సర్కార్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. పారిశ్రామక వేత్తలకు పెట్టుబడులు పెట్టేందుకు ..కొత్త కంపెనీలు ఏర్పాటు చేసేందుకు వినూత్నమైన రీతిలో స్పెషల్‌గా ఇండస్ట్రియల్ పాలసీని తీసుకు వచ్చింది.
ఎవ్వరైనా సరే ఉపాధి కల్పించేలా కంపెనీలు ఏర్పాటు చేస్తామంటే .దరఖాస్తు చేసుకున్న ఏడు రోజుల్లోనే పర్మిషన్స్ ఇస్తారు. ఒకవేళ ఇవ్వక పోతే ..ఇచ్చినట్టే అనుకోవాల్సి ఉంటుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. భారీ ట్రాఫిక్ ఏర్పడడం..జనం పెరగడం..ఉపాధి కోసం గ్రామాల నుండి హైదరాబాద్‌కు వలస రావడంతో స్పేస్ సరిపోవడం లేదు.ఒకప్పుడు లక్షల్లో పలికిన భూములు, ప్లాట్లు, ఫ్లాట్స్, ఇండ్లు, విల్లాస్ ఇపుడు కోట్లు పలుకుతున్నాయి. అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పుణ్యమా అంటూ భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. రియల్ ఎస్టేట్ దందాతో పాటు నిర్మాణ రంగాలన్నీ లాభాల బాట పట్టాయి. కొత్త రాష్ట్రం ఏర్పడితే వ్యాపారాలు దెబ్బ తింటాయని ప్రచారం చేసిన వారికి దిమ్మ తిరిగేలా ..అన్ని రంగాల్లో తెలంగాణ రాణిస్తోంది. ఎక్కడ చూసినా కోట్లాది రూపాయల వ్యాపారం నడుస్తోంది. ముఖ్యంగా ఐటీ కంపెనీల ఏర్పాటుకు పోటీ పెరగింది.
టీ హబ్ మరో వైపు కొత్త వారిని ప్రోత్సహిస్తోంది. జనానికి ఇబ్బందులు లేకుండా ..నగరంలోని ప్రతి ప్రాంతానికి అనుసంధానం జరిగేలా ఇప్పటికే మెట్రోను విస్తరించారు. ఇపుడు భాగ్యనగరం మెడలో మరో మణిహారం కానున్నది. కొత్తగా బిహెచ్ఈఎల్ నుండి గచ్చిబౌలి మీదుగా లక్డీకాపూల్ దాకా మెట్రోను విస్తరించాలని ఢిల్లీ మెట్రో సంస్థ డీపీఆర్ ను సిద్ధం చేసేందుకు రెడీ అయింది. 29 కిలోమీటర్ల పొడవునా దీనిని ఏర్పాటు చేయనున్నారు. కీలక ప్రాంతాలను కలిపి మడో దశ కింద మెట్రో రైలు నిర్మాణం జరగనుంది. ఈ కొత్త రైల్వే లైన్ కోసం ఢిల్లీ సంస్థ రిపోర్టు పూర్తి చేసే పనిలో పడింది. జీహెచ్ఎంసీ, హెచ్ ఎం ఆర్ ఎల్ సంస్థలు దీనికి తోడ్పాటు అందించనున్నాయి. ఇప్పటికే మొదటి దశ కింద 72 కిలోమీటర్ల మేర నిర్మాణం జరగాల్సి ఉండగా..56 కిలోమీటర్ల దాకా పూర్తయింది.
మియాపూర్, ఎల్బీనగర్, హైటెక్ సిటీ నుంచి నాగోలు కారిడార్ వరకు రైళ్లు నడుస్తున్నాయి. రెండో దశలో గచ్చిబౌలి నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు దాకా 22 కిలోమీటర్ల పొడవునా నిర్మించేందుకు రంగం సిద్ధమైంది. దీనిపై త్వరలో సర్కార్ నిర్ణయం తీసుకోనుంది. మియాపూర్ నుంచి ఆల్వీన్ దాకా మరో రెండు కిలోమీటర్ల దాకా విస్తరించాలని కూడా నిర్ణయించినట్టు సమాచారం. మొత్తం మీద మెట్రో పరుగులు తీయడంతో ..లక్షలాది మందికి ఎంతో ప్రయోజనం చేకూరుతోంది. ఉద్యోగాలకు వెళ్లే వారు..వివిధ పనుల నిమిత్తం ప్రయాణం చేసే వారికి ఇబ్బందులు తప్పాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి