ఆఫీస్ స్పేస్‌ల ఏర్పాటులో మ‌న వైపే మొగ్గు

దేశంలో ఎక్క‌డికి వెళ్లినా ..కొత్త‌గా లేదా ఉన్న‌దానిని విస్త‌రించాల‌న్నా స్థ‌లం దొర‌క‌డం చాలా క‌ష్టం. లక్ష‌లు..ఒక్కోసారి కోట్లాది రూపాయ‌లు వెచ్చించాల్సి వ‌స్తోంది. అగ్రిమెంట్ ద‌గ్గ‌రి నుండి నిర్వ‌హ‌ణ దాకా అంతా భారంతో కూడుకున్న‌దే. ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగ‌ళూరు, త‌దిత‌ర న‌గ‌రాల‌న్నీ వ్యాపార‌, వాణిజ్య‌, ఐటీ కంపెనీలు కొలువుతీరి వున్నాయి. ఉద్యోగుల‌ను తీసుకోవ‌డం, సిబ్బందిని నియ‌మించు కోవ‌డం, వారికి సౌక‌ర్యాల‌ను ఏర్పాటు చేయ‌డం ఇవ‌న్నీ చేయాలంటే సెంట‌ర్లో స్పేస్ కావాలి. ఇపుడు వ్యాపార‌వేత్త‌ల‌కు, స్టార్ట‌ప్‌లు, ఆంట్ర‌ప్రెన్యూర్స్, కంపెనీ దిగ్గ‌జాలు, సంస్థ‌లు, వ్య‌క్తుల‌కు ..ఇన్నోవేట‌ర్స్ కు , యాజ‌మాన్యాల‌కు ఇబ్బందిక‌రంగా మారింది. దీంతో త‌మ వ్యాపారాల‌ను విస్త‌రించాలంటే స‌రైన చోటు కోసం కోట్లు ఖ‌ర్చు చేసేందుకు వెనుకాడ‌డం లేదు.

ఔత్సాహిక పారిశ్రామికవేత్త‌లు త‌మ ఆలోచ‌న‌ల‌ను రాకెట్ కంటే వేగంగా ఇంప్లిమెంట్ చేయాల‌ని త‌పిస్తున్నారు. అందుకోసం డిఫ‌రెంట్ మోడ‌ల్స్, డిజైన్స్‌తో అటు ఉద్యోగుల‌ను..ఇటు క‌స్ట‌మ‌ర్ల‌ను ఆక‌ట్టుకునేందుకు ..త‌మ వ్యాపారాల‌ను విస్త‌రించుకునేందుకు స్పేస్‌ను చేజిక్కించు కోవ‌డంపైనే దృష్టి సారిస్తున్నారు.వ్యాపారంలో లాభాలు ఆర్జించ‌డం కంటే ..ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా అంద‌రి దృష్టిని ఆక‌ర్షించేలా ..కార్య‌క‌లాపాలు నిర్వ‌హించేందుకు ప్ర‌ధాన కూడ‌ళ్ల వ‌ద్దే ఆఫీసులు ఉండేలా చూసుకుంటున్నారు. దీనిని గ‌మనించిన తెలంగాణ ఐటీ శాఖ ప్ర‌త్యేకంగా స్పేస్ ఇచ్చేందుకు టీ - హ‌బ్ ను ఏర్పాటు చేసింది. ఐడియాతో పాటు పెట్టుబ‌డితో వ‌స్తే చాలు..కావాల్సినంత స్థ‌లం ఇవ్వ‌డంతో పాటు అన్ని సౌక‌ర్యాలు అందుబాటులో ఉండేలా చేశారు.

దీని వెనుక జ‌యేష్ రంజ‌న్‌, శ్రీ‌నివాస్ కొలిప‌ర్ల కృషి..కేటీఆర్ ప్రోత్సాహం కూడా ఉంది. దేశంలోనే ఇది మొద‌టిది. దీనిని ప్ర‌త్యేకంగా మైక్రోసాఫ్ట్ సిఇఓ స‌త్య నాదెళ్ల‌, గూగుల్ సిఇఓ సుంద‌ర్ పిచ్చ‌య్, టాటా, మ్యూజిక్ దిగ్గ‌జం రెహ‌మాన్ లాంటి వాళ్లు ఇక్క‌డికి వ‌చ్చారు. దీనిని చూసి సంతృప్తిని వ్య‌క్తం చేశారు. టీఎస్ స‌ర్కార్ చేస్తున్న మంచి ప‌నిని ప్ర‌త్యేకంగా అభినందించారు. ఆఫీస్ స్సేస్ లీజుకు ఇవ్వ‌డంలో దేశ వ్యాప్తంగా ఏయే న‌గ‌రాలు, ప్రాంతాల‌ను కోరుకుంటున్నారోన‌ని సిబిఆర్ఇ నివేదిక ఇచ్చింది. ఊహించ‌ని రీతిలో ఐటీ ప‌రంగా టాప్ లో ఉండ‌డంతో హైద‌రాబాద్ నెంబ‌ర్ వ‌న్‌గా నిలిచింది. ఇదో రికార్డుగా భావించాలి. గ‌తంలో బెంగ‌ళూరు న‌గ‌రం మొద‌టి స్థానంలో వుంటే..ఈసారి ఆ కేపిటిల్ సిటీని దాటేసి భాగ్య‌న‌గ‌రం టాప్‌లో చేరింది.

త‌మ ఆఫీసులు ప్రారంభించేందుకు..వ్యాపారాలు చేప‌ట్టేందుకు దేశ , విదేశాల నుంచి కంపెనీలు, స్టార్ట‌ప్‌లు ఈ సిటీకే క్యూ క‌డుతున్నాయి. కొత్త ఆఫీసుల‌కు ఈ ప్రాంతం అడ్డాగా మారుతోంది. అనుకున్న వ‌స‌తులు, త‌క్కువ అద్దె, శాంతి భ‌ద్ర‌త‌ల విష‌యంలో ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా ఉండ‌డం, ప్ర‌భుత్వ ప‌రంగా పూర్తి భ‌ద్ర‌త క‌ల్పిస్తుండ‌డంతో కంపెనీలు జ‌య‌హో అంటున్నాయి. కేవ‌లం ఈ ఏడాది జ‌న‌వ‌రి -మార్చి మ‌ధ్య‌లో 35 ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల ఆఫీస్ స్పేస్‌ను లీజుకు ఇవ్వ‌డంతో ఈ రికార్డును చేరుకుంది. కంపెనీలు, వ్యాపార‌వేత్త‌లు ఈ న‌గ‌రాన్నే ఎంచుకోవ‌డంతో హెచ్ ఎం డిఏకు మ‌రింత ఆదాయం స‌మ‌కూరుతోంది.

కామెంట్‌లు