బైక్‌లకు పెరిగిన క్రేజ్..కార్లపై తగ్గిన మోజు..!
ప్రపంచ మంతటా లెక్కలేనన్ని కార్లు..మోడల్స్ తయారవుతుంటే..కోట్లాది రూపాయలు చేతులు మారుతుంటే..ఇండియాలో మాత్రం కార్ల అమ్మకాలు నత్తనడకన సాగుతున్నాయి. అదే సమయంలో బైక్‌ల కొనుగోలుకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. ఎక్కువగా యువతీ యువకులు వీటినే ప్రిఫర్ చేస్తున్నారు. కార్ల తయారీదారులు..కంపెనీలు ఇపుడు మధ్యతరగతి కుటుంబాలను టార్గెట్ చేసుకున్నాయి. తక్కువ ధరల్లో ఎక్కువ సౌకర్యవంతంగా ఉండేలా తయారు చేస్తున్నాయి. అప్పట్లో టాటా కంపెనీ విడుదల చేసిన నానో కారు దేశమంతటా సంచలనం సృష్టించింది. కేవలం లక్ష రూపాయలకే కారు అందజేస్తామని చేసిన ప్రకటన వ్యాపార వర్గాల్లో ముఖ్యంగా ఆటోమొబైల్ రంగాన్ని కుదిపేసింది.
రిలీజ్ అయ్యాక అది జనాన్ని ఆకట్టు కోలేక పోయింది. ఇంజన్ వెనుక వైపు ఉండడం. మరీ చిన్నదిగా..ఆటోను పోలి ఉండడంతో ఇండియన్స్ ఇముడ లేక పోయారు. కొన్ని కార్లు ఉన్నట్టుండి ఆగి పోవడం, సాంకేతిక సమస్యలు తలెత్తడంతో వీటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపించలేదు. దీంతో నానో కార్ల తయారీని తాము నిలిపి వేస్తున్నట్లు టాటా సంస్థలు ప్రకటించాయి. మార్కెట్‌లో హోండా, మారుతి, హ్యూందాయి, మహీంద్రా, ఫోర్డ్, రాయల్స్, తదితర కంపెనీల కార్లు హల్ చల్ చేస్తున్నా..ధరల్లోను..నాణ్యతలోను..సౌకర్యవంతంగా తీర్చిదిద్దడంలో ఇండియన్ కంపెనీ మారుతీ సంస్థ తనకు పోటీ లేకుండా చేసుకుంటూ వస్తోంది. ఎప్పటికప్పుడు మోడల్స్ రూపొందించడం, కస్టమర్ల సంతృప్తికి పెద్ద పీట వేయడం, తక్కువ ధరలకే అందించడం, సర్వీస్ సెంటర్లను ఏర్పాటు చేయడం, వినియోగదారులకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండడం, మార్కెట్‌లో ఒకవేళ కార్లను అమ్ముకో దలిచినా సరే..పెట్టిన ఖర్చు తిరిగి వచ్చేలా చేయడం ఈ కంపెనీ ప్రత్యేకత.
దీంతో ఇండియన్స్ అత్యధికంగా మారుతీ కంపెనీ తయారు చేసే కార్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఆ తర్వాతి స్థానాన్ని హ్యూందాయి, టాటాలు పోటీ పడుతున్నాయి. చిన్న కార్లతో పాటు పెద్ద కార్లను తయారు చేస్తున్నాయి. మారుతీ ఆల్టో , స్విఫ్ట్ కార్లకు విపరీతమైన డిమాండ్. సెలేరియో పేరుతో వచ్చిన కార్లకు భలే క్రేజ్ ఉంది. సెకండ్ హ్యాండ్ కార్లలో సైతం మారుతీ కార్లేకే డిమాండ్ ఎక్కువ. మారుతీ కంపెనీ ఏకంగా తానే ట్రూ వాల్యూ పేరుతో కార్లను విక్రయిస్తోంది. ఎలాంటి డ్యామేజ్‌లు లేకుండా గ్యారెంటీ కార్డుతో కస్టమర్లకు అందిస్తోంది. దీంతో ఎక్కడా నాణ్యత విషయంలో రాజీ పడడం లేదు. ఆటో మొబైల్ రంగంలో అందుకే మారుతీ కంపెనీ టాప్ స్థానంలో నిలిచింది. ఈసారి 2018 -2019 సంవత్సరంలో కేవలం కార్ల అమ్మకాలలో ఒక శాతం మాత్రమే వృద్ధి సాధించడం గమనార్హం.
2018లో మారుతీ సుజుకీ లక్షా 60 వేల 658 కార్లను అమ్మితే మార్చి 2019 నాటికి లక్షా 58 వేల 276 కార్లను మాత్రమే అమ్మగలిగింది. టొయోటా 13 వేల 537 కార్లను అమ్మగలిగితే..2019లో 13 వేల 662 అమ్మింది. మహీంద్రా కంపెనీ 62 వేల 76 కార్లను అమ్మగలిగితే..62 వేల 952 కార్లను విక్రయించింది. హోండా కార్లను 13 వేల 574 కార్లను అమ్మితే..2019లో 17 వేల 202 కార్లను అమ్మింది. ఇక మోటార్ బైక్‌ల విసజ్ఞానికి వస్తే..ద్విచక్ర వాహనాలకు భలే క్రేజ్ పెరిగింది. హీరో బైక్స్ 18 లక్షలకు పైగా అమ్ముడు పోయాయి. సుజుకీ బైక్స్ 7 లక్షల 47 వేలకు పైగా అమ్ముడు పోయాయి. కార్లకంటే బైకులే ఎక్కువగా అమ్ముడు పోవడం విశేషం. వీటి ధర తక్కువగా ఉండడం..కార్ల ధరలు ఆకాశాన్ని తాకడంతో జనం బైక్‌లనే కొనేందుకు మొగ్గు చూపిస్తున్నారు. మొత్తం మీద ఇండియాలో ఆటో మొబైల్ రంగంలో కొంచెం మందగమనం ఏర్పడినా..రాను రాను కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి