ఎన్ఐటి వ‌రంగ‌ల్‌కు ఎక్క‌డ‌లేనంత డిమాండ్

ఏ ముహూర్తాన నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాల‌జీ సంస్థ‌ను వ‌రంగ‌ల్‌లో స్థాపించారో కానీ ప్ర‌పంచంలో పేరొందిన దిగ్గ‌జ కంపెనీల‌న్నీ ఇటు వైపు చూస్తున్నాయి. సుశిక్షుతులైన అధ్యాప‌కులు..ప్ర‌శాంతమైన వాతావ‌ర‌ణం. దేశం గ‌ర్వించేలా స్టూడెంట్స్‌ను భావి భార‌త టెక్కీలుగా తీర్చిదిద్ద‌డంలో అన్ని సంస్థ‌ల కంటే ఎన్ఐటీ వ‌రంగ‌ల్ ముందంజ‌లో ఉంటోంది. విద్యార్థుల‌కు కావాల్సిన స‌దుపాయాల‌ను క‌ల్పిస్తోంది. చ‌దువుకునేలా ప్రోత్స‌హిస్తోంది. ప‌రిశోధ‌న‌లు చేసేలా తీర్చిదిద్దుతోంది. ప్ర‌పంచంలో ఎక్క‌డికి వెళ్లినా ఆ ప‌రిస్థితుల‌ను త‌ట్టుకునేలా..ఏ ప్రాబ్లం వ‌చ్చినా..ఏ ప్రాజెక్టు అంద‌జేసినా దానిని ప‌రిష్క‌రించేలా..పూర్తి చేసేలా త‌ర్ఫీదు ఇస్తున్నారు. అందుకే ఈ ఇనిస్టిట్యూట్‌లో సీటు రావాలంటే చాలా క‌ష్ట‌ప‌డాల్సి ఉంటుంది.

ల‌క్ష‌లాది విద్యార్థులు దేశ వ్యాప్తంగా ప్ర‌తి ఏటా నిర్వ‌హించే జేఇఇ మెయిన్స్ కు ప్రిపేర్ అవుతారు. ఈ ప‌రీక్ష‌ను రెండు ద‌ఫాలుగా నిర్వ‌హిస్తారు. మెయిన్స్‌లో అర్హ‌త సాధిస్తేనే అడ్వాన్స్ కు ఎంట‌ర్ అవుతారు. లేక‌పోతే ప్రిలిమిన‌రీలోనే తొల‌గి పోవాల్సి వ‌స్తుంది. నిద్రహారాలు మాని పోటీ ప‌డి ఈ ప‌రీక్ష‌కు ప్రిపేర్ అవుతారు. దేశ వ్యాప్తంగా సాధించిన ర్యాంకుల‌ను ఆధారంగా చేసుకుని ఐఐటీ సంస్థ‌ల‌లో సీట్లు కేటాయిస్తారు. చాలా మంది స్టూడెంట్స్ ఎన్ ఐటీ వ‌రంగ‌ల్‌ను ఎంచుకుంటారు. ఇక్క‌డ బోధ‌న వినూత్నంగా ఉంటుంది. ఇక్క‌డ చ‌దువుకున్న ప్ర‌తి విద్యార్థికి వంద శాతం ప్లేస్ మెంట్ దొరుకుతోంది. దీని ట్రాక్ రికార్డు ఇండియాలో ఓ రికార్డ్. అత్యున్న‌త‌మైన ఇంజ‌నీర్ల‌ను అందించాల‌నే స‌దుద్ధేశంతో అప్ప‌టి భార‌త ప్ర‌ధాన మంత్రి జ‌వ‌హ‌ర్ లాల్ నెహ్రూ 1959లో వ‌రంగ‌ల్‌లో ఎన్ ఐటి కాలేజీ కోసం ఫౌండేష‌న్ స్టోన్ వేశారు. గ‌తంలో దీనికి రీజిన‌ల్ ఇంజ‌నీరింగ్ కాలేజీగా పేరుండేది. ఇపుడు దీనిని ఇండియ‌న్ నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అని పిలుస్తున్నారు.

31 ఇంజ‌నీరింగ్ కాలేజీలు దేశంలో ఉండేవి. 2002లో ఆర్ ఇసి పేరును తీసేసి ఎన్ ఐటి గా మార్పు చేశారు. డాక్ట‌ర్ డి.ఎస్. రెడ్డి ఛైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించారు. మొద‌టి బ్యాచ్ స్టూడెంట్స్ ఈ కాలేజీలో సివిల్, ఎల‌క్ట్రిక‌ల్, మెకానిక‌ల్ ఇంజ‌నీరింగ్ బ్రాంచెస్ లో త‌ర‌గ‌తులు ప్రారంభ‌మ‌య్యాయి. తాత్కాలికంగా హ‌న్మ‌కొండ‌లోని బాల‌స‌ముద్రం ప్రాంతంలో కాలేజీని ఏర్పాటు చేశారు. ఇండ‌స్ట్రియ‌ల్ కాలనీలో క్లాసులు ఏర్పాటు చేశారు. ప్ర‌భుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో లేబొరేట‌రీ , వ‌ర్క్ షాప్ త‌ర‌గ‌తులు నిర్వ‌హించారు. 1963లో పూర్తి స్థాయిలో కాజిపేట‌లో ఆర్ ఇ సి కాలేజీ ప్రారంభ‌మైంది. బ్యాచిల‌ర్ ఆఫ్ కెమిక‌ల్ ఇంజ‌నీరింగ్ కోర్సు 1964లో స్టార్ట్ చేశారు. మెటాలూర్జిక‌ల్ ఇంజ‌నీరింగ్ ప్రోగ్రాం కోర్సు 1971లో ప్రారంభ‌మైంది. బిటెక్ కంప్యూట‌ర్ సైన్స్ అండ్ ఇంజ‌నీరింగ్ కోర్సు 1983లో స్టార్ట్ చేశారు. ఎంటెక్ కంప్యూట‌ర్ సైన్స్ ఇంజ‌నీరింగ్ కోర్సును 1987లో ప్రారంభించారు. బ్యాచిల‌ర్స్ ప్రోగ్రాం ఇన్ బ‌యో టెక్నాల‌జీ కోర్సును 2006లో కొత్త‌గా ఇంట్రడ్యూస్ చేశారు.

డీమ్డ్ యూనివ‌ర్శిటీ స్టేట‌స్‌ను 2002లో కేంద్ర స‌ర్కార్ ప్ర‌క‌టించింది. ఇన్మ‌ఫ‌ర్మేష‌న్ టెక్నాల‌జీ ప‌రంగా ఓవ‌ర్సీస్ డెవ‌ల‌ప్‌మెంట్ అడ్మినిస్ట్రేష‌న్ విష‌యంలో యుకెతో ఎన్ ఐటీ వ‌రంగ‌ల్ 1994లో ఒప్పందం చేసుకున్నాయి. 1999 వ‌ర‌కు కొన‌సాగింది. 2000లో ఎంబీఏను ఈ సంస్థ‌లో ప్రారంభించారు. 2001లో సెంట‌ర్ ఆఫ్ సాఫ్ట్ వేర్ టెక్నాల‌జీ పార్క్‌ను ఓపెన్ చేశారు. 2002లో ఎన్ఐ టీగా, ఇనిస్టిట్యూట్ ఆఫ్ నేష‌న‌ల్ ఇంపార్టెన్స్ 2007లో ద‌క్కింది. ఈ సంస్థ 256 ఎక‌రాల స్థలం క‌లిగి ఉన్న‌ది. ప‌రిపాల‌నా భ‌వ‌నం, అక‌డ‌మిక్ భ‌వ‌నం, లైబ్ర‌రీ , స్టూడెంట్స్ హాస్ట‌ల్స్, స్పోర్ట్స్ పెవిలియ‌న్ అండ్ గ్యాల‌రీ, డైరెక్ట‌ర్స్ బంగ్లా, స్టాఫ్ క్వార్ట‌ర్స్, గెస్ట్ హౌస్ ఇందులో భాగంగా ఉన్నాయి. డాక్ట‌ర్ వి.ఏ శాస్త్రి సెంట‌ర్ ఫ‌ర్ ఇన్నోవేష‌న్ అండ్ ఇంక్యూబేష‌న్ ను ప్రారంభించారు. వెబ్ అండ్ సాఫ్ట్ వేర్ డెవ‌ల‌ప్ మెంట్ సెల్ కూడా ఉంది. ఇన్నోవేష‌న్ గ్యారేజీ కూడా ప్ర‌త్యేకంగా ఉంది.

సెమినార్లు, స‌ద‌స్సులు, స‌మావేశాలు, స‌మాలోచ‌న‌లు జ‌రిపేందుకు విస్తృత ఏర్పాట్లు చేశారు. నేష‌న‌ల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ర్యాంకింగ్ ఫ్రేం వ‌ర్క్ ఈ సంస్థ‌కు 15వ ర్యాంకు ప్ర‌క‌టించింది. ఇక్క‌డ చ‌దువుకునే ప్ర‌తి విద్యార్థికి క‌చ్చితంగా ప్లేస్ మెంట్ దొరుకుతోంది. నెల‌కు 4 ల‌క్ష‌ల వేత‌నం నుండి 16 ల‌క్ష‌ల దాకా ఉద్యోగాలు పొందిన వారు ఎంద‌రో ఉన్నారు. జేఇఇ మెయిన్ ప‌రీక్ష‌లో సాధించిన ర్యాంకుల ఆధారంగా సీట్లు కేటాయిస్తారు. భారీ ఎత్తున పోటీ ఉంటుంది. జూలై, డిసెంబ‌ర్‌ల‌లో రెండు సార్లు పిహెచ్‌డి అడ్మిష‌న్ల కోసం నోటిఫికేష‌న్ జారీ చేస్తారు. ఐటీ దిగ్గ‌జ కంపెనీలు ఎన్ఐటీ వ‌రంగ‌ల్ స్టూడెంట్స్ కోసం క్యూ క‌డుతున్నాయి. విద్యా ప్ర‌మాణాల‌ను కాపాడుతూ కుర్రాళ్ల‌ను మెరిక‌ల్లాగా త‌యారు చేస్తోంది ఈ సంస్థ‌. ఇందులో సీటు ద‌క్కించు కోవ‌డం అంటే ..జీవితాల‌ను సుఖ‌మ‌యం చేసుకోవ‌డం అన్న‌మాట‌.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!