ఫైనాన్షియల్ రంగంలో దివ్య సంచలనం..!
నిన్నటి దాకా ప్రపంచం వైపు మనం చూస్తే..ఇపుడు లోకమంతా భారతదేశం వైపు చూస్తోంది. టెక్నాలజీ, మేనేజ్‌మెంట్, ఆధ్యాత్మిక , వ్యాపార తదితర రంగాలలో ఇండియన్స్ తమ సత్తా చూపిస్తున్నారు. అంతులేని విజ్ఞానాన్ని స్వంతం చేసుకుని..అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్నారు. సమాజాన్ని శాసిస్తున్న ఐటీ రంగంలో మనోళ్లే టాప్. టాప్ టెన్ దిగ్గజ సంస్థలలో కీలకమైన పదవుల్లో, విభాగాల్లో ఇండియన్సే బాధ్యతలు నిర్వహించడం మన వారి క్రియేటివిటికీ అద్దం పడుతోంది. తమిళనాడకు చెందిన సుందర్ పిచ్చయ్ గూగుల్ సిఇఓగా సక్సెస్‌ఫుల్‌గా రాణిస్తున్నారు. పురుషులతో ధీటుగా మహిళలు తమ శక్తి సామర్థ్యాలకు పదును పెడుతూ ప్రపంచపు ప్రతిభావంతుల సరసన నిలబడుతున్నారు. జగమెరిగిన ఫోర్బ్స్ వెల్లడించిన ప్రభావశీలుర జాబితాలో మనోళ్లు కూడా చోటు దక్కించుకుంటున్నారు. ఇదంతా కొన్నేళ్లుగా భారతీయులు తమను తాము నిరూపించుకునేందుకు అష్టకష్టాలు పడుతున్నారు.
ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన సంస్థలు , ఐటీ దిగ్గజాలు ఇండియా వైపు అడుగులు వేస్తున్నాయి. టాలెంట్‌తో పాటు కమిట్‌మెంట్ కలిగిన వీరి వైపే మొగ్గు చూపుతున్నారు. ఇలాంటి క్లిష్ట సమయంలో అట్టడుగున ఉన్న సంస్థలను అత్యున్నత సంస్థలుగా మార్చడంలో మన వాళ్లు సక్సెస్ అయ్యారు. దీంతో అత్యధికంగా ప్రయారిటీ మనకే దక్కుతోంది. వరల్డ్ వైడ్‌గా జనరల్ మోటార్స్‌కు ఉన్నంత పేరు ఇంకే కంపెనీకి లేనేలేదు. చెన్నైయికి చెందిన దివ్య సూర్యదేవర ఒక్కసారిగా ప్రపంచ వ్యాప్తంగా వైరల్‌గా మారింది. దీని వెనుక వున్న ప్రత్యేకత ఏమిటంటే అత్యున్నతమైన ఈ కంపెనీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్‌గా ఇండియన్ నియమించడం..అదీ మొదటి మహిళ కావడం ఓ రికార్డు. చాలా బాధ్యతతో కూడిన ఉద్యోగం ఇది. దీనిని చేపట్టాలంటే ఎంతో అనుభవంతో పాటు సమర్థత కూడా ఉండాలి. ఫోర్బ్స్ మేగజైన్ ప్రకటించిన అత్యున్నతమైన ..ప్రభావం చూపిన వ్యక్తులు 40 మందిని ఎంపిక చేసింది. అందులో దివ్య సూర్యదేవర కూడా ఒకరు.
మోస్ట్ ఇన్‌స్పైరింగ్ ఉమెన్ గా ఆమె పేరు తెచ్చుకుంది. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయింది. ఇద్దరు చెల్లెల్లు, తల్లితో పాటు ఆమె ఉంటోంది. చెన్నయిలోని మందవేలిలో సెయింట్ జాన్స్ సీనియర్ సెకండరీ స్కూల్‌లో ఆమె చదివారు. ఎథిరాజ్ కాలేజ్ ఆఫ్ కామర్స్ లో డిగ్రీ పూర్తి చేశారు. ఇనిస్టిట్యూట్ ఆఫ్ చార్టెడ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియాలో చార్టెడ్ అక్కౌంటెన్సీ కోర్సు పూర్తి చేశారు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్‌లో ఎంబీఏ చదివారు. చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ గా పేరు తెచ్చుకున్నారు. 2002 సంవత్సరంలో ప్రపంచ బ్యాంకులో ఫైనాన్షియల్ అనలిస్ట్‌గా ఇంటర్నిషిప్ చేశారు. అనంతరం ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ లో పని చేశారు. యుబిఎస్‌లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంకింగ్‌లో అనలిస్ట్‌గా పేరు తెచ్చుకున్నారు. ఆమె పనితీరుకు మెచ్చిన ప్రపంచ దిగ్గజ కంపెనీ జనరల్ మోటార్స్ దివ్య సూర్యదేవరకు అద్భుతమైన పదవితో పాటు బంపర్ ప్యాకేజీ ఇచ్చారు.
చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్‌గా ఆమె జనరల్ మేనేజర్‌గా అస్సెట్ మేనేజ్‌మెంట్ విభాగంలో బాధ్యతలు నిర్వర్తించారు. 2017లో ఫైనాన్స్ విభాగంలో కోశాధికారిగా, వైస్ ప్రెసిడెంట్‌గా ఎంపికయ్యారు దివ్య సూర్యదేవర. 2015లో ప్రపంచాన్ని ప్రభావితం చేసిన శక్తివంతమైన మహిళల్లో దివ్యను ఎంపిక చేశారు. దీంతో ఒక్కసారిగా ప్రపంచం ఆమె వైపు చూస్తోంది. తండ్రిని కోల్పోయిన బాధను దిగమింగుకుని ..అమెరికాలోనే అత్యున్నతమైన కంపెనీకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ స్థాయికి చేరుకోవడం భారతదేశానికి గర్వకారణం. కోట్లాది యువతీ యువకులకు ఆమె ఆదర్శప్రాయం. కష్టాలను దాటుకుని..కన్నీళ్లను దిగమింగుకుని ..విజయ తీరాలకు చేరిన ఆమె జీవితం ఎందరికో స్ఫూర్తి దాయకంగా నిలుస్తోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి