నెట్ ఫ్లిక్స్ ఎండీగా స్వాతి మోహన్
వీడియో స్ట్రీమింగ్ లో వరల్డ్ వైడ్ గా టాప్ పొజిషన్ లో కొనసాగుతున్న మరో దిగ్గజ కంపెనీ నెట్ ఫ్లిక్స్ కంపెనీ లో మన ఇండియాకు చెందిన స్వాతి మోహన్ కు అరుదైన అవకాశం లభించింది. మీడియా రంగంలో .. మార్కెటింగ్ విభాగంలో అద్భుతమైన రీతిలో అనుభవం గడించిన ఈ ఇండియన్ అమ్మాయి స్వాతి మోహన్ తాజాగా అమెరికా దిగ్గజ కంపెనీగా పేరున్న నెట్ ఫ్లిక్స్ కంపెనీ మార్కెటింగ్ డైరెక్టర్ గా ఎంపికైంది. ఈ మేరకు నెట్ ఫ్లిక్స్ కంపెనీ యాజమాన్యం స్వాతి మోహన్ ను ఎంపిక చేసినట్లు వెల్లడించింది. స్వాతి మోహన్ అంతకు ముందు నేషనల్ జియోగ్రాఫిక్ అండ్ ఫాక్స్ నెట్ వర్క్స్ గ్రూప్ ఇండియా కంట్రీ హెడ్ గా పని చేశారు.
ఆ కంపెనీలో స్వాతి భాద్యతలు చేపట్టాకా భారీ ఆదాయాన్ని తీసుకు వచ్చారు. దీంతో నెట్ ఫ్లిక్స్ ఆమె పనితీరు నచ్చి బిగ్ ఆఫర్ ప్రకటించింది. ఇక నెట్ ఫ్లిక్స్ వీడియో స్ట్రీమింగ్ ప్లేట్ ఫామ్ మీద పనిచేస్తోంది. ప్రారంభించిన కొద్దీ కాలంలోనే మిగతా అమెజాన్, గూగుల్ , తదితర కంపెనీల సరసన చేరింది. డిజిటల్ మీడియాలో నెట్ ఫ్లిక్స్ ఇప్పుడు ఓ సంచలనం. నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ కు కోట్లాది మంది వ్యూవర్స్ ఉన్నారు. దీని వెనుక స్వాతి మోహన్ కృషి ఉన్నది. సదరు కంపెనీలో ఆమె దాదాపు ఆరేళ్లకు పైగా పని చేశారు.
దానిని లాభాల బాట పట్టించారు. ఇందులో నేషనల్ డైరెక్టర్ గా పూర్తి స్థాయిలో బాధ్యతలు నిర్వహించారు. ఎంటర్ టైన్మెంట్ , స్పోర్ట్స్ అండ్ పార్ట్నర్ షిప్ విభాగాల్లో పని చేశారు స్వాతి మోహన్. మరో డైరెక్టర్ మిడ్ షేర్ తో కలిసి కంపెనీని పరుగులు పెట్టించారు. ఇదే కాకుండా ఆమె ఎండేమోల్ ఇండియా, ఏఫ్బీసీ మీడియా, రెడ్ ఐస్ ఫిలిమ్స్ అండ్ ఒగిల్వి ఇండియా కంపెనీల్లో పని చేశారు. అయితే ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో ఆమె చేరడంతో కంపెనీ ఎదిగే
ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. నెట్ ఫ్లిక్స్ కు 125 మిలియన్ మెంబర్స్ ఉన్నారు. సదరు కంపెనీ 190 దేశాలకు విస్తరించింది. 140 మిలియన్ అవర్స్ , టీవీ షోస్ , సినిమాలు ప్రతి రోజు వీక్షిస్తున్నారు. మొత్తమే మీద మనోళ్లు సక్సెస్ తో దుమ్ము రేపుతున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి