పబ్లిసిటీ వద్దు సాయమే ముద్దు
తెలుగు సినిమా రంగంలో ఎందరో హీరోలు. కోట్లాది రూపాయలున్నా సమస్యల్లో ఉన్నప్పుడు స్పందించడం చాలా అరుదు. కొంత మంది మాత్రమే తమ దాతృత్వాన్ని చాటుకుంటున్నారు. తాజాగా మహేష్ బాబు ఓ చిన్నారికి గుండె శస్త్ర చికిత్స కోసం అవసరమయ్యే ఖర్చు భరిస్తానని చెప్పారు. అంతకు ముందు రెండు తెలుగు రాష్ట్రాలలో రెండు ఊర్లను దత్తత తీసుకున్నారు. ఆయనతో పాటు మరికొందరు తమ మానవతను చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా వర్ధమాన నటుడు సాయి ధరమ్ తేజ్ ఒక అడుగు ముందుకేసి తన పుట్టిన రోజున ఫ్యాన్స్ ఎలాంటి ప్రోగ్రామ్స్ చేయొద్దని కోరారు.
అంతే కాకుండా డబ్బులు లేక మధ్యలోనే ఆగి పోయిన వృద్ధాశ్రమానికి తాను చేయూత ఇవ్వాలని డిసైడ్ అయ్యానని ట్విట్టర్ వేదికగా తెలిపారు. అనవసరంగా డబ్బులు ఖర్చు చేయకుండా మంచి పనుల కోసం ఉపయోగించాలని పిలుపునిచ్చారు. మధ్యలో ఆగి పోయిన వృద్ధాశ్రమం పూర్తి చేయడంతో పాటు ఏడాది కాలానికి సరిపడా నిర్వహణ ఖర్చు, వసతులను ఏర్పాటు చేస్తానని తెలిపారు. ఈ సందర్బంగా ఓ వీడియోను అభిమానుల కోసం విడుదల చేశారు. నా పుట్టిన రోజున అన్నదానాలు, రక్తదాన శిబిరాలు చేస్తున్నారు. మీకు అభినందనలు. అయితే నేనో నిర్ణయం తీసుకున్నా.
అదేమిటంటే ఇప్పటి దాకా చిన్న చిన్న సమస్యలను పరిష్కరించాం. ఈసారి ఏదైనా సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తే బావుంటుందని అనిపించింది. ఒక వృద్దాశ్రమం వాళ్ళు తమకు సాయం చేయమని అడిగారు. ఆ మొత్తాన్ని నేను భరించేందుకు సిద్ధంగా ఉన్నానని తెలిపానని చెప్పారు. అయితే ఇదేదో గొప్పలు చెప్పు కోవడానికో నేను చెప్పడం లేదు..నాలాగా మరికొందరు స్పందిస్తే ఇంకొన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఇలా మీతో పంచుకుంటున్నానని పేర్కొన్నారు. ఈ రకంగా సై ధరమ్ తేజ్ తాను రీల్ హీరో కాదని రియల్ హీరోనని చాటుకున్నారు.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి