దాదా రాక..బీసీసీఐలో కాకా

బీసీసీఐకి ప్రెసిడెంట్ గా టీమిండియా మాజీ సారథి, బెంగాల్ టైగర్, దాదాగా పేరున్న సౌరబ్ గంగూలీ  ఖాయం కావడంతో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో కాకా మొదలైంది. ఇప్పటికే డేరింగ్, డాషింగ్ ప్లేయర్ గా సౌరబ్ కు పేరుంది. బీసీసీఐలో కోట్లాది రూపాయలు కొలువు తీరి ఉన్నాయి. ఇదే సమయంలో బాధ్యతలు చేపట్టక ముందే గంగూలీ తన ఆపరేషన్ ను స్టార్ట్ చేశాడు. గంగూలీ రావడంతో టీమిండియా జట్టు కోచ్ రవిశాస్త్రి పునరాలోచనలో పడ్డాడు. వీరిద్దరి మధ్య మాటలు లేవు. ఇదిలా ఉండగా తాజాగా గంగూలీ ఇండియన్ సారధి కోహ్లీతో పాటు జట్టు సభ్యుల ఆట తీరుపై ఘాటుగా కామెంట్స్ చేశాడు. కోహ్లి కెప్టెన్సీలో మన జట్టు మంచి ప్రదర్శనలు చేస్తోందని కొనియాడాడు.

అయితే, కీలకమైన ఐసీసీ టోర్నమెంట్లలో చివరి దశలో ఓటమి చవి చూస్తున్నారని, దీనిని అధిగమించడంపై దృష్టి పెట్టాలని సూచించాడు. ఇక 2019 వన్డే ప్రపంచకప్‌లో టీమిండియా నాకౌట్‌లోనే వెను దిరిగిన సంగతి తెలిసిందే. మాంచెస్టర్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 18 పరుగుల తేడాతో కోహ్లి సేన ఓటమి పాలైంది. అయితే, గంగూలీ ఈ విషయాన్ని నొక్కి చెప్పనప్పటికీ ఐసీసీ టోర్నీలో కడ వరకు నిలిచి విజేతగా నిలవాలని ఆకాక్షించాడు. ఇండియన్‌ టీమ్‌ పటిష్టంగా ఉంది. అయితే, ఇటీవల జరిగిన ఐసీసీ టోర్నమెంట్లలో విజయం సాధించలేక పోతున్నారు. ఆటగాళ్లంతా అద్భుత ప్రదర్శన చేస్తున్నప్పటికీ సెమీఫైనల్‌, ఫైనల్స్‌లో బోల్తా పడుతున్నారు. విరాట్‌ ఓ చాంపియన్‌ అని సౌరవ్‌ కోల్‌కతాలో చెప్పుకొచ్చాడు.

ఇక 2013లో ధోని సారథ్యంలో ఐసీసీ చాంపియన్స్‌ ట్రోఫి గెలిచిన టీమిండియా.. ఆ తర్వాత ఐసీసీ టోర్నీల్లో విజేతగా నిలవలేదు. అదేవిధంగా.. కోహ్లి సారథ్యంలో టీమిండియా ఇంటా బయటా మెరుగైన ఆటతో దూసుకెళ్తోంది. విదేశీ గడ్డపై భారత్‌ పలు టెస్టు సిరీస్‌లను ఖాతాలో వేసు కోవడమే ఇందుకు నిదర్శనం. అయితే, టోర్నీ చివరి దశకు వచ్చే సరికి భారత ఆటగాళ్లు ఒత్తిడికి గురువుతున్న మాట వాస్తవం. మొత్తం మీద గంగూలీ తన ఆపరేషన్ ను షురూ చేశాడు. రాబోయే రోజుల్లో ఇంకెన్ని మార్పులు చోటు చేసుకుంటాయో వేచి చూడాలి. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!