ఈగోలు పక్కన పెట్టండి..సమ్మె పరిష్కరించండి - హైకోర్టు
ఆర్టీసీ సమ్మెకు సంబంధించి రాష్ట్ర హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఓ వైపు కార్మికులు..మరో వైపు ప్రభుత్వం ఎవరికి వారే మంకుపట్టు వీడడం లేదు. దీని వల్ల ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ప్రభుత్వం ఆర్టీసీ జేఏసీ ..చర్చలు జరపాలి. ఓ వైపు పిల్లలలు చదువుకు దూరమవుతున్నారు. ఈగోలు పక్కన పెట్టండి జనాన్ని దృష్టిలో పెట్టుకుని సమ్మె విరమించండి. ఈ సందర్బంగా ఇరు వర్గాల తరపున కోర్టులో న్యాయవాదులు తమ వాదనలు వినిపించారు. ధర్మాసనం ఓ సమయంలో ప్రభుత్వ అడ్వొకేట్ జనరల్ ను సమ్మె జరుగుతుంటే ప్రభుత్వం ఏం చేస్తోందంటూ తీవ్ర స్థాయిలో ప్రశ్నించింది. సమస్య పరిష్కారానికి ఎలాంటి చర్యలు చేపట్టారో తెలియ చేయండి అని ఆదేశించారు. యుద్ధ ప్రాతిపదికన చర్యలకు ఉపక్రమించాలి.
సమ్మె పరిష్కారానికి సంబంధించిన డ్రాఫ్ట్ అందజేయాలని ఆదేశించింది. ఆర్టీసీ ఉద్యోగులు పరాయి వారు కాదు..వాళ్ళు మీ సంస్థలో ఉద్యోగులే. మరి వారితో చర్చలు జరిపితే తప్పేముందంటూ నిలదీసింది. ఇదే సమయంలో కార్మికులు సమ్మె విరమించి చర్చలకు వెళ్లాలంటూ కీలక వ్యాఖ్యలు చేసింది హైకోర్టు. సమ్మె తర్వాత ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలని ప్రశ్నించింది. కార్మికులకు వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ఆర్టీసీ సమ్మెపై దాఖలైన పలు పిటిషన్లను ఒకేసారి హైకోర్టు విచారణ చేస్తోంది. అయితే ఆర్టీసీని విలీనం చేయలేమని..ప్రభుత్వం సిద్దంగా లేదని సర్కారు తరఫున అడ్వకేట్ జనరల్ కోర్టుకు
తెలిపారు.
కార్మికులు గొంతెమ్మ కోరికలు కోరుతున్నారని కోర్టుకు చెప్పారు. ఐతే..దీనిపై హైకోర్టు సీరియస్ గా స్పందించింది. ప్రభుత్వం గానీ…కార్మిక, ఉద్యోగ సంఘాలు గానీ ఈగోలకు వెళ్లకండి.. ప్రజా రవాణా వ్యవస్థకు సంబంధించిన వ్యవస్థ కాబట్టి.. ప్రభుత్వానికి బాధ్యత లేదా అంటూ అడ్వకేట్ ను ప్రశ్నించింది. ఆర్టీసీకి పర్మనెంట్ ఎండీ ఇప్పటి వరకు లేరు.. అందుకే సమస్య పరిష్కరించలేక పోతున్నాం అని అడ్వకేట్ కోర్టుకు చెప్పారు. దీంతో మరోసారి కోర్టు సీరియస్ అయింది. ఎండీ లేరని.. ఫైల్స్ లేవని, అధికారులు లేరని చెప్పడం సమస్యకు పరిష్కారం కాదు. పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. సమస్యను మరింత జటిలం చేయకూడదు. అలా చేస్తే అది చేతగాని చర్యే అవుతుంది. సమ్మె సమస్యకు ఎటువంటి పరిష్కారం చూపుతారో వివరాలు సమర్పించాలని కోరింది.
ప్రభుత్వం, ఆర్టీసీ యూనియన్ల పట్టుదల మధ్యలో ప్రజలు నలిగి పోతున్నారని న్యాయస్థానం అభిప్రాయ పడింది. కార్మికులు నిరసన తెలిపేందుకు అనేక మార్గాలు ఉన్నాయని కోర్టు తెలిపింది. అయితే కార్మికులను ప్రభుత్వం సెల్ఫ్ డిస్మిస్ చేసిందని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వ నిర్ణయంతో కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆర్టీసీ జేఏసీ తెలిపింది. సమ్మె విరమిస్తే తమ సమస్యలు పరిష్కారం కావని పేర్కొంది. మొత్తంగా వాదనలు పూర్తి కావడంతో హైకోర్టు 18 కి వాయిదా వేసింది. అంత లోపు ఇరువురు శుభవార్తతో రావాలని కోరింది. కాగా సమస్యలు పరిష్కారం అయ్యేంత దాకా తమ సమ్మెను విరమించబోమని జేఏసీ నేతలు అశ్వత్థామ రెడ్డి, రాజి రెడ్డిలు స్పష్టం చేశారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి