అందనంత దూరంలో షావోమి
చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్స్ మొబైల్స్ కంపెనీ దిగ్గజ మొబైల్స్ కంపెనీలకు చుక్కలు చూపిస్తోంది. అమ్మకాలలో అందనంత దూరంలో దూసుకు పోతోంది. దీంతో ఏం చేయాలో దిగ్గజ కంపెనీలు పాలుపోక తల్లడిల్లుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద మార్కెట్ వాటా కలిగిన ఇండియా మొబైల్స్ మార్కెట్ లో తమ వాటా పెంపొందించుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయినా కొనుగోలుదారులు, మొబైల్స్ ప్రేమికులు మాత్రం డోంట్ కేర్ అంటున్నారు. ఎక్కువ ఫీచర్స్, ధరల్లో సామాన్యులు, మిడిల్ క్లాస్ పీపుల్స్ అందుకోలేంతగా ఉండడంతో యాపిల్, శాంసంగ్, వన్ ప్లస్ మొబైల్స్ జోలికి వెళ్లడం లేదు. ఇదే సమయంలో ఇటీవలే షావోమి కంపెనీ చైర్మన్ ఇండియాలో పర్యటించారు. అంతే కాకుండా షావోమి అమ్మకాల్లో స్మార్ట్ ఫోన్స్ తో పాటు మిగతా ప్రోడక్ట్స్, యాక్సరీస్ 10 మిలియన్స్ కు పైగా అమ్ముడు పోయాయి.
దీంతో దిగ్గజ కంపెనీలు షావోమి కొట్టిన దెబ్బకు అబ్బా అంటున్నాయి. షావోమి కంపెనీ చరిత్రలో ఇదో అద్భుత రికార్డ్. ఇదిలా ఉండగా షావోమి కంపెనీ ఇండియా హెడ్ గా మను కుమార్ జైన్ భాధ్యతలు చేపట్టాకా, సదరు కంపెనీ స్వరూపమే పూర్తిగా మారి పోయింది. షావోమిలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకు వచ్చాడు. అంతే కాదు మిగతా కంపెనీలకు భిన్నంగా కొనుగోలుదారులు ఆనందం పొందేలా, ఊహించని రీతిలో బంపర్ ఆఫేర్లుతో పాటు మనసు దోచుకునేలా బహుమతులు ఇచ్చేలా ఏర్పాటు చేశాడు. షావోమి మొబైల్స్ అటు ఆఫ్ లైన్ లోను, ఇటు ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచాడు. దేశంలోని ప్రతి ప్రాంతంలో షావోమి ఉండేలా చర్యలు చేపట్టాడు.
ఇప్పుడు జియో షాప్ ఎక్కాడు వుందో అక్కడ షావోమి షాప్ కూడా ఉంటోంది. షేరింగ్ ప్రాసెస్ తో పాటు స్వంతంగా దుకాణం ఏర్పాటు చేసుకునే వెసలుబాటు కల్పించాడు. దీంతో అమ్మకాలు పెరిగాయి. అంతకుమించి ఏకంగా 10 మిలియన్లకు పైగా షావోమి ఫోన్స్, యాక్సెసరీస్ అమ్ముడు పోయాయి. ఇదంతా మను కుమార్ జైన్ వల్లనే జరిగింది. ఆయనకు షావోమి కంపెనీ వేతనం పెంచడమే కాదు ప్రమోషన్ కూడా ఇచ్చింది. ఇదే సమయంలో కంపెనీ ఉన్నతికి దోహదపడిన ఉద్యోగులతో కలిసి మను కుమార్ జైన్ భోజనం చేశారు. తాను కూడా సామాన్యుడినేనని చాటి చెప్పారు. సక్సెస్ అంటే డామినేట్ చేయడం కాదు ప్రేమతో కలిసి పోవడం అన్నమాట.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి