టెలికాం రంగంలో 5జీ సంచలనం
ఇప్పటికే టెలికాం రంగాన్ని 4 జీ సేవలు షేక్ చేస్తుండగా దానిని అధిగమిస్తూ 5జీ సేవలు రాబోతున్నాయి. ఇప్పటికే ఫైబర్ నెట్ వర్క్ ఇండియా అంతటా విస్తరించింది. ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ వాటా కలిగిన దేశంగా ఇండియాకు పేరున్నది. దాదాపు 130 కోట్ల మంది జనాభా కలిగి వుంటే, ఇందులో 118 కోట్ల మంది ప్రభుత్వ రంగ సంస్థ బిఎస్ ఎన్ఎల్ తో పాటు ప్రైవేట్ టెలికాం కంపెనీలు జియో, ఎయిర్ టెల్ , టాటా, వోడా ఫోన్ , తదితర కంపెనీలలో కనెక్షన్ కలిగి ఉన్నారు. ఇటీవలే రిలయన్స్ గ్రూప్ కంపెనీకి చెందిన జియో ఇండియాలో టాప్ పొజిషన్ లో కి చేరుకుంది. భారీ ఆఫర్స్, అపరిమిత డేటా ఇవ్వడంతో ఒక్క సారిగా 34 కోట్ల మంది జియోలో చేరారు. కనెక్టివిటీ, డేటా, కాల్స్ చేసుకునే సదుపాయం ఉండడంతో దీని వైపు మొగ్గారు. మరో వైపు మొదటి స్థానంలో ఉన్న ఎయిర్ టెల్ కిందకు దిగజారింది.
ఇదిలా ఉండగా 4 జీ సేవల స్థానంలో మరింత వేగంగా నెట్ కనెక్టివిటీ ఉండేందుకు టెలికాం కంపెనీలు వరల్డ్ వైడ్ గా 5జీ సేవలు అందించేందుకు ప్లాన్ చేస్తున్నాయి. ఆ మేరకు భారత ప్రభుత్వం ఇందు కోసం ఏకంగా బిడ్డింగ్ చేపట్టింది. అయితే ఈ బిడ్డింగ్ లో ధర భారీగా సర్కార్ పెంచిందని ఎయిర్ టెల్ కంపెనీ తప్పు పట్టింది. మన భారతీయ టెలికాం కంపెనీలకు షాక్ ఇస్తూ స్వీడన్‌కు చెందిన టెలికం కంపెనీ ఎరిక్సన్ ఏకంగా 5జీ ద్వారా లైవ్ వీడియో కాల్ ను ప్రత్యక్షంగా భారత్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రదర్శించింది. ఇది ఇండియాలో తొలి 5జీ వీడియో కాల్ అని, క్వాల్‌కామ్ భాగస్వామ్యంతో దీనిని ప్రదర్శిస్తున్నామని ఎరిక్సన్ హెడ్ నున్‌జో మిర్టిల్లో చెప్పారు.
5జీ సర్వీస్‌లు మిల్లీమీటర్‌వేవ్ స్పెక్ట్రమ్ ద్వారా అందుతాయని వివరించారు. 5జీ, 4జీ మొబైల్ నెట్‌వర్క్స్‌కు ఎమ్‌ఎమ్‌వేవ్ స్పెక్ట్రమ్ కీలకమైనదని పేర్కొన్నారు. 5జీ కారణంగా భారత్‌లో కొత్త అవకాశాలు అందివస్తాయని వివరించారు. వచ్చే ఏడాది నుంచి 5జీ టెక్నాలజీని సపోర్ట్ చేసే స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు పెరగనున్నాయని క్వాల్‌కామ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ రాజెన్ వగాడియా పేర్కొన్నారు. దీంతో ఇప్పటికే స్మార్ట్ ఫోన్స్ వాడుతున్న కోట్లాది మంది ఇక నుంచి ఈ కొత్త సర్వీసులు వస్తే వాటిని మార్చాల్సి వస్తుంది. దీంతో తిరిగి మొబైల్స్ కంపెనీలకు పండగే. చాలా మంది ప్రస్తుత ఫోన్స్ ఆడుతున్నారు. ఏమైనా టెలికాం మార్పులు చేస్తాయేమోనని వేచి చూస్తున్నారు. మొత్తం మీద 5 జీ సేవలు అందుబాటులోకి వస్తే ఐటీ రంగం విస్తరించే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి