దాతృత్వమా వర్ధిల్లు..మానవత్వమా పరిఢవిల్లు ..!
ఎన్ని కోట్లుంటే ఏం లాభం..ఎన్ని ఆస్తులంటే ఏం చేసుకోవాలి. పుట్టినప్పుడు ఏమీ తీసుకు రాలేక పోయాం..పోతున్నప్పుడు ఏమీ తీసుకెళ్లలేం..ఉన్నదంతా ఇక్కడే ..జగమంతా మనది అనుకున్నా..ఏదీ మన దరికి చేరదు..ఆస్తులు, అంతస్తులు..బంధువులు..నా అనుకున్న వారెవ్వరు తోడుండరు..మిగిలేది..వెంట వచ్చేది మాత్రం మనం చేసిన పనులు..ఆదుకున్న వైనమే గుర్తుండి పోతుంది. అందరూ మనుషులుగా పుడుతూనే ..చనిపోయారు. కొందరు మాత్రం ..అందరిలాగా ఈ భూమి మీదకు వచ్చారు.
కానీ మహానుభావులుగా మిగిలి పోయారు. అందుకే వారు చరిత్రలో లిఖించ బడ్డారు. కొందరు కొంత కాలం వరకే ఉండిపోతే..మరికొందరు ప్రపంచాన్ని ఇంకా తమ చేతలతో..తమ వ్యక్తిత్వంతో ప్రభావితం చేస్తూనే వున్నారు. వారిలో చేగువేరా..కార్ల్ మార్క్స్..లాంటి వారు ఎందరో. కోట్లాది రూపాయల ఆస్తులు సంపాదించినా చివరకు ఒక్క పైసా కూడా తమ వద్ద ఉంచుకోకుండా సమాజం కోసం దానం చేసిన వారెందరో ఈ ప్రపంచంలో వేలల్లో ఉన్నారు.
సాయం చేయాలన్న తపన, ఆదుకోవాలన్న కోరిక ఒకరు చెబితేనో..లేక బోధిస్తేనో రాదు. వారిలో ఆ భావన కలగాలి అంతే. ప్రపంచంలోనే ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ , ఎన్ ఐటీలు, ఐఐటీహెచ్‌లకు ఉన్నంత డిమాండ్ ఇంకే దానికీ లేదంటే నమ్మలేం. ఇది వాస్తవం కూడా. ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలన్నీ భారత దేశం వైపు చూస్తున్నాయి. ఎందుకంటే మొత్తంగా ఐటీ సెక్టార్‌లో ఏకంగా 40 శాతం మన వాళ్లే ఆక్రమించుకున్నారు. అమెరికాలో 30 శాతం ఆదాయం మన వాళ్ల చెంతకు చేరుతోంది. ఐటీ దిగ్గజ కంపెనీలకు మనోళ్లే ముఖ్య భూమిక పోషించడమే కాదు సిఇఓలుగా చెలామణి అవుతున్నారు.
తమ ప్రతిభా పాటవాలతో లోకం నివ్వెర పోయేలా చేస్తున్నారు. లక్షలాది మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా కొలువులు కల్పిస్తూ..వారి బతుకుల్లో వెలుగులు నింపుతున్నారు. 200 కోట్లకు పైగా వార్షిక వేతనం తీసుకుంటున్న మన ఇండియన్ గూగుల్ సిఇఓగా పనిచేస్తున్నసుందర్ పిచ్చెయ్ ..తనకు అదనపు సౌకర్యాల కింద యాజమాన్యం ఇచ్చే 437 కోట్లను తిరిగి కంపెనీకే ఇచ్చేశాడు. తనలో మానవత్వం ఇంకా బతికే వుందని చాటి చెప్పాడు. ఆ నిధులతో ప్రపంచంలో చదువుకు నోచుకోని పిల్లలకు, బతుకు కోల్పోయిన అనాధలు, వృద్దులకు, లోకపు సంక్షేమానికి వాడాలని సుందర్ సూచించాడు.
ఈ దేశం గర్వపడేలా..చెన్నయిలోన ఇండియన్ ఇనిస్టిట్యూట్ టెక్నాలజీ (ఐఐటీఎం) లో చదువుకుని ..ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో పనిచేస్తున్న వారంతా ..పూర్వ విద్యార్థులు కలిసి వేడుక నిర్వహించారు. అలాగే మిగతా ఐఐటీల వారు కూడా ఈ ఉత్సవాలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారంతా తమకు చదువు నేర్పి..బతుకులో నిలబడేలా చేసిన తమ సంస్థ ఐఐటీఎంకు గుర్తుండి పోయేలా గొప్ప బహుమతి ఇచ్చారు. అదేమిటంటే..ఏకంగా 225 కోట్ల రూపాయలను విరాళంగా అందజేశారు. దేశ వ్యాప్తంగా ఈ సమాచారం వైరల్‌గా మారింది. ప్రపంచాన్ని విస్మయ పరిచేలా చేసింది. కోట్లు ఉన్న మారాజులు ఎందురో ఉన్నారు..ఈ లోకంలో..కానీ అందరూ ఇవ్వడం లేదు..వీరు మాత్రం తమలోని మానవత్వాన్ని చాటుకున్నారు. ఇలాంటి దాతలు ముందుకు రావాలి. దేశానికి ఎనలేని సేవలందిస్తున్న ఐఐటీలకు తోడ్పాటు ఇవ్వాలి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి