దుమ్ము రేపుతున్న షియోమి..బిజినెస్‌లో టాప్ ..!
ప్రపంచాన్ని విస్మయానికి గురి చేసి ..జనాన్ని పూర్తిగా ఎంటర్‌టైన్‌మెంట్ చేస్తూ..గుండెల్లో గుబులు రేపుతూ..లోకాన్ని ఏకం చేసిన ఒకే ఒక్క వస్తువు ఏదైనా ఉందంటే..అది రాకెట్ కాదు..అణుబాంబు కాదు..మిస్సైల్స్ కావు..బుల్లెట్స్ ..ఆయుధాలు కావు..అదేమిటంటే స్మార్ట్ ఫోన్. అదొక్కటి మన చేతిలో వుంటే చాలు..ప్రపంచంలో ఎక్కడ ఏం జరిగినా సరే క్షణంలో మన చేతుల్లో ఉంటోంది. ఈ క్రెడిట్ అంతా ఐటీ రంగానిదేనని చెప్పుకోవాల్సి ఉంటుంది. రోజుకో కొత్త ప్రాడక్ట్ ఆకర్షిస్తోంది. న్యూ డిజైన్స్..డిఫరెంట్ లుక్స్‌తో ఆకట్టుకుంటున్నాయి మొబైల్స్. వీటిలో ఎన్నో కంపెనీలు రంగంలోకి దిగాయి. ఇప్పటికీ ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్న మొబైల్స్‌లలో యాపిల్ కంపెనీవే. తర్వాత శాంసంగ్, ఒన్ ప్లస్, తదితర కంపెనీలకు చెందిన ప్రొడక్ట్స్ గతంలో డామినేట్ చేశాయి. ఆ తర్వాత మార్కెట్ రంగంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. లోకల్ మేడ్ మొబైల్స్‌కు విపరీతమైన డిమాండ్ వచ్చింది. తక్కువ ధరలు..ఎక్కువ ఫీచర్స్ వుండే వాటికే ఇండియన్స్ మొగ్గు చూపడంతో అన్ని కంపెనీలు వాటి మార్కెట్ పెంచుకునేందుకు నానా తంటాలు పడ్డాయి. తప్పని పరిస్థితుల్లో తగ్గించక తప్పలేదు.
ఈ సమయంలో ఒక్కసారిగా స్మార్ట్ ఫోన్ల మార్కెట్‌లోకి బుల్లెట్‌లా దూసుకు వచ్చింది షియోమీ కంపెనీ. చైనాకు చెందిన ఈ కంపెనీ మొబైల్స్ ను విడుదల చేసింది. ఇంకేం జనం విరగబడి కొన్నారు. దీంతో మిగతా కంపెనీల ప్రాడొక్ట్స్ కు షాక్ ఇచ్చింది. దీనికంతటికి కారణం ఒకే ఒక్కడు. అదే ఇండియాకు చెందిన మనూ కుమార్ జైన్ ఎనలేని కృషి వుంది. మొబైల్స్‌తో పాటు ఎల్‌సీడీ టీవీలు, బ్రాండ్స్, పవర్ బ్యాంక్ బ్రాండ్‌లు, సేల్స్ అండ్ సర్వీస్ బ్రాండ్ , ఎఫ్ఎఫ్ఆర్ అండ్ క్వాలిటీలో నెంబర్ వన్ కంపెనీగా నిలిచింది షియోమీ కంపెనీ. మనూ కుమార్ వైస్ ప్రెసిడెంట్‌గా పదవీ బాధ్యతలు చేపట్టాక..కంపెనీ స్వరూపమే పూర్తిగా మారి పోయింది. దానిని లాభాల బాటలో నడిచేలా చేశాడు. 1000 రాక్ స్టార్స్ తో పాటు 25 వేల మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది. దేశ వ్యాప్తంగా చేపట్టిన ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్‌గా నిలిచింది షియోమీ. ది క్రెడిట్ గోస్ టూ..వన్ అండ్ ఓన్లీ మనూ కుమార్ జైన్. కరెక్టుగా ఐదేళ్ల కిందంట అంటే 2014 జూలై 15న షియోమీ కంపెనీని స్టార్ట్ చేశారు ఇండియాలో. ప్రతి మూలకు విస్తరించింది షియోమీ.
తన మార్కెట్ వాటను పెంచుకుంటూ ..వ్యాపారులతో అనుసంధానం అవుతూ..ఆదాయ మార్గాలను అందుకుంటోంది. ఈ ఐడియా అంతా మనూదే. దిగ్గజ కంపెనీలకు మనోళ్లే సారథ్యం వహిస్తున్నారు. సరిగ్గా ఏడాది కిందట అంటే 2018 ఫిబ్రవరిలో షియోమీ కంపెనీ ఏషియా హెడ్‌గా బాధ్యతలు చేటపట్టారు మనూ కుమార్ జైన్. ఇండియా, బంగ్లాదేశ్ , నేపాల్, భూటాన్, శ్రీలంక దేశాలకు ఆయనే అధిపతి. అంతకు ముందు షియోమీ కంపెనీకి గ్లోబల్ హెడ్‌గా పనిచేశారు. 2014లో కంట్రీ హెడ్‌గా ఉన్నారు. అంతకు ముందు హంగామా కంపెనీకి బోర్డు మెంబర్‌గా పనిచేశారు.. క్రేజీ బీ కి కో ఫౌండర్‌గా, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నారు. జాబోగ్ ను స్థాపించారు. ఈవెంట్ మేనేజర్‌గా, సీనియర్ అసోసియేట్‌గా సక్సెస్ అయ్యారు. ఢిల్లీలోని ఐఐటీలో బిటెక్ చేశారు. ఐఐఎం కోల్‌కతాలో పీజీడీబీఎం చేశాడు జైన్. మొత్తం మీద అతను చేరడంతోనే షియోమీ రికార్డుల మోత మోగిస్తోంది. లాభాల బాట పట్టింది. కీప్ ఇట్ అప్ జైన్.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి