దాదా లేకపోతే నేను లేను


దాదా బిసిసిఐ ప్రెసిడెంట్ అయ్యాక క్రికెటర్స్ నుండి అభినందనలు వెల్లు వెత్తుతున్నాయి. తాజాగా మాజీ క్రికెటర్,  మాజీ ఓపెనర్ గా పేరు తెచ్చుకున్న వీరేంద్ర సెహ్వాగ్ ప్రసంశలతో ముంచెత్తారు. ఇవ్వాళ నేను మీముందు ఉన్నానంటే కారణం గంగూలీనే. దాదా నాలోని టాలెంట్ ను వెన్ను తట్టాడు. మిడిల్ ఆర్డర్ లో ఆడుతున్న నన్ను ఓపెనర్ గా ఆడమని కోరాడు. దీంతో నా దశ తిరిగింది. వరల్డ్ వైడ్ గా పేరు తెచ్చుకున్నా. గంగూలీ చేసిన మేలు నేను జన్మలో మరిచి పోలేనని చెప్పారు సెహ్వాగ్. తాను అంతర్జాతీయ క్రికెట్‌లో ఓపెనర్‌గా రాణించడంలో దాదా పాత్ర మరువ లేనిదని పేర్కొన్నాడు.

ప్రాక్టీస్‌ సందర్భంలో నీకు ఓపెనర్‌గా ప్రమోషన్‌ ఇద్దామను కుంటున్నా అని గంగూలీ నా వద్దకు వచ్చి చెప్పాడు. దానికి నువ్వే ఓపెనర్‌గా ఆడొచ్చుగా అని బదులిచ్చా. ప్రస్తుతం ఓపెనర్‌ స్థానం ఖాళీగా ఉంది. అందుకే మొదట ఓ నాలుగు ఇన్నింగ్స్‌ల్లో నీకు ఓపెనర్‌గా ఆడే అవకాశం ఇస్తా. ఒకవేళ ఓపెనర్‌గా ఫెయిలైనా మిడిల్ఆ ర్డర్‌లో నీ స్థానానికి ఢోకా ఉండదని దాదా చెప్పాడు అని సెహ్వాగ్‌ గుర్తు చేసుకున్నాడు. ఆ సమయంలో ఓపెనర్‌ అవకాశం ఇవ్వడం వల్లే తాను రాణించానని, తరువాతి 12 ఏళ్లు ఇక వెను దిరిగి చూసు కోవాల్సిన అవసరం తనకు రాలేదన్నాడు. 2001లో శ్రీలంకలో జరిగిన ట్రై సిరీస్‌ సెహ్వాగ్‌ కెరీర్‌ను మలుపు తిప్పింది.

సచిన్‌ గైర్హాజరీలో ఓపెనర్‌గా వచ్చిన సెహ్వగ్‌ న్యూజీలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 69 బంతుల్లోనే సెంచరీ సాధించి క్రికెట్‌ ప్రపంచాన్ని ఆకర్షించాడు. అప్పట్లో ఫాస్టెస్ట్‌ సెంచరీ చేసిన మూడో భారత క్రికెటర్‌గా సెహ్వాగ్‌..అజహర్‌, యువరాజ్ సరసన నిలిచాడు. ఇక అక్కడి నుంచి సెహ్వాగ్‌కు వెను తిరిగి చూసు కోవాల్సిన అవసరం రాలేదు. 14 ఏళ్ల అంతర్జాతీయ కెరీర్‌లో మూడు ఫార్మాట్‌లు కలిపి 17వేలకు పైగా పరుగులు సాధించాడు. టెస్టు ఫార్మాట్‌లో భారత జట్టు తరపున రెండు సార్లు ట్రిపుల్‌ సెంచరీ సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా సెహ్వాగ్‌ రికార్డు సృష్టించాడు. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!