అభిమానుల్లో టెన్షన్ టెన్షన్


తెలుగు బుల్లి తెర మీద టాప్ రేంజ్ లో దూసు కెలుతున్న రియాల్టీ షో బిగ్ బాస్ లో, అంతిమ విజేత ఎవ్వరనే దానిపై ఫ్యాన్స్ టెన్షన్ తట్టు కోలేక పోతున్నారు. పార్టిసిపెంట్స్ మాత్రం ఇప్పటి వరకు తెగ ఎంజాయ్ చేశారు. ప్రస్తుతం సినీ నటులకు ఉన్నంత క్రేజ్ వీరికి ఉంటోంది. స్టార్ టీవీ మాటీవీని కొనుగోలు చేశాక దాని స్వరూపమే మారి పోయింది. డిఫ్ఫరెంట్ ప్రోగ్రామ్స్, సీరియల్స్ తో తన టీఆర్పీ రేటింగ్ పెంచుకుంటూ పోతోంది. ఇదిలా ఉండగా దేశ మంతటా పాపులర్ అయిన కార్యక్రమంగా బిగ్ బాస్ నిలిచింది. అంతకు ముందు స్టార్ టీవీ కౌన్ బనేగా కరోడ్ పతి పేరుతో చేసిన రియాల్టీ షో దుమ్ము రేపింది.

స్టార్ టీవీకి భారీ ఆదాయాన్ని తెచ్చి పెట్టింది. ఒక గదిలో సెలబ్రెటీలు ఉంచితే వాళ్ళు ఎలా ప్రవర్తిస్తారు, ఏమేం మాట్లాడుకుంటారో తెలిసేలా చేసే కార్యక్రమానికి ప్లాన్ చేసింది. అది బిగ్ బాస్ గా సక్సెస్ అయ్యింది. దీనిని రీజినల్ స్టేట్స్ లోకి తీసుకు వచ్చింది స్టార్ టీవీ. తాజగా ఇరు తెలుగు రాష్ట్రాల్లో ఎంటర్ అయిన స్టార్ టీవీ మాటీవీలో టెలికాస్ట్ చేసింది. మొదటి సారిగా నటుడు జూనియర్ ఎన్ఠీఆర్ హోస్ట్ చేయగా, రెండోసారి మరో నటుడు నాని హోస్ట్ చేశారు. మూడో సారి మాత్రం లవ్లీ హీరో అక్కినేని నాగార్జున ప్రయోక్తగా స్టార్ట్ చేశాడు. ఇది కూడా త్వరలో పూర్తి కావొస్తోంది. మొదట్లో కొంచెం హైప్ పెరిగినా రాను రాను దీనిపై ఆసక్తి తగ్గింది.

ఇదిలా ఉండగా ఇప్పుడు అనుకోని రీతిలో పార్టిసిపెంట్ శివ జ్యోతి ఎలిమినేటి అయ్యింది. ఇప్పటికే బాబా భాస్కర్, సింగర్ రాహుల్ సిప్లిగంజ్ , శ్రీ ముఖి ఫైనల్ కోసం పోటీ పడుతున్నారు. మరో పార్టిసిపెంట్ ..అలీ రెజా కూడా బరిలో ఉన్నారు. అంతకు ముందు ఒకసారి ఎలిమినేట్ అయి తిరిగి బిగ్ బాస్ లోకి వచ్చాడు. ఇదిలా ఉండగా పోటీ మాత్రం ముగ్గురి మధ్యే ఉంటోంది. కాగా బయటకు వచ్చిన శివ జ్యోతి మిగతా ఎలిమినేట్ అయిన వారిని కలిసింది. వారితో పండుగ చేసుకుంది. తన వీడియోను పోస్ట్ చేసింది. ఇది వైరల్ గా మారింది. అయితే రాహుల్ కంటే శ్రీముఖి టైటిల్ గెలవాలని కోరుకుంటున్నట్లు శివ జ్యోతి చెప్పింది.

కామెంట్‌లు