అంతులేని అభిమానం..దీపికా అంటే చచ్చేంత ఇష్టం
బాలీవుడ్ లోని హీరోయిన్లలో టాప్ నటీమణిగా దీపికా పదుకొనే కొనసాగుతూ వస్తోంది. సినిమాలే కాకుండా టైమ్ కుదిరితే వాణిజ్య ప్రకటనల్లో కూడా నటిస్తోంది. ఆమె మిగతా హీరోయిన్స్ కంటే ఎక్కువగా సోషల్ మీడియాలో చురుకుగా ఉంటోంది. ఇన్‌స్ట్రాగామ్ లో దీపికాకే ఎక్కువగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటోంది. తాజాగా దీపికకు ఏకంగా 4 కోట్ల మంది ఫాలో చేస్తుండడం తో ఇన్‌స్ట్రాగామ్ యాజమాన్యం ఆమెకు భారీ మొత్తంలో ఫీజు చెల్లిస్తోంది. ఇది కూడా ఓ రికార్డ్. ఇక దీపికాకు తెలుగు సినిమాల్లో నటించాలనే కోరిక ఎక్కువగా ఉంది. ఆ విషయాన్ని ఇటీవలే హైదరాబాద్ కు వచ్చినప్పుడు వెల్లడించింది కూడా. అయితే ప్రిన్స్ మహేష్ బాబు అంటే తనకు ఎంతో ఇష్టమని, అతడితో నటించాలని ఉందంటూ స్పష్టం చేసింది. తన వ్యక్తిగత, వృత్తి జీవిత విషయాలను ఎప్పటికప్పుడు ఇన్‌స్టాలో పంచుకొనే ఈ బాజీరావ్ ‘మస్తానీ’ అనేక మంది అభిమానులను సంపాదించుకుంది.
ఇదే వరుసలో 4.5 కోట్ల మంది ఫాలోవర్స్‌తో ప్రియాంకా చోప్రా బాలీవుడ్‌లో అందరి కంటే ముందుంది. మరో నటి శ్రద్ధాకపూర్‌ను 3.5 కోట్ల మంది అనుసరిస్తున్నారు. ఇక భారత ప్రధాని మోదీ ఇటీవల 3 కోట్ల మార్కుకు చేరు కోవడం గమనార్హం.1986 జనవరి 5 న పుట్టిన దీపికా పదుకొనే కు ఇప్పుడు 33 ఏళ్ళు. స్వస్థలం కన్నడ. నటి గానే కాకుండా సూపర్ మోడల్ గా ఇప్పటికే పేరు తెచ్చుకుంది. 2018 లో నటుడు రణ్ వీర్ సింగ్ ని పెళ్లి చేసుకుంది. ఆమె తండ్రి ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రకాష్ పడుకోణె. తల్లి ఒక ట్రావెల్ ఏజెంట్. దీపికా బెంగుళూరులోని సోఫియా ఉన్నత పాఠశాలలో చదువుకుంది. మౌంట్ కార్మెల్ కాలేజీలో ప్రీ యూనివర్సిటీ కోర్సు చదువు పూర్తి చేసింది కాలేజీ రోజుల్లో ఉండగా దీపికా మోడలింగ్‌ని కెరీర్‌గా ఎంచుకుంది.
ప్రముఖ ఉత్పత్తులైన లిటిల్, డాబర్, లాల్ పుడర్, క్లోజప్ టూత్ పేస్ట్ , గో బిబో, తదితర కంపెనీల ప్రకటనల్లో నటించింది. ఇండియా రిటైల్ జ్యువెలరీ ఆభరణములకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించింది. మేబెల్లిన్ అనే కాస్మెటిక్స్ కంపెనీ దీపికను అంతర్జాతియ అధికార ప్రతినిధిగా నియమించుకుంది. కింగ్ ఫిషర్ మోడల్ అఫ్ ది ఇయర్ అవార్డుతో సత్కరించింది. కింగ్ ఫిషర్ స్విం సూట్ క్యాలెండర్ 2006కి ఒక మోడల్‌గా ఎంపిక చేసింది. ఐడియా, జీ ఫ్యాషన్ అవార్డులలో రెండు ట్రోఫీలు గెలుచుకుంది. ఫిమేల్ మోడల్ అఫ్ ది ఇయర్ , ఫ్రెష్ ఫేస్ అఫ్ ది ఇయర్ , కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్, లేవి స్ట్రాస్, టిస్సోట్ ఎస్ఎ లకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. మోడలింగ్‌లో సక్సెస్ అయ్యాక సినిమా వైపు ద్రుష్టి పెట్టింది.
హిమేష్ రేషమ్మియా తీసిన స్వతంత్ర ఆల్బం ఆప్ కా సురూర్ లో నాం హై తేరా అనే పాటకి మ్యూజిక్ వీడియోలో నటించడం ద్వారా తన కెరీర్‌ని మొదలు పెట్టింది. 2006లో పడుకోణె ఉపేంద్ర హీరోగా కన్నడ సినిమా ఐశ్వర్యతో సినిమా రంగంలోకి అడుగు పెట్టింది. 2007లో షారుఖ్ ఖాన్ హీరోగా ఫరా ఖాన్ తీసిన ఓం శాంతి ఓం లో నటించింది. ఫిల్మ్ ఫేర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డు సంపాదించి పెట్టింది. ఫిల్మ్ ఫేర్ ఉత్తమ నటికి గాను నామినేట్ అయింది. బచ్నా ఏ హసీనో లో రణబీర్ కపూర్ తోనూ, చాందిని చౌక్ టు చైనా లోనూ కనిపించింది. లవ్ ఆజ్ కల్ సినిమాలో నటించింది దీపికా. లెక్కలేనన్ని అవార్డులు చేజిక్కించుకున్న ఈ అమ్మడు ఏది మాట్లాడినా, లేదా నవ్వినా క్షణాల్లో వైరల్ అవుతోంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి