సమ్మెను ఆపం..ప్రభుత్వంతో యుద్ధం

ఆర్టీసీ సంస్థ తెలంగాణ ప్రజలది. ముమ్మాటికీ కార్మికుల చెమట చుక్కలతో కాపాడుకుంటూ వచ్చింది. ఈ రాష్ట్రానికి ఎన్నో ఏళ్ళ చరిత్ర ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తిగా జనాన్ని తప్పు దోవ పట్టిస్తూ జనాన్ని అయోమయానికి గురి చేస్తున్నాడు. దీనిని ప్రజలు గమనిస్తున్నారు. గౌరవ హైకోర్టు సమస్యను వెంటనే పరిష్కరించమని చెప్పినా పట్టించు కోలేదు. అసలు వాస్తవం ఏమిటో ధర్మాసనంకు సైతం అర్థమైంది. అందుకే చీవాట్లు పెట్టింది. సంస్థకు పూర్తి స్థాయిలో మేనేజింగ్ డైరెక్టర్ ను అప్పాయింట్ చేయకుండా నిన్నటి దాకా చిలుక పలుకులు పలికిన ప్రభుత్వం ఈరోజు వరకు అసలు ఏం జరుగుతుందోనన్న వాస్తవాన్ని కోర్టుకు సమర్పించలేదు.

ఇక్కడే ప్రభుత్వానికి కార్మికుల పట్ల ఎంత ప్రేమ ఉన్నదో అర్థమవుతుందని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వత్థామ రెడ్డి, కో కన్వీనర్ రాజి రెడ్డి అన్నారు. తాము లేవనెత్తిన సమస్యలు పరిష్కారించే దాకా తమ సమ్మెను ఆపే ప్రసక్తి లేదని చెప్పారు. తమకు ధర్మాసనం పట్ల గౌరవం ఉన్నదన్నారు. ఓ వైపు కార్మికులు చని పోతుంటే ఈ రోజు వరకు సర్కారుకు చీమ కుట్టి నట్లు కూడా లేదన్నారు. చేసిన పనికి డబ్బులు పెట్టుకుని వేతనాలు ఇవ్వకుండా, ఉద్దేశ పూర్వకంగానే ఇబ్బందులకు గురి చేస్తోందన్నారు. ఇదిలా ఉండగా అటు ప్రభుతం ఇటు కార్మిక సంఘాలు మెట్టు దిగడం లేదు.

ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ఇదే సమయంలో ఆర్టీసీ జేఏసీ నేతలు సంస్థ ఇన్ ఛార్జ్ ఎండీకి లేఖాస్త్రాన్ని సంధించారు. మొత్తం 45 డిమాండ్ల పై చర్చకు సిద్ధమంటూ స్పష్టం చేశారు. దీనిపై ఆర్టీసీ అధికారులు ఎలా స్పందిస్తారన్నది వేచి చూడాలి. మరోవైపు ఆర్టీసీ సమ్మెపై సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో సమీక్ష చేపట్టారు. సమ్మెలో భాగంగా తమ ఉద్యమాన్ని కార్మిక సంఘాలు కొనసాగిస్తూనే ఉన్నాయి. కలెక్టరేట్ల ముట్టడికి ఆర్టీసీ జేఏసీ పిలుపునిచ్చింది. వీరికి మద్దతుగా కాంగ్రెస్‌ పార్టీ తమ నాయకులూ, కార్మికులు పాల్గొనాలని పిలుపు ఇచ్చింది.

కామెంట్‌లు