ఆశాజనకంగా ఐసీఐసీఐ



దేశంలో ప్రైవేట్ బ్యాంకింగ్ రంగంలో నెంబర్ వన్ పొజిషన్ లో కొనసాగుతున్న ఐసీఐసీఐ మార్కెట్ వర్గాల అంచనాలను దాటుకుని లాభాల బాట పట్టింది. ఖాతాదారులకు మెరుగైన సేవలు అందజేస్తూ ముందుకు దూసుకు వెలుతోంది. ఇతర ప్రైవేట్ బ్యాంకులకు ధీటుగా దూసుకెళుతోంది. రుణాలు ఇవ్వడం లోను, ఏఫ్డీలు, కరెంట్ ఖాతాలు, ఇతర వ్యాపారుల అవసరాలకు అనుగుణంగా ఐసీఐసీఐ కొంత వెసలుబాటు కల్పించింది. దీంతో లాభాలు ఆశాజనకంగా మారాయి. కాగా ఈ ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసిక కాలంలో 6 శాతం తగ్గింది. గత ఆర్థిక సంవత్సరం క్యూ2లో 1,205 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 1,131 కోట్లకు చేరిందని ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది.

మొత్తం ఆదాయం మాత్రం 31,915 కోట్ల నుంచి 17 శాతం వృద్ధితో  37,425 కోట్లకు పెరిగిందని పేర్కొంది. స్టాండ్‌ అలోన్‌ పరంగా చూస్తే, గత క్యూ2లో 909 కోట్లుగా ఉన్న నికర లాభం ఈ క్యూ2లో 28 శాతం తగ్గి  655 కోట్లకు తగ్గిందని, ఆదాయం మాత్రం 18,262 కోట్ల నుంచి 25 శాతం వృద్ధితో  22,760 కోట్లకు పెరిగిందని తెలిపింది. 3,712 కోట్ల పన్ను వ్యయాల కారణంగా లాభం తగ్గిందని పేర్కొంది. నికర వడ్డీ ఆదాయం  6,417 కోట్ల నుంచి 26 శాతం వృద్ధితో  8,057 కోట్లకు, నికర వడ్డీ మార్జిన్‌ 3.33 శాతం నుంచి 3.64 శాతానికి చేరుకుందని వెల్లడించింది.

నికర లాభం తగ్గినా, ఈ బ్యాంక్‌ రుణ నాణ్యత మెరుగు పడింది. గత క్యూ2లో 8.54 శాతంగా ఉన్న స్థూల మొండి బకాయిలు ఈ క్యూ2లో 6.37 శాతానికి అలాగే నికర మొండి బకాయిలు 3.65 శాతం నుంచి 1.60 శాతానికి తగ్గాయని ఐసీఐసీఐ బ్యాంక్‌ తెలిపింది. మొండి బకాయిలు తగ్గడంతో కేటాయింపులు కూడా తగ్గాయి. మొత్తం కేటాయింపులు 3,994 కోట్ల నుంచి 2,506 కోట్లకు తగ్గాయి. ఆరోగ్యకరమైన వృద్ధి సాధించడంతో ఐసీఐసీఐ బ్యాంక్‌ షేర్‌ 473ను తాకింది. మొత్తం మీద ఐసీఐసీఐ బ్యాంకు లాభాల బాటలో ఉండడం తో ఖాతాదారులకు ఒకింత ఉపశమనం కలిగించే అంశం. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!