బ్యాడ్మింటన్ లో మెరిసిన మన బిడ్డ


తెలంగాణ అంటేనే ప్రతి రంగంలో ఓ ఈసడింపు. వాళ్లకు తెలివి ఉండదని, మాట్లాడటం రాదనీ, సంస్కారం అసలే ఉండదని దెప్పి పొడిచిన ఆంధ్ర వాళ్ళు సిగ్గు పడేలా, తల దించు కునేలా మన ప్రాంతానికి చెందిన వారు అన్ని రంగాలలో రాణిస్తున్నారు. అటు చదువులోనూ ఇటు వ్యాపారం లోను, క్రీడా, సినీ రంగాల్లో తమ ప్రతిభ పాటవాలకు మెరుగులు అద్దుతూ రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. వారిలో సానియా మీర్జా ఇప్పటికే ప్రపంచ టెన్నిస్ రంగంలో చరిత్ర తిరుగ రాసింది. మోస్ట్ ఫెవరబుల్ ప్లేయర్ గా పేరు తెచ్చుకుంది. ఇక మహమ్మద్ అజహరుద్దీన్ గురించి చెప్పాల్సిన పని లేదు. ఇప్పటికే రిస్టీ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నారు.

తాజాగా మరో తెలంగాణ అమ్మాయి, మన ఆణిముత్యం అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌లో పతకంతో దూసుకొచ్చింది. 16 ఏళ్ల రూహి రాజు డొమినికన్‌ రిపబ్లిక్‌ దేశంలో జరిగిన సాంటో డొమింగో ఇంటర్నేషనల్‌ బ్యాడ్మింటన్‌ టోర్నీలో రన్నరప్‌గా నిలిచింది. అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్న రూహి అన్‌ సీడెడ్‌ ప్లేయర్‌గా బరిలోకి దిగింది. ఫైనల్‌ దాకా అసాధారణ పోరాట పటిమతో ఆకట్టుకుంది. టాప్‌ సీడ్‌ ఫాబియానా సిల్వా  బ్రెజిల్‌ తో జరిగిన టైటిల్‌ పోరులో ఆమె పోరాడి ఓడింది.

రూహి 18–21, 21–12, 13–21తో ఫాబియానా చేతిలో పరాజయం పాలైంది. ఈ టోర్నీలో తెలంగాణ షట్లర్‌ అద్భుతమైన ప్రదర్శన కన బరిచింది. సీడెడ్‌ క్రీడాకారిణులను వరుస గేముల్లో కంగు తినిపించింది. క్వార్టర్‌ ఫైనల్లో ఆమె 21–18, 21–19తో రెండో సీడ్‌ అలెజాండ్ర సొటొమయోర్‌ గ్వాటెమాలాను ఓడించింది. సెమీస్‌లో 21–18, 21–11తో మూడో సీడ్‌ జాక్వెలైన్‌ లిమా కు చుక్కలు చూపించింది. రజత పథకం సాధించి తనకు ఎదురు లేదని నిరూపించింది రూహి. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు అందుకోవాలని కోరుకుందాం. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!