నటాషాతో పాండ్యా ఫిక్స్
గత కొంత కాలంగా చెట్టా పట్టా లేసుకుని తిరుగుతున్న టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ముంబైలో స్థిరపడ్డ సెర్బియా నటి నటాషా స్టాన్ కోవిచ్‌ల జంట త్వరలో పెళ్లి బంధంతో ఒక్కటి కానుంది. దీనిలో భాగంగా వీరిద్దరి నిశ్చితార్థ వేడుక ఎటువంటి హంగూ ఆర్భాటం లేకుండా జరిగింది. కొత్త సంవత్సరం వేడుకల్లో భాగంగా దుబాయ్‌లో స్పీడ్ బోట్‌లో విహరిస్తూ వీరిద్దరు తమ నిశ్చితార్థం విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. నా మెరుపు తీగతో కొత్త సంవత్సరాన్ని ప్రారంభిస్తున్నాను అని హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో నటాషాతో నిశ్చితార్థం చేసుకున్న ఫోటోలు పోస్ట్ చేశాడు. కాగా, ఎటువంటి ముందస్తు సమాచారం లేకుండానే వీరు నిశ్చితార్థం చేసుకోవడంతో ఇది ఫ్యాన్స్‌తో పాటు క్రికెటర్లను సైతం కాస్త ఆశ్చర్యం కల్గించింది.
హార్దిక్, నటాషాల నిశ్చితార్థం జరగడంతో పలువురు క్రికెటర్లు విషెస్ తెలియ జేశారు. టీమిండియా కెప్టెన్ కోహ్లి వాటే సర్‌ప్రైజ్ హార్దిక్ అంటూ అభినందనలు తెలిపాడు. కంగ్రాట్స్ హార్దిక్. వాటే ప్లెజెంట్ సర్‌ప్రైజ్. మీ భవిష్యత్తు మరింత బాగుండాలి అంటూ విష్ చేశాడు. ఇక టీమిండియా ఓపెనర్, హార్దిక్‌కు అత్యంత సన్నిహితుడు కేఎల్ రాహుల్‌తో పాటు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్‌మన్ శ్రేయస్ అయ్యర్, లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చహల్, చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌లు అభినందించారు. మరొకవైపు బాలీవుడ్ స్టార్స్ సునీల్ శెట్టి, అతియా శెట్టి, సోనల్ చౌహాన్‌లు కూడా హార్దిక్‌కు విషెస్ తెలిపారు. గత సెప్టెంబర్‌లో దక్షిణాఫ్రికాతో సిరీస్ తర్వాత వెన్ను నొప్పితో హార్దిక్ ఆటకు దూరమయ్యాడు. లండన్‌లో శస్త్రచికిత్స కూడా చేయించు కున్నాడు. ఇటీవలే మళ్లీ ప్రాక్టీస్ మొదలు పెట్టిన హార్దిక్.. పునరాగమనం కోసం వెయిట్ చేస్తున్నాడు.
స్టాన్ కోవిచ్‌తో హార్దిక్ ప్రేమాయణం నడుపుతున్నాడనే విషయం ఇటీవలే వెలుగు చూసింది. వీరిద్దరూ పీకల్లోతూ ప్రేమలో మునిగి పోయారనే వార్త గత ఏడాది నవంబర్ నెలలో మీడియా సర్కిల్స్‌లో చక్కర్లు కొట్టింది. గతంలో చాలా మంది అమ్మాయిలతో తన ఎఫైర్లను డేటింగ్ వరేకే పరిమితం చేసిన హార్దిక్.. నటాషాతో ప్రేమాయణాన్ని సీరియస్‌గానే తీసుకున్నాడు.. ఈ ఏడాది మేలో నటాషాను తన ఇంటికి తీసుకెళ్లి కుటుంబ సభ్యులందరికీ పరిచయం కూడా చేశాడు. నటాషాను పెళ్లి చేసుకునే ఉద్దేశం ఉంది కాబట్టే వారి వ్యవహారం ఇంటి వరకూ వచ్చిందనే టాక్‌ను నిజం చేసి చూపించాడు హార్దిక్. మొత్తం మీద న్యూ ఇయర్ లో హార్దిక్ క్రికెట్ టీమ్ తూ పాటు ఫ్యాన్స్ కు కూడా షాక్ ఇచ్చాడు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి