మెట్రోకు జైకొట్టిన జనం
హైదరాబాద్ ఐటీ హబ్ గా మారాక నగరవాసులు, యూత్ జోష్ మీదుంది. ఎక్కడ పడితే అక్కడ మద్యం విచ్చలవిడిగా దొరుకుతోంది. అంతే కాదు ఎన్ని సీసీ కెమెరాలు అమర్చినా జరిగే దారుణాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రస్తుతం సిటీ వాసులంతా ఆర్టీసీ కంటే మెట్రో సర్వీసెస్ బెటర్ అంటున్నారు. రికార్డు స్థాయిలో ఇందులోనే జనం జర్నీ చేస్తున్నారు. దీంతో ఎక్కడ లేని ఆదాయాన్ని మూటగట్టుకుంటోంది మెట్రో. కొత్త ఏడాదికి మెట్రో సరికొత్త రికార్డుతో వెల్ కమ్ చెప్పింది. ఈ ఒక్క రోజులోనే దాదాపు 4.60 లక్షల మంది ట్రైన్ జర్నీ చేశారు. ఇప్పటి వరకు ఇదే రికార్డ్. సెలబ్రేషన్స్ నేపథ్యంలో ట్రైన్స్ టైమింగ్ పెంచడం, మద్యం లిమిట్‌గా తాగిన వాళ్లకూ అనుమతి ఇవ్వడం మెట్రోకు కలిసొచ్చింది.
అర్ధరాత్రి దాటాక ఒంటి గంట వరకు పొడిగించిన టైమింగ్స్‌తో ఒక్క రోజులో లక్షల మంది మెట్రోజర్నీ చేసినట్లు అధికారులు ప్రకటించారు. హైదరాబాద్ మెట్రోకు ఇది మరో మైలురాయి. గతంలో 4.10 లక్షల నుంచి 4.20 లక్షల మంది వరకు గరిష్ఠంగా ప్రయాణించిన రోజులు ఉన్నాయి. సెలబ్రేషన్స్ సందర్భంగా రైళ్ల టైమింగ్స్‌ను పొడిగించారు. లిమిటెడ్‌గా మద్యం తాగిన వారిని ప్రయాణించేందుకు అనుమతించడంతో నగర వాసులు ఎక్కువగా మెట్రో ఎక్కేందుకు మొగ్గు చూపారు. మందు బాబులు కార్లు, బైకులను ఆయా హోటళ్లు, ఈవెంట్స్ ఏరియాలు, ఆఫీసుల వద్దే వదిలేసి మెట్రోలో ఇంటికి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.
ఈసారి ఘటనలేమీ లేకుండా ప్రశాంతంగా వేడుకలు ముగిశాయి. రెండు గంటల పాటు పొడగించడంతో 40 వేల మంది అదనంగా ప్రయాణించారు. వన్ డేలో 4,60,483 మంది మెట్రోను వినియోగించుకున్నారు. మియాపూర్ నుంచి ఎల్‌బీనగర్ రూట్‌లో 2,68,900 మంది, నాగోలు నుంచి రాయదుర్గ్ లైన్‌లో 1,91,583 మంది ప్రయాణించినట్టు అధికారులు వెల్లడించారు. అమీర్ పేట స్టేషన్లో 28,696 ఎంట్రీలు, 25,548 ఎగ్జిట్‌లు నమోదయ్యాయి. ఆ తర్వాతి స్థానంలో ఎల్బీనగర్ నిలిచింది.
ఈ స్టేషన్‌లో 25,121 ఎంట్రీలు, 22,898 మంది ప్రయాణికులు ఎగ్జిట్ అయినట్టు తెలిపారు. ఇటీవలే ప్రారంభించిన రాయదుర్గ్ స్టేషన్‌లో 21,336 మంది ఎక్కగా, 16,154 మంది దిగారు. కేపీహెచ్‌బీలో మెట్రోస్టేషన్లో 18,697 ఎంట్రీలు, 17,965 ఎగ్జిట్లు నమోదైనట్లు ప్రకటించారు. మొత్తం మీద ఆర్టీసీని కాదని జనం మెట్రోకు జైకొట్టారు. జేరనీ మాటేమిటో కానీ మెట్రోకు పంట పండింది. ఆదాయం సమకూరింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి