ఇక ఆఫ్ లైన్లోనే మొబైల్స్
ఆఫ్ లైన్ లో వ్యాపారం తగ్గుతోంది. అన్ని కంపెనీలు ఆన్ లైన్ జపం చేస్తున్నాయి. దీంతో లక్షలాది రూపాయలు పెట్టుబడి పట్టిన రిటైలర్లు, వ్యాపారులకు తీరని నష్టం జరుగుతోంది. ఇటీవల ఈ కామర్స్ వ్యాపారం ఎన్నడూ లేని రీతిలో కోట్ల రూపాయల్లోకి చేరింది. ప్రతి ఒకరు ఆన్ లైన్ లోనే కొనేందుకు మొగ్గు చూపుతున్నారు. దీంతో వ్యాపారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని చైనా దిగ్గజ మొబైల్ కంపెనీ వివో ఇక నుంచి ఆన్ లైన్ లో మొబైల్స్, యాక్ససరీస్ ను అమ్మబోమని తేల్చి చెప్పింది. ఈ మేరకు వివో కంపెనీ సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్ ద్వారా ప్రత్యేక ఆఫర్లతో దేశీయంగా స్మార్ట్‌ఫోన్ వినియోగ దారులను ఆకట్టుకున్న వివో ఇండియా తాజాగా షాకింగ్ న్యూస్ చెప్పింది.
ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్ ఎక్స్‌క్లూజివ్ సేల్స్ అందుబాటులో వుండవని తేల్చి చెప్పింది. రిటైలర్స్‌కు మేలు చేయాలన్న సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. అయితే తమ ఉత్పత్తులను దాదాపు అవే ధరలకు మిగతా చానళ్ల ద్వారా తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచుతామని వివో ఇండియా సీఈవో జెరోమ్ చెన్ వెల్లడించారు. దీంతో వివోకు సంబంధించిన ఉత్పత్తులన్నీ స్టాండర్ట్ రేట్స్‌కే లభిస్తాయన్నారు. అలాగే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ ఆఫర్లు ఉంటాయని హామీ ఇచ్చారు. దేశంలో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారులలో ఒకటిగా నిలిచిన వివో ఇక ఆఫ్‌లైన్ మార్కెట్‌పై దృష్టి పెట్టనుంది.
వివో తాజా నిర్ణయాన్ని స్వాగతించిన ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ , అన్యాయమైన ఇ-కామర్స్ వాణిజ్య పద్ధతులకు వ్యతిరేకంగా, సరసమైన వ్యాపార అవకాశాలతో మొబైల్ రిటైలర్ల కోసం కొత్త మార్పును తీసుకు వస్తున్నామని ట్వీట్‌లో పేర్కొంది. ఇందులో వివో మొబైల్స్ ఇండియా సీఈవో లేఖ కాపీని కూడా జత చేసింది. మరో వైపు ఈ వారంలోనే ఎస్ 1 ప్రో పేరుతో తో కొత్త స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఫుల్-హెచ్‌డి + రిజల్యూషన్‌తో 6.38-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 665 సాక్ ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్, డైమండ్ ఆకారంలో 48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్ ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకు రానుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి