పోస్టర్స్ సూపర్బ్..ఫ్యాన్స్ జోష్

సినీ అభిమానులకు ఈ న్యూ ఇయర్ మరింత జోష్ తెస్తోంది. ఎందుకంటే పలు సినీ స్టార్స్ నటించిన కొత్త సినిమాలు ఈ సంక్రాంతి పండుగ వేళ అలరించనున్నాయి. ఇప్పటికే ఆయా సినిమాలకు సంబంధించి ట్రైలర్స్, సాంగ్స్ విడుదలయ్యాయి. మిలియన్ వ్యూస్ వచ్చాయి. రికార్డుల మోత మోగిస్తున్నాయి. ప్రిన్స్ మహేష్ బాబు, అల్లు అర్జున్, రవితేజ, విజయ్ దేవరకొండ, సాయి ధర్మ తేజ్ , తదితరులు నటించిన మూవీస్ రిలీజ్ కోసం రెడీ అవుతున్నాయి. ఇక త్రివిక్రమ్ డైరెక్షన్ లో వస్తున్న ఆలా వైకుంఠపురం లో సినిమా పై భారీ అంచనాలు పెరిగాయి. కొత్త ఏడాది వచ్చింది. వస్తూ వస్తూ సినిమాల కొత్త పోస్టర్లను, కొత్త చిత్రాల ప్రకటనలను మోసుకొచ్చింది. తెలుగు సినిమాకు కొత్త శోభను అలంకరించి ప్రేక్షకులకు అదిరి పోయే కిక్కు ఇచ్చింది.

రజనీకాంత్‌ దర్బార్‌ 9న విడుదల కానుంది. ఈ చిత్రానికి ఏఆర్‌ మురుగదాస్‌ దర్శకుడు. ఆర్మీ మేజర్‌ అజయ్‌ కృష్ణగా మహేశ్‌బాబు నటించిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం11న విడుదల కానుంది. హీరో అల్లు అర్జున్, దర్శకుడు త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో రూపొందిన తాజా చిత్రం అల..వైకుంఠపురములో..12న ప్రేక్షకుల ముందుకు రానుంది. రవితేజ నటిస్తున్న డిస్కో రాజా, క్రాక్‌ చిత్రాల కొత్త లుక్స్‌ విడుదలయ్యాయి. వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్న డిస్కోరాజా చిత్రం 24న విడుదల కానుంది. గోపీచంద్‌ మలినేని తెర కెక్కిస్తోన్న క్రాక్‌ వేసవిలో విడుదల అవుతుంది. 15న ఎంత మంచివాడవురా విడుదల కానుంది. సతీష్‌ వేగేశ్న దర్శకత్వంలో కల్యాణ్‌ రామ్‌ హీరోగా నటించిన చిత్రం ఇది.

హేమంత్‌ మధుకర్‌ దర్శకత్వం వహించిన నిశ్శబ్దం చిత్రం 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. అదే రోజు అశ్వథ్థామగా వస్తున్నారు నాగశౌర్య. రమణతేజ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. నితిన్‌ను భీష్మగా మార్చారు దర్శకుడు వెంకీ కుడుముల. ఫిబ్రవరిలో  భీష్మ విడుదల కానుంది. పులివాసు దర్శకత్వంలో కల్యాణ్‌ దేవ్‌ నటిస్తున్న సూపర్‌మచ్చి పోస్టర్‌ని విడుదల చేశారు. అజయ్‌ కథుర్వర్, డింపుల్‌ జంటగా వేణు ముల్కల దర్శకత్వంలో తెరకెక్కించిన విశ్వక్‌ చిత్రం షూటింగ్‌ పూర్తయింది. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేశారు. శైలేష్‌ కొలను దర్శకత్వంలో విశ్వక్‌ సేన్‌ హీరోగా నటిస్తున్న హిట్‌ మూవీ ఫస్ట్‌ గ్లిమ్స్‌ని విడుదల చేశారు. ఫిబ్రవరి 28న సినిమా విడుదల కానుంది. నిర్మాత రాజ్‌ కందుకూరి తనయుడు శివ కందుకూరి హీరోగా నటించిన చూసీ చూడంగానే..సినిమాను 31న విడుదల చేయనున్నట్లు వెల్లడించారు.

రవిబాబు దర్శకత్వంలో రూపొందనున్న చిత్రానికి ‘క్రష్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. రూపేష్‌ కుమార్‌ చౌదరి, సలోని మిశ్రా జంటగా శశికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘22’ మూవీ టైటిల్‌ యానిమేషన్‌ లోగోని న్యూ ఇయర్‌ సందర్భంగా విడుదల చేశారు. ఇంకా నా పేరు రాజా, ఈడోరకం, ఏమై పోయావే, ఒక చిన్న విరామం, అనుభవించు రాజా వంటి సినిమాల ప్రకటనలు, వీటికి సంబంధించిన ఫస్ట్‌లుక్, కొత్త లుక్‌లు కూడా ప్రేక్షకులకు కనువిందు చేశాయి. సూర్య హీరోగా ‘గురు’ ఫేమ్‌ సుధా కొంగర దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘శూరారై పొట్రు’  సెకండ్‌ లుక్‌ను విడుదల చేశారు. కార్తీ ‘ఖైదీ’ ఫేమ్‌ లోకేష్‌ కనగరాజ్‌ దర్శకత్వంలో విజయ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రానికి ‘మాస్టర్‌’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. మొత్తం మీద కొత్త సినిమాలు కనువిందు చేయనున్నాయి. ఇక ఫ్యాన్స్ కు కొత్త పండుగ ఫుల్ జోష్ నింపే బోతోంది. 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!