పవర్ పాలిటిక్స్‌లో శ్రవణానందం..!
తుచ్చు పట్టిన రాజకీయాల్లో ఆయనో రాకెట్‌లా ముందుకు వచ్చారు. తెలంగాణ ప్రాంతంలో ఎన్నదగిన ..పరిణితి చెందిన రాజకీయ వేత్తలలో..మేధావులలో..విశ్లేషకులలో పట్టుమని పది మందిని ఎంపిక చేస్తే ..అందులో దాసోజు శ్రవణ్ కుమార్ ముందు వరుసలో నిలుస్తారు. అంతలా ఆయన వినుతికెక్కారు. కొన్నేళ్లుగా..తరతరాలుగా మోసానికి..దోపిడీకి గురైన మట్టితనపు ఆనవాళ్లు కలిగిన ..కరవుకు ఆలవాలమైన నల్లగొండ జిల్లా నుంచి వచ్చారు. విశ్వబ్రాహ్మణ కులం నుంచి వచ్చిన ఆయన ఎన్నో కష్టాలు అనుభవించారు. కానీ విద్యాధికుడిగా..మేధావిగా..తెలంగాణ ప్రాంతాన్ని .దాని అస్తిత్వాన్ని అర్థం చేసుకున్న నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగారు. ఓ ఐటీ కంపెనీకి బాధ్యులుగా ఉన్నారు. సమాజాన్ని ప్రభావితం చేసే ప్రతి అంశం పట్ల దాసోజు స్పందించారు. సమస్యలపై ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన పోరాటంలో , ఉద్యమంలో నిజాయితీగా పాల్గొన్నారు. నిబద్ధత కలిగిన కార్యకర్తగా, వ్యక్తిగా తన వంతు బాధ్యతను నిర్వహించారు.తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి కేసీఆర్, జయశంకర్ లాంటి వాళ్లు జనాన్ని జాగృతం చేస్తే..శ్రవణ్ అలుపెరుగకుండా పూర్తి వివరాలతో ఈ ప్రాంతానికి జరిగిన అన్యాయం గురించి, మోసం గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఎందరో నేతలను కలిశారు. తెలంగాణ రాష్ట్రం రావడం ఎంత అవసరమో అన్ని వర్గాల వారిని..అన్ని పార్టీల అధినేతలను కలిశారు..అర్థం అయ్యేలా చేశారు.
కవిగా..రచయితగా..అనలిస్ట్‌గా..నాయకుడిగా..ముఖ్య కార్యనిర్వహణాధికారిగా..ఐటీ ఎక్స్‌పర్ట్‌గా..బ్లాగర్‌గా..సోషల్ మీడియా ఎక్స్‌పర్ట్‌గా..స్పోక్స్ పర్సన్‌గా ..ఇలా ప్రతి ఫార్మాట్‌లో దాసోజు శ్రవణ్ పరిణతి సాధించారు. మిగతా పొలిటికల్ లీడర్ల కంటే ఆయన ముందంజలో ఉన్నారు. ఐటీ రంగం పట్ల..హెల్త్ రంగంలో..నీటి పారుదల రంగాలలో..సామాజిక అంశాలపై ఆయన తన గళం వినిపిస్తూనే ఉన్నారు. దాదాపు ఈ ప్రస్థానం 20 ఏళ్ల పాటు అప్రహతిహతంగా కొనసాగుతోంది.
మెగాస్టార్ చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీకి వెన్నుదన్నుగా ఉన్నారు. ఆ తర్వాత మారిన సమీకరణల దృష్ట్యా తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరారు. అక్కడ ఆ పార్టీకి అద్భుతమైన ఫ్లాట్ ఫాం తీసుకు వచ్చారు. స్పోక్స్ పర్సన్‌గా అనతి కాలంలోనే తన స్టాండ్ ఏమిటో రుచి చూపించారు. విపక్షాలు లేవనెత్తే ప్రతి ప్రశ్నకు..దాసోజు అద్భుతమైన రీతిలో జవాబు ఇచ్చారు. పత్రికల్లో వ్యాసాలు రాశారు. అంతేకాకుండా తెలంగాణ పునర్ నిర్మాణం కోసం ఏం చేయాలనే దానిపై విస్తృతంగా ప్రసార మాధ్యమాల్లో పాల్గొన్నారు. తన వాణిని వినిపించారు. ఆ తర్వాత పార్టీ నుండి వీడి..కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ పార్టీకి గొంతుకగా మారారు. పార్టీ మేనిఫెస్టో తయారీలో ..ప్రజలకు చేరువయ్యేలా దాసోజు తనదైన ముద్ర కనబరిచారు. కేసీఆర్ చేస్తున్న మోసాన్ని ఒక్కడే ఎండగట్టారు.
ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రసంగాలను తెలుగులోకి అనువాదం చేసి ఔరా అనిపించారు. ఇపుడు శ్రవణ్ అవసరం రాష్ట్రానికే కాకుండా దేశానికి అవసరం ఉందన్న వాస్తవాన్ని ఆ పార్టీ అధినేత రాహుల్ గుర్తించారు. జాతీయ స్థాయిలో ఉన్నత పదవి కట్టబెట్టారు. ఏ ఇష్యూనైనా అవలీలగా అర్థం చేసుకోవడం..దానిని ప్రజల భాషలో విడమర్చి చెప్పడం ఆయనకే చెల్లింది. ఆ పార్టీ ఆయన చేసిన సేవలకు గుర్తుగా ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ టికెట్‌ను కేటాయించింది. జనం ఆయనను స్వీకరించలేదు. ఇలా అనడం కంటే గొప్ప లీడర్‌ను ఎన్నుకోలేక పోయారు. ఏ పార్టీలో ఉంటేనేం..తెలంగాణ వాయిస్‌ను హైదరాబాద్ నుంచి ఢిల్లీ దాకా వినిపిస్తున్న శ్రవణ్ మరిన్ని పదవులు పొందాలి. తెలంగాణ అస్తిత్వం కాపాడుకునేలా ..జయశంకర్ వారసత్వాన్ని కొనసాగించాలని కోరుకుందాం.
వెల్ఫేర్ ప్రాక్టీసెస్ ఇన్ ఇండస్ట్రియల్ ఆర్గనైజేషన్స్ కు ఎంఫిఎల్ చేసే వారికి సపోర్ట్ చేశారు. అకడమిక్ ఆక్టివిటీస్ పరంగా చూస్తే.. ఐపీఇలో మేనేజింగ్ ఇండస్ట్రీ ఇనిస్టిట్యూట్ రిలేషన్ షిప్, మేనేజ్‌మెంట్ ఫెస్టివల్స్ కు కోఆర్డినేటర్‌గా, ఐపీఇకి ప్రత్యేకంగా స్టూడెంట్ మాన్యువల్ ను దాసోజు తయారు చేశారు. హైదరాబద్ చాప్టర్ హెచ్ఆర్‌డి నెట్‌వర్క్‌లో మెంబర్‌గా ఉన్నారు. ఐఎస్‌టీడీ, హైసాకు అసోసియెట్‌గా పనిచేశారు. నాస్కాం, హెచ్ఎంఏ తదితర సంస్థలు నిర్వహించిన పలు సెమినార్లలో ఆయన కీలక వ్యక్తిగా పాల్గొన్నారు. దాసోజు గురించి చెప్పాలంటే..కనీసం ఓ సంవత్సరమైనా పడుతుంది. ప్రస్తుతానికి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఆయన అత్యున్నతమైన పదవులు పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి