ఐటీసీ గ్రూప్ ఛైర్మన్ కన్నుమూత
ప్రపంచంలోనే అత్యంత నమ్మకమైన కంపెనీగా పేరొందిన ఐటీసీ గ్రూప్ కంపెనీలకు దీర్ఘకాలం పాటు ఛైర్మన్‌గా ఉన్న వై.సి. దేవేశ్వర్ కన్నుమూశారు. ఆయనకు 72 ఏళ్ల వయసు. 2011లో భారత ప్రభుత్వం అందజేసే ప్రతిష్టాత్మకమైన పద్మ భూషణ్ అవార్డును ఆయన అందుకున్నారు. విశిష్టమైన నాయకత్వం..నిబద్ధత కలిగిన వ్యక్తిగా ఆయన ఎదిగారు. ఇండియాలో ఎక్కువ కాలం కంపెనీలకు ఛైర్మన్‌గా పని చేయడంతో చరిత్ర సృష్టించారు. 1996లో ఐటీసీ కంపెనీ తీవ్ర సంక్షోభంలో ఉన్న సమయంలో దేవేశ్వర్ ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఇక అప్పటి నుంచి నేడు తనువు చాలించేంత దాకా ఆయన ఎక్కువ కాలం సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించారు. స్టేక్ హోల్డర్స్, డైరెక్టర్లు కంపెనీని వీడారు. అయినా దేవేశ్వర్ వెనుతిరిగి చూడలేదు.
ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా కంపెనీని లాభాల బాట పట్టించేందుకు శాయశక్తులా ప్రయత్నం చేశాడు. కంపెనీకి జవసత్వాలు కలిగిస్తూ అభివృద్ధిలోకి తీసుకు వచ్చారు.
కంపెనీ బాధ్యతలు చేపట్టాక..రెండేళ్లు దాటిన తర్వాత ఐటీసీని పరుగులు పెట్టించారు. ఉద్యోగులు, సిబ్బందిలో నమ్మకాన్ని పెంచారు. వారికి అన్ని వసతులు కల్పించి మరింత ఉత్పత్తులు పెంచేలా కృషి చేశారు ఛైర్మన్. నష్టాలు లేకుండా చూడటం, కంపెనీకి అవరోధంగా మారిన ప్రొడక్ట్స్‌ను తొలగించు కోవడం , కాస్ట్ కటింగ్ ఏర్పాటు చేయడం కంపెనీకి కలిసొచ్చేలా చేసింది. ఎడైబిల్ ఆయిల్, ఫైనాన్షియల్ సర్వీసెస్ నుంచి వైదొలిగేలా చేశారు. నాలుగేళ్ల లోపే ఐటీసీకి పూర్వ వైభవాన్ని తీసుకు వచ్చారు. కొత్త రకంగా వ్యాపారాన్ని స్టార్ట్ చేశాడు. స్టేషనరీ వస్తువులతో పాటు ఆహార రంగంలోకి ఐటీసీ అడుగు పెట్టింది.
20 ఏళ్లుగా దేవేశ్వర్ నాయకత్వంలో ఐటీసీ కొత్త పుంతలు తొక్కింది. 5 వేల 200 కోట్లరాబడి నుండి 51 వేల 500 కోట్ల ఆదాయానికి పెంచేలా చేశాడు. షేర్ హోల్డర్లకు 23.3 శాతాన్ని డివిడెండ్ రూపంలో పంచారు. ఇండియన్ మార్కెట్ పరంగా చూస్తే..ఐటీసీ 2015 -2016లో 45 బిలియన్లుంటే, 1996 నుండి నేటి దాకా 50 సార్లు వాల్యూ పెరిగింది. కన్సూమర్ బిజినెస్ రంగంలో ఇది ఊహించని పరిణామంగా పేర్కొన్నారు సంజీవ్ గోయెంకా గ్రూప్ సంస్థల ఛైర్మన్ సంజీవ్ గోయెంకా. ఇండియన్ టొబాకో కంపెనీ అంటేనే సిగరెట్ లు గుర్తుకు వస్తాయి. అలాంటి కంపెనీని డిఫరెంట్ రంగంలోకి తీసుకు వచ్చి లాభాల బాట పట్టించిన ఘనత దేవేశ్వర్ దేనని చెప్పక తప్పదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్‌గా ఆయన పనిచేశారు. తన సేవలు అందించారు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి