ఐపీఎల్ మ్యాచ్ సరే..టికెట్ల మాటేమిటి..? ఫ‌్యాన్స్ సంగతేంటి..?
నిన్నటి దాకా ఎన్నికల వేడి తెలంగాణను రాజేస్తే..ఇపుడు దాని కేపిటిల్ సిటీ హైదరాబాద్‌ను ఐపీఎల్ ఫీవర్ అంటుకుంది. ఎక్కడ చూసినా..ఎవ్వరి నోట విన్నా ఫైనల్ మ్యాచ్ గురించే చర్చంతా..రచ్చంతా. ఇసుక వేస్తే రాలనంత జనం మ్యాచ్ జరిగే మైదానం వెలుపల నిలుచుకున్నారు. అదేదో మహేష్, పవన్ సినిమాల టికెట్ల కోసం క్యూలో నిల్చున్నట్లు ఫైనల్ పోరు చూసేందుకు నానా తంటాలు పడుతున్నారు. బంగారు తెలంగాణ సర్కార్ చేతులెత్తేసింది. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉందో లేదో ఎవరికీ తెలియదు. ఎన్నికలప్పుడు హడావుడి ..ఆ తర్వాత షరా మామూలే. టికెట్లు దొరకక యువతీ యువకులు లబోదిబోమంటున్నారు. సెమీ ఫైనల్ ఫోరుకు ఏపీలోని విశాఖ ఆతిథ్యం ఇస్తే..ఇపుడు ఫైనల్ మ్యాచ్ మన వంతు వచ్చింది. దీనిని ఆసరాగా తీసుకున్న మధ్య దళారీలు వందల్లో ఉన్న టికెట్లను వేలాది రూపాయలకు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం , క్రీడాశాఖ , సంస్థ చూసీ చూడనట్లుగా వ్యవహరిస్తున్నాయి.
దీనిని నియంత్రించాల్సిన బీసీసీఐ తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తోంది. ఇంతవరకు పూర్తి స్థాయిలో తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ ఏర్పడలేదు. దానికి ఇంకా గుర్తింపు రాలేదు. ఇందులో పాలిటిక్స్ ఉన్నాయి. గతంలో జరిగిన ఎన్నికల్లో మాజీ కెప్టెన్ అజార్ వివేక్‌పై తీవ్ర ఆరోపణలు చేశాడు. ఆటగాడే కాని వ్యక్తికి ఈ పదవి ఎందుకంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. ఇండియాకు ఎనలేని విజయాలను అందించి..ఎన్నో కప్పులను స్వంతం చేసుకుని..తిరుగులేని రికార్డులను స్వంతం చేసుకున్న ఈ హైదరాబాదీ ..మణికట్టు మాంత్రికుడు అజారుద్దీన్ అనూహ్యంగా ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆ తర్వాత బీసీసీఐ విధించిన నిషేధాన్ని ఎత్తివేసింది. అయినా ఇంకా మార్పు రాలేదు. కపిల్‌దేవ్, నవజ్యోతిసింగ్ సిద్ధూ లు , రాహుల్ ద్రవిడ్, అనిల్ కుంబ్లే లాంటి దిగ్గజ ఆటగాళ్లు అజారుద్దీన్‌కు సంపూర్ణ మద్ధతు ప్రకటించారు. ఆయన హయాలోనే భారత్ ఒక వెలుగు వెలిగింది. అటు టెస్ట్‌ల్లోను..ఇటు వన్డేల్లోను అనూహ్యమైన ..చారిత్రాత్మకమైన విజయాలు స్వంతం చేసుకుంది.
అజారుద్దీన్ తర్వాత కాంగ్రెస్‌లో జాయిన్ అయ్యారు. ఎంపీగా గెలిచారు. మళ్లీ పోటీ చేసి ఓడిపోయారు. తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో ప్రచార క్యాంపెయినర్ గా ఉన్నారు. ఎందుకనో ఇటీవల కొంత ప్రయారిటీ తగ్గినట్టు అనిపించింది. తెలంగాణ ప్రభుత్వం ఎంతో అనుభవం ఉన్న అజారుద్దీన్ వైపు ఎందుకు కాన్ సెంట్రేషన్ చేయడం లేదన్నది అభిమానుల ప్రశ్న. ఆయన సేవలను ఏదో రూపంలో వాడుకోవాలి. ఈరోజు వరకు తెలంగాణ క్రీడా సాధికారత సంస్థ..క్రీడలను ప్రోత్సహించిన పాపాన పోలేదు. ఎప్పుడు మ్యాచ్‌లు జరిగినా టికెట్ల లొల్లే. దొరకక తీవ్రమైన ఆరోపణలు నిర్వాహకులపై చేస్తూనే వస్తున్నారు. షరా మామూలే. సేమ్ సీన్ రిపీట్ అయింది మళ్లీ. ఐపీఎల్ ఫైనల్ కోసం జరిగే మ్యాచ్ కోసం ..ఇప్పటికే 39 వేల 450 సీట్లు కేటాయించారు. మ్యాచ్‌ను ప్రత్యక్షంగా చూసేందుకు తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఫ్యాన్స్ భారీ ఎత్తున హైదరాబాద్‌కు వచ్చారు.
వీటిలో సగానికి పైగా కనీసం ఫ్యాన్స్ కోసం టికెట్లను తీసి ఉంచాలి. కానీ 35 వేల సీట్లను ముంబై, చెన్నై జట్లు బ్లాక్ చేసి ఉంచాయి. దీనిపై క్రికెట్ అభిమానులు ముఖ్యంగా హైదరాబాదీలు తీవ్ర అభ్యంతరం తెలిపారు. ఉప్పల్ స్టేడియం చుట్టూ ఫ్యాన్స్ తిరుగుతున్నారు. ఇరు జట్లు వారి ఫ్యాన్స్ కోసం టికెట్లను ముందే అందజేశాయి. మిగిలన 4 వేల 450 టికెట్లలో 2 వేల 500 టికెట్లను స్పాన్సర్ షిప్ చేసిన కార్పొరేట్ కంపెనీలు చేజిక్కించు కోగా..సామాన్యులకు కేవలం 2 వేల టికెట్లు మాత్రమే మిగిలాయి. వీటిని కూడా ఆన్ లైన్లో చాలా మంది బుక్ చేసుకున్నారు. నిన్న మధ్యాహ్నమే చాలా మంది హైదరాబాద్‌కు చేరుకున్నారు. హోటళ్లన్నీ నిండి పోయాయి వీరితో. ఇక రిలయన్స్ కంపెనీకి చెందిన ఉద్యోగులు 5 వేల మంది బుక్ చేసుకోవడం విచిత్రం. వివిఐపీలకు కూడా టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది. ఐపీఎల్ నిర్వాహకులు హెచ్‌సిఏకు కొద్ది పాసులే ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తమైంది. ఫైనల్ మ్యాచ్ ఏమో కానీ ..ఇది మాత్రం పక్కా కార్పొరేట్ దందాగా మారింది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి