అందరి చూపు మోదీ వైపు
గతంలో ఎన్నడూ లేనంతగా భారతదేశంలో జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందో ఏ సంస్థా సరైన అంచనాకు రాలేక పోతున్నాయి. మారుతున్న సమీకరణలు , తీసుకున్న నిర్ణయాలు ఒకింత ఆశ్చర్యం కలిగించినా మోదీ సర్కార్ వైపు సామాన్యులు చూస్తున్నారనేది స్పష్టమవుతోంది. కొన్ని వర్గాలు, సంస్థలు, కార్పొరేట్ కంపెనీలు తమ గుప్పిట్లో వుంచుకునేందుకు శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తున్నాయి. దేశమంతటా ఒక ఎత్తయితే..మోదీ ఒక్కరే ఒక్కడుగా ఈ ఎన్నికల్లో ఒంటరి పోరాటం సాగిస్తున్నారు. ప్రాంతీయ పార్టీల పేరుతో చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లు కూటములు కట్టినా ఫలితం లేకుండా పోతోంది. ముందస్తు సర్వేలు ఎంతగా హంగ్ ఏర్పడుతుందని మొత్తుకుంటున్నా ఫలితాలు మాత్రం దిమ్మ తిరిగేలా ఉండబోతున్నాయనేది కరడు కట్టిన ..నిఖార్సయిన జర్నలిస్టుల అంచనా. నోట్ల రద్దు, నిరుద్యోగం, ఉపాధి అవకాశాలు లేక పోవడం, కొత్త పరిశ్రమలు ఏర్పాటు కాక పోవడం ఇవేవీ మోదీ ప్రభుత్వాన్ని నీరుగార్చలేక పోతున్నాయి.
బీజేపీ సర్కార్‌కు వ్యతిరేకంగా బలమైన ప్రతిపక్షం కానీ, నాయకుడు కానీ ముందుకు రాలేక పోవడం కూడా మరో అడ్వాంటేజ్‌గా పరిగణించక తప్పదు. 545 లోక్‌సభ స్థానాలకు గాను 543 స్థానాలకు ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆరు విడతల ఎన్నికలు జరిగాయి. కొన్ని చోట్ల ఘర్షణలు తలెత్తినా అంతా ప్రశాంతంగా పోలింగ్ పూర్తయింది. 11 ఏప్రిల్ నుండి 19 మే 2019 వరకు పూర్తి కానున్నాయి. 17వ లోక్‌సభకు జరుగుతున్న ఎన్నికలు దేశంలో ఒక కొత్త సమీకరణకు..సుస్థిరమైన ప్రభుత్వ ఏర్పాటుకు మార్గం ఏర్పడబోతుందని కాలమిస్టుల అంచనా. ఈనెల 23న పోలింగ్ కౌంటింగ్ జరుగనుండగా 24న పూర్తి ఫలితాలు వెల్లడించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. దీంతో ఆరోజే ఏ ప్రభుత్వం కేంద్రంలో కొలువు తీరనుందో తేలనుంది. లోక్‌సభ ఎన్నికలతో పాటు ఆంధ్రప్రదేశ్, అరుణా చల్ ప్రదేశ్, ఒడిస్సా, సిక్కిం రాష్ట్రాలకు సంబంధించి అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాయి. 18 ఏళ్లు నిండిన వారంతా ఈసారి పెద్ద ఎత్తున ఓట్లు వేశారు.
ఇక రాష్ట్రాల వారీగా చూస్తే లోక్‌సభ సీట్లు ఇలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 25 లోక్‌సభ సీట్లుండగా, అరుణాచల్ ప్రదేశ్‌లో 2, అస్సాంలో 14, బీహార్‌లో 40 సీట్లకు పోలింగ్ జరిగింది. ఛత్తీస్‌గఢ్‌లో 11 సీట్లు, గోవాలో 2, గుజరాత్‌లో 26, హర్యానాలో 10, హిమాచల్ ప్రదేశ్‌లో 4, జమ్మూ అండ్ కాశ్మీర్ లో 6, జార్ఖండ్ లో 14 సీట్లు, కర్ణాటకలో 28 సీట్లు, కేరళలో 20 , మధ్య ప్రదేశ్‌లో 29 సీట్లు, మహారాష్ట్రలో 48 సీట్లు, మణిపూర్ లో 2, మేఘాలయలో 2, మిజోరంలో ఒకటి, నాగాలాండ్‌లో ఒకటి, ఒడిస్సాలో 21 సీట్లున్నాయి. మరో వైపు పంజాబ్‌లో 13 సీట్లు, సిక్కింలో ఒకటి, తమిళనాడులో 38 సీట్లు, తెలంగాణలో 17 సీట్లు, త్రిపురలో రెండు , ఉత్తరప్రదేశ్‌లో 80 అత్యధిక సీట్లు ఉన్నాయి. ఉత్తరాఖండ్‌లో 5 సీట్లు, పశ్చిమ బెంగాల్‌లో 42 సీట్లు, అండమాన్ నికోబార్ ఐలాండ్స్‌లో ఒకటి, ఛండీఘర్ లో ఒకటి, దాద్రా అండ్ నగర్ హవేలీలో ఒకటి, దామన్ అండ్ డయూలో ఒకటి , ఢిల్లీలో ఏడు సీట్లు, లక్షద్వీప్‌లో ఒకటి, పాండిచ్చేరిలో ఒకటి లోక్‌సభ సీట్ల చొప్పున ఉన్నాయి.
మొత్తం 542 సీట్లకు దేశ వ్యాప్తంగా పోలింగ్ జరుగుతోంది. ఇప్పటికే ఆరు విడతలు పూర్తి కాగా..ఏడో విడత 19వ తేదీతో పరిసమాప్తం అవుతుంది. ముందస్తు సర్వే సంస్థలు, ఆయా ప్రింట్ అండ్ మీడియా ఛానల్స్ బీజేపీ , మోదీ సర్కార్ గురించి సరైన అంచనా వేయలేక పోతున్నాయి. దేశ వ్యాప్తంగా కొంత మోదీకి వ్యతిరేకత ఉన్నప్పటికీ ..ఇండియాకు ఒక బలమైన నాయకుడు లేదా నాయకురాలు దగ్గరగా లేక పోవడంతో ఎక్కువ అవకాశాలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోయేది మోదీనేనని మేధావుల అంచనా. నోట్ల రద్దు వ్యవహారం , బ్లాక్ మనీని ఇండియాకు తెప్పించలేక పోవడం, అన్ ఎంప్లాయిబిలిటీ , రైతుల ఆత్మహత్యలు, విపక్షాల ఆందోళనలను సరైన రీతిలో ఎదుర్కోలేక పోవడం, స్వంత పార్టీ నుండే విమర్శలు, ఆరోపణలు ఎదుర్కోవడం మోదీకి ఇబ్బందిగా మారింది.
అయినా మోదీ తన ఛరిస్మాను మాత్రం కోల్పోలేదు. దేశ వ్యాప్తంగా జరిపిన సర్వేలో బలమైన దేశ నాయకుడు ఎవరు అని ప్రశ్నిస్తే..సర్వే చేస్తే మోదీకే ఎక్కువ ప్రయారిటీ లభించింది. రాహుల్ గాంధీ ఇప్పటి వరకు పరిణతి చెందిన నాయకుడిగా ఇంకా ఎదగక పోవడం కూడా మోదీకి అడ్వాంటేజ్‌గా మారింది. ప్రియాంక గాంధీ ఆఖరులో రాజకీయాల్లోకి ఎంటర్ కావడం కూడా కాంగ్రెస్ కు కొంత ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నాయి. ఈసారి ఇటు కాంగ్రెస్ మిత్రపక్షాలకు గానీ అటు బీజేపీ పక్షాలకు కానీ పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మ్యాజిక్ ఫిగర్ రాదన్నది మేధావుల అభిప్రాయం. దీంతో ప్రాంతీయ పార్టీలు ఏర్పాటు చేయబోయే సర్కార్‌లో కీలక పాత్రను పోషించనున్నాయని చంద్రబాబు లాంటి వారు చెబుతున్నా..గ్రౌండ్ పరంగా చూస్తే అంత లేదన్నది అర్థమవుతోంది.
ఈ విషయంలో అంచనా వేయడంలో సామాన్యుల అభిప్రాయాలను సరిగా అంచనా వేయలేక పోతున్నాయి. కొన్ని సర్వే సంస్థలు మిత్రపక్షాలదే కీలకం అంటుండగా..మరికొన్ని బీజేపీ, కాంగ్రెస్ లకు గడ్డు కాలం ఉందంటూ పేర్కొంటున్నాయి. కర్ణాటక, ఉత్తర్ ప్రదేశ్, ఢిల్లీ, మధ్యప్రదేశ్, హర్యానా, మాహారాష్ట్ర, కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాళ్, తదితర రాష్ట్రాలలో బీజేపీ అనూహ్యంగా తన ఓటు బ్యాంకును పెంచుకుంది. ఇది ఓట్ల శాతంగా మారితే మ్యాజిక్ ఫిగర్‌ను దాటేసి స్వంతంగా ఏ ఒక్కరి సహకారం లేకుండానే కేంద్రంలో కొలువు తీరే అవకాశం ఉంది. చంద్రబాబు, కేసీఆర్, మమతా, స్టాలిన్, కుమారస్వామి, కేజ్రీవాల్, మాయావతి, అఖిలేష్ లు ఎన్ని కూటములుగా ఏర్పడినా చివరకు మోదీ వైపు ప్రజలు మొగ్గు చూపారన్నది విస్పష్టం. 24న ఢిల్లీలో రాజు ఎవ్వరో తేలనుంది.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి