జగపతి మైహోంకు దళపతి..!
విలువలే పునాదిగా వ్యాపారాన్ని కొత్త పుంతలు తొక్కిస్తూ విజయపధంలో దూసుకెళ్తున్న తెలుగు లోగిళ్ళలో మరిచిపోలేని బ్రాండ్ ఇమేజ్ స్వంతం చేసుకున్న మై హోమ్ కు అసలైన దళపతి జూపల్లి రామేశ్వర్ రావు తమ్మడు జగపతి రావు. మనం రామాయణం విన్నాం. సీత రాముల కథ చదువుకున్నాం. కానీ వాళ్ళను చూడలేదు . రాముడి కోసం తమ్ముడు లక్ష్మణుడు చేసిన త్యాగం గొప్పది. కొద్దిగా డాబూ సమకూరితే చాలు అన్నీ మరిచి పోతాం. తనవారిని వదిలేసుకుంటాం. అయినా వారిని కాదనుకుని లేనివారి కోసం పరుగులు తీస్తాం. కానీ ఇన్నేళ్ళైనా వాళ్లిద్దరూ ఒకే ఆత్మలాగా తమ ప్రస్థానాన్ని కొనసాగిస్తున్నారు. వీళ్ళను చూసి ఊరు స్ఫూర్తి పొందుతోంది. వ్యాపారం అందరు చేస్తారు. కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. దీని నేర్పు ఒక్కటే కాదు ఓర్పు ఉండాలి . ఎత్తులు పై ఎత్తుల మధ్య ..ఆటుపోట్లను తట్టుకుని పెంచుకుంటూ పోవాలి . మార్కెట్ ను నిశితంగా గమనించాలి. ఏ చిన్న పొరపాటు జరిగినా కోట్లాది రూపాయలు నష్టపోయే అవకాశం వుంది . ఇదంతా కుటుంబాన్ని , స్నేహితులను ..నా అనుకున్న వారిని ..లోకానికి దూరంగా ఒంటరిగా కష్టపడితే అనుకున్న చోటుకు చేరుకుంటాం. ఇదే జగపతి రావు తన వారి కోసం త్యాగం చేశారు . కుటుంబమే ఆలంబనగా ఆయన ఎన్నో ప్రాజెక్టులు చేపట్టారు. అన్న సహకారం ..కుటుంబీకుల తోడ్పాటు ..సిబ్బంది , ఉద్యోగుల సహకారం తో ఆయన అన్నిటిని ముందుండి నడిపిస్తున్నారు . అన్నీ తానై జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు . ఓటమి నేర్పిన పాఠం . సమస్యలను దాటుకుంటూ ఒక్కో ఇటుక పేర్చుకుంటూ గెలుపు శిఖరాలను అందుకునేలా చేశారు .
నిర్మాణ రంగంలో అత్యంత ఆదరణీయమైన , నమ్మకమైన , నాణ్యవంతమైన ఫర్మ్ గా మై హోమ్ ను ఆయన తీర్చి దిద్దారు . అన్న చెప్పింది వేదం . తమ్ముడు ఆచరిస్తే అది విజయం ..ఇదే జగపతి రావు ప్రస్థానం. కొన్నేళ్లుగా బంధాలకు గుర్తుగా మై హోమ్ పేరు పెట్టారు . అతి పెద్ద సంస్థగా మారినా ఇంకా వాళ్ళు పల్లెతనపు సంస్కృతిని ఆచరిస్తారు. ఇది సంస్కారానికి సంకేతం. ఒక స్థాయికి రానంత వరకు ఎన్నో మార్పులు మరెన్నో చేర్పులు వ్యాపారాల్లో చోటు చేసుకుంటూ ఉంటాయి. అలాగే ఇక్కడ కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా తమ వ్యాపారాన్ని విస్తరించేలా చేయడంలో జగపతి రావు దళపతిని తలపింప చేసారు . మేనేజింగ్ డైరెక్టర్ గా ఆయన సక్సెస్ ఫుల్ గా మై హోమ్ తో పాటు మిగతా వ్యాపారాలను పరుగులు పెట్టిస్తున్నారు. తాను ముందుండి నడిపిస్తున్నారు. పదహారు కంపెనీలకు జూపల్లి జగపతి రావు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. పలమాకుల టూరిజం డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ , ఎలిగెంట్ ఆగ్రోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ , మంజరి కన్స్ట్రుక్సన్స్ ప్రైవేట్ లిమిటెడ్ , మురళీకృష్ణ ల్యాండ్ మార్క్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్ , మూలికా ఆగ్రో ప్రోడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ , జీజేఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ , స్పినోజా ఎంటర్ ప్రైజెస్ ప్రైవేట్ లిమిటెడ్ , మై హోమ్ పవర్ కన్సెల్టెన్సీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ , అబ్జా పవర్ ప్రైవేట్ లిమిటెడ్ , జేబీఎమ్ ఎక్సపోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ , వినోద్ రియల్ ఎస్టేట్ ప్రైవేట్ లిమిటెడ్ , జేబీఎమ్ రిసార్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ , జేబీఎమ్ గార్డెన్స్ ప్రైవేట్ లిమిటెడ్ , జేబీఎమ్ ఆగ్రోస్ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్ , జేఆర్ రియల్టర్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలున్నాయి.
ఒక్క కంపనీ పెట్టాలన్నా ..నడపాలన్నా చాలా కష్టం. ఇన్ని కంపెనీలను ఆయన తన బలగంతో కలిసి సమర్ధవంతంగా నడిపిస్తున్నారు. తమ పిల్లలకు విలువలు ..భక్తితో పాటు వ్యాపార మెళకువలు నేర్పుతూనే జీయర్ కార్యక్రమాలను కూడా పర్యవేక్షిస్తున్నారు జూపల్లి జగపతి రావు. అన్నదమ్ములిద్దరూ రామలక్ష్మణులు. ఉమ్మడి కుటుంబం సాధించిన విజయమే మై హోమ్. మీకు మీరే సాటి. ఇంకొకరితో పోటీ వద్దే వద్దు. మీదైన బ్రాండ్ కోసం వచ్చే దాకా కష్టపడండి. గెలుపు అండ్ దాకా ..అది వచ్చిందా లోకం మీకోసం వేచి చూస్తోనే ఉంటుంది అంటారు ..జగపతి రావు. కాదంటారా ..ఎలా అనగలం..!

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి