జ‌గ‌మెరిగిన జ‌న‌నేత వెంక‌య్య..!

భార‌త దేశ రాజ‌కీయాల్లో నిరంత‌రం వినిపించే అరుదైన పేరు వెంక‌య్య నాయుడు. ఆయ‌న ఎక్క‌డున్నా సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌గా మారిపోతారు. అపార‌మైన విష‌య ప‌రిజ్ఞానంతో పాటు స‌మ‌స్య‌ల నుండి గ‌ట్టెక్కించ‌డంలో ఆయ‌న‌కు ఆయ‌నే సాటి. నిరంత‌రం సానుకూల‌ దృక్ఫ‌థాన్ని అవలంభించే ఆయ‌న ఏది మాట్లాడినా అది వార్తే అవుతుంది. అంత‌టి ప్ర‌తిభా శాలి.ఎంద‌రు పాల‌కులు మారినా..ఎన్ని ప్ర‌భుత్వాలు వ‌చ్చినా వెంక‌య్య నాయుడు మాత్రం అలాగే ఉన్నారు. న‌మ్మిన సిద్ధాంతానికి క‌ట్టుబ‌డి ఉంటూనే త‌న‌దైన శైలిని స్వంతం చేసుకున్నారు. త‌నకంటూ ఓ ఇమేజ్‌తో పాటు మ‌రో బ్రాండ్‌ను సృష్టించుకున్నారు. క‌మ‌ల వికాసంలో ఆయ‌న విస్మ‌రించ‌లేని పాత్ర‌ను పోషించారు. రాజ‌కీయంలో ఎలా నెట్టుకు రావాలో..ఎక్క‌డ నెగ్గాలో .ఎక్క‌డ త‌గ్గాలో తెలిసిన విజ్ఞుడు..అప‌ర చాణుక్యుడు వెంక‌య్య‌. తెలుగు, ఇంగ్లీష్‌, హిందీ, సంస్కృతం ఇలా అనేక భాష‌ల్లో ఆయ‌న‌కు ప‌ట్టుంది. చెప్ప‌లేనంత స‌మాచారం ఆయ‌న అమ్ముల పొదిలో ఉంది.అందుక‌నే ఆయ‌న మోడీకి కుడి భుజంగా మెలుగుతూ వ‌చ్చారు. త‌న‌కంటూ ఓ టీంను..మ‌రో అనుంగు సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నారు. తాను అనుకున్నారంటే సాధించేదాకా వ‌దిలి పెట్ట‌ని మ‌న‌స్త‌త్వం క‌లిగి ఉండ‌డం వ‌ల్ల‌నేమో ఆయ‌న నేటికీ చ‌క్రం తిప్ప‌గ‌లుగుతున్నారు.

ఏ అంశ‌మైనా స‌రే దానిని అమూలాగ్రం తెలుసుకునే ప్ర‌య‌త్నం చేస్తారు. దేశంలో అతి కొద్ది మంది ఎన్న‌ద‌గిన నేత‌ల్లో మోదీ, కేసీఆర్‌తో పాటు వెంక‌య్య నాయుడు కూడా ఒక‌రు. ఒక ప‌ట్టాన ఓటమిని ఆయ‌న ఒప్పుకోరు. గెలుపు సాధించే దాకా నిద్ర‌పోరు. ఇదీ ఆయ‌న మ‌న‌స్త‌త్వం. పోరాట‌మే బ‌లం…అదే న‌న్ను న‌డిపిస్తోంది అంటారు ఇప్ప‌టీకీ.. ఇక వ్య‌క్తిగ‌తానికి వ‌స్తే ..వెంకయ్య నాయుడు 1949, జూలై 1న ఆంధ్ర ప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా చవటపాలెం గ్రామంలో జ‌న్మించారు.  నెల్లూరులోని వి.ఆర్.కళాశాల నుంచి డిగ్రీ చేశారు. ఆంధ్ర విశ్వ విద్యాలయము నుంచి న్యాయశాస్త్రంలో పట్టా పొందారు. 2002లో జానా కృష్ణమూర్తి తరువాత భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిని చేపట్టి 2004, అక్టోబర్ 18 వరకు ఆ పదవిలో సేవ‌లందించారు. రెండు సార్లు ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎన్నిక‌య్యారు. భారతీయ జనతా పార్టీకి పూర్వ వైభ‌వం తీసుకు రావ‌డంలో ఆయ‌న కృషి చేశారు. అనేక రాష్ట్ర, జాతీయ పదవులను పొంది దేశవ్యాప్తంగా మంచి పేరు సంపాదించాడు. ఆ తరువాత రాజ్యసభకు ఎన్నికై ఆ పదవిలో కొనసాగుతున్నారు.

విద్యార్థి జీవితం నుంచే వెంకయ్యనాయుడు సాధారణ ప్రజానీకపు సంక్షేమానికి పాటుపడ్డారు .సమాజంలో అణగారిన వర్గాల కోసం, రైతు కుటుంబాల కోసం ఆయ‌న కృషి చేశారు. అప్పుడే రాజ‌కీయాల‌పై ఆయ‌న‌కు ఆస‌క్తి ఏర్ప‌డింది. ఎమ‌ర్జెన్సీకి వ్య‌తిరేకంగా వెంక‌య్య గ‌ళం విప్పారు. అనేక మాసాలు జైలు జీవితం గడిపారు. మే 8, 2010న శాసనసభలో, రాజ్యసభలో, భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిలో ఉన్నప్పుడు చేసిన ప్రసంగాలను ఆయన మిత్ర బృందం “అలుపెరుగని గళం విరామమెరుగని గళం.” పేరుతో పుస్త‌కాన్ని విడుద‌ల చేశారు. 2000లో అటల్ బిహారీ వాజపేయి నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా పని చేశారు.. 2002 జూలై 1 నుంచి 2004, అక్టోబర్ 5 వరకు భారతీయ జనతా పార్టీ అధ్యక్ష పదవిలో సేవలందించారు. మహారాష్ట్ర ఎన్నికలలో పార్టీ ఓటమికి నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశారు. .

రెండు సార్లు వెంకయ్య నాయుడికి తృటిలో పెద్ద ప్రమాదాలు తప్పాయి. 2005, జనవరి 29న బీహార్ లోని గయ పర్యటనలో ఉండగా మావోయిస్టులు అతని హెలికాప్ట‌ర్‌కు నిప్పంటించారు. వెంటనే తేరుకొని తప్పించుకున్నారు. . మరోసారి 2007, జూలై 15న ఉత్తర ప్రదేశ్ లోని లక్నో విమానాశ్రయం సమీపంలో ఆయ‌న ప్రయాణిస్తున్న హెలికాప్టర్ హైడ్రాలిక్ బ్రేకులు విఫలం కావడంతో అత్యవసరంగా కిందికి దిగాల్సి వచ్చింది. అదృష్టవశాత్తు చిన్న గాయాలతో బయట ప‌డ్డారు. ఉద్య‌మ నేత‌గా పేరొందిన మంద కృష్ణ మాదిగ వేలాది మంది సాక్షిగా వెంక‌య్య పాదాల‌కు న‌మ‌స్క‌రించారు. అదో పెద్ద వివాదం అయింది. అయినా మంద ఒప్పుకోలేదు. తాను చేసింది క‌రెక్టేన‌ని స్ప‌ష్టం చేశారు. వెంక‌య్య ఏర‌కంగా ద‌ళితుల‌కు సాయం చేశారో వివ‌రించారు. ఇదీ ఆయ‌న‌కున్న ఫాలోయింగ్‌కు ఇంత‌కు మించి ఉదాహ‌ర‌ణ అక్క‌ర్లేదు.ఒక మాస్ లీడ‌ర్‌గా ఎలా ఎద‌గాలో చూసి నేర్చు కోవాలంటే వెంక‌య్య నాయుడును ద‌గ్గ‌రుండి చూడాలి. తెలుగు వారి ప‌రంగా చూస్తే ఈ ప్రాంతం నుండి ఎంద‌రో నాయ‌కులుగా స‌క్సెస్ అయ్యారు. చ‌రిత్ర సృష్టించారు. తెలంగాణ నుండి సూదిని జైపాల్ రెడ్డి ..ఆంధ్ర నుండి వెంక‌య్య నాయుడులు ఏక‌కాలంలో త‌మ ప్ర‌తిభా పాట‌వాల‌తో గుర్తింపు తెచ్చుకున్నారు. మాస్ లీడ‌ర్స్ నెవ‌ర్ ఫెయిల్‌..దే ఆర్ ఆల్వేస్ స‌క్సెస్‌ఫుల్  ప‌ర్స‌న్స్ ఫ‌రెవ‌ర్ ..అన్నది వీరిని చూస్తే తెలుస్తుంది .

రాజ‌కీయ ప‌రంగా ఎంతో అనుభ‌వం గ‌డించిన ముప్ప‌వ‌రపు వెంక‌య్య నాయుడు ఇపుడు ఉప రాష్ట్రప‌తిగా స‌మ‌ర్థ‌వంతంగా బాధ్య‌త‌లు నిర్వ‌హిస్తున్నారు. క‌మ‌లం వాడిపోకుండా పార్ల‌మెంట్ సాక్షిగా ఆయ‌న త‌న వాగ్ధాటితోనే కాదు ప‌రిపాల‌నా ప‌ర‌మైన లౌక్యంతో ప్ర‌తిప‌క్షాల నుండి ప్ర‌భుత్వాన్ని గ‌ట్టెక్కించేలా చేస్తున్నారు. ఆహార్యంలోనే కాదు జీవ‌న ప్ర‌యాణంలో తెలుగుద‌నం మ‌రిచి పోలేని వ్య‌క్తి వెంక‌య్య‌నాయుడు. ఆయ‌న ఢిల్లీలో ఉన్నా త‌ను మాత్రం తెలుగు వాడినేన‌ని గ‌ర్వంగా చెబుతారు. అంత‌గా ఆయ‌న లీన‌మై పోయారు. ఆయ‌న ఎక్క‌డికి వెళ్లినా తెలుగు భాష రాను రాను మృగ్య‌మై పోతోంద‌న‌ని ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు. తెలుగును బ‌తికించు కోవాలంటూ విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. ఎంతో ఉన్న‌త‌మైన స్థానంలో ఉన్న‌ప్ప‌టికీ త‌న మూలాల‌ను మ‌రిచి పోయిన వెంక‌య్య నాయుడు నిజంగా గొప్ప‌వాడు కాదంటారా..!

కామెంట్‌లు