కవితమ్మ..బతుకమ్మ..!
తెలంగాణ మాగాణంలో విస్మరించలేని పదం కల్వకుంట్ల కవిత. ఇప్పుడు కొత్త రాష్ట్రంలో ఆమె పేరు వినని వారంటూ వుండరు. అంతగా ప్రాచుర్యం పొందారు. ఇటు రాష్ట్ర స్థాయిలోను అటు దేశ విదేశాలలో తెలంగాణ జాగృతి సంస్థ వ్యవస్థాపకురాలిగా నలుదిశలా వినుతికెక్కారు. ఉద్యమ నేపథ్యం ..అపారమైన విజ్ఞానం. నాయకత్వ నైపుణ్యం ఆమె సొంతం.ఏది మాట్లాడినా సరే ఒక విజన్ ఉండేలా ఎదుటి వారిని మెప్పిస్తారు. ప్రపంచాన్ని నివ్వెర పోయేలా చేసిన తెలంగాణ రాష్ట్ర ఉద్యమ పోరులో ఆమె చేపట్టిన బతుకమ్మ పండుగ ఒక బ్రాండ్ గా మారి పోయింది . బతుకమ్మ అంటేనే కవితమ్మ అనే పేరు చీర స్థాయిగా నిలిచి పోయేలా చేసింది . ఇదంతా ఆమె సాధించిన అపూర్వ విజయం ఇది. ఇందులో ఎలాంటి అనుమానాలు లేవు. నిరంతర నిర్బంధంలో సైతం ఆడబిడ్డల్ని ఒకే తాటిపైకి తీసుకు వచ్చిన ఘనత ఆమెదే. ఎన్నో అవమానాలు .. మరెన్నో ఆరోపణలు ..వాటినన్నిటిని ధైర్యంతో ఎదుర్కొన్నది. తానే నేటి యువతకు ఓ ఐకాన్ లాగా మారి పోయింది. అదీ ఆమెకున్న ఘనత ..ప్రత్యేకత. తెలంగాణ యాస ..భాష..కట్టు బొట్టు .అన్నిటిని ఆమె జనంలోకి తీసుకు వెళ్లారు . దేశం దాటి ఖండాతరాళాల్లో తెలంగాణ సంస్కృతి .. సాంప్రదాయాలను పాటించేలా చేశారు .
ఇప్పుడు ఎక్కడ చూసినా మన ఆడబిడ్డలు ..ముత్తైదువులు ..బోనం ఎత్తుతున్నరు..ఆట పాటల్లో సేద దీరుతున్నారు. అచ్చమైన మట్టితనం కలబోసుకున్న మహిళలంతా ఒకే గొంతుకై పడేలా ప్రతి ఏటా బతుకమ్మ ను ఘనంగా నిర్వహించేలా ఆమె పాటు పడ్డారు . ఇప్పుడు ప్రతి ఆడబిడ్డ కవితక్కా అంటూ ఆప్యాయంగా పిలుస్తారు. ఇదంతా ఆమె సాధించిన ఘనత.ఉద్యమ నేతగా తన తండ్రి కేసీఆర్ ఉన్నా ఆమె మాత్రం తనకంటూ ఓ ఇమేజ్ ను సృష్టించుకున్నారు . అన్నిటా ఆమె తనదైన ముద్రను వేశారు . ఎంపీగా భారీ విజయం సాధించినా ఆమె పొంగి పోలేదు . ఈ గెలుపు తనది కాదని ఇది ప్రజల విజయమని స్పష్టం చేశారు . అచ్చమైన ఆడబిడ్డనని చాటి చెప్పారు . ఇక పార్లమెంట్ సమావేశాల్లో ఆమె పలు అంశాలపై పక్కా సమాచారంతో ప్రసంగించారు. ఆమె మాట్లాడిన తీరుకు ఎందరో సభ్యులు అభినందనలు తెలిపారు . ఆచి తూచి మాట్లాడే నాయకురాలిగా ఆమె స్వల్ప కాలంలోనే పేరు తెచ్చుకున్నారు .
1978 మార్చి 13 న జన్మించిన ఆమె విద్యా పరంగా పరిణతి సాధించారు . తండ్రి అడుగు జాడల్లో నడుస్తూ తెలంగాణకు పేరు తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు .తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పార్లమెంట్ సభ్యురాలిగా ఎన్నికైన మొదటి మహిళగా ఓ రికార్డ్ సృష్టించారు . జేఎన్టీయూ లో చదివాకా అమెరికాలోని యూనివర్సిటీలో ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ చేశారు . పలు భాషల్లో ఆమెకు ప్రావీణ్యం ఉంది . అంతే కాక అచ్చమైన తెలంగాణ మాండలికాన్ని వాడుతారు . అందుకే ప్రజలు ఆమె ఏది చెప్పిన శ్రద్దగా వింటారు .పూల పండుగగా ప్రసిద్ధి చెందిన బతుకమ్మకు లోకమంతటా ప్రాచుర్యం కల్పించిన చరిత్ర ఆమెదే. బతుకమ్మ అంటేనే కవితమ్మ అనే స్థాయికి తీసుకు రావడంలో అహోరాత్రులు కృషి చేశారు . ఎందరినో ఒప్పించారు .. ఇంకొందరు గేలి చేసినా ఆమె వెనక్కి తగ్గలేదు . ఇప్పుడు ప్రాంతాలకు అతీతంగా ..తెలుగు వారంతా బతుకమ్మలై ఆడుతున్నారు . కవితమ్మకు జై కొడుతున్నారు . ఆమెకు ఇద్దరు పిల్లలు . అయినా ఓ వైపు కుటుంబ భాద్యతలు నిర్వహిస్తూనే మరో వైపు బతుకమ్మను భుజానికి ఎత్తుకున్నారు . తెలంగాణ తల్లి ఋణం తీర్చుకున్నారు .
2004 వరకు ఆమె అమెరికాలో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పని చేశారు . వేల రూపాయల వేతనాన్ని వదులుకున్నారు . తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పుట్టిన నేల విముక్తి కోసం తన జీవితాన్ని అంకితం చేశారు. రాష్ట్రం సిద్దించే దాకా తెలంగాణ అంతటా విస్తృతంగా పర్యటించారు . జనంతో మమేకమయ్యారు. 2006 తెలంగాణ జాగృతి సంస్థను ఆమె ఏర్పాటు చేశారు . దాని ద్వారానే అన్ని కార్యక్రమాలు చేపట్టారు . 2008 రిజిస్ట్రేషన్ చేయించారు . ఇప్పుడు అన్ని కార్యక్రమాలు దీని ద్వారానే చేస్తున్నారు. వేలాది మంది ఈ సంస్థలో సభ్యులై ఉన్నారు . తెలంగాణ ఉనికిని కాపాడుతున్నారు .తెలంగాణ జాగృతి సంస్థ ప్రజలకు ఉపయోగ పడేలా ఎన్నో కార్యక్రమాలు రూపొందించారు . అందులో భాగంగా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ సెంటర్లు ఏర్పాటు చేశారు . యువతీ యువకులకు ట్రైనింగ్ ఇస్తూ వారి కాళ్ళ మీద వారు నిలబడేలా చేస్తున్నారు . వేలాది మంది నిరుద్యోగులకు దీని ద్వారా ఉపాధి లభిస్తోంది . ఓ వైపు ప్రజల మధ్య ఉంటూనే బతుకమ్మ కు మరింత వన్నె తెచ్చేలా కవితమ్మ పాటు పడుతున్నారు .
లేబర్ యూనియన్ల కు ఆమె గౌరవ అధ్యక్షురాలిగా ఉన్నారు . కార్మికులకు , ఉద్యోగులకు అండగా ఉంటున్నారు . తెలంగాణ పునర్ నిర్మాణంలో అన్ని వర్గాల వారిని పాలు పంచుకునేలా ఆమె కృషి చేస్తున్నారు . తనదైన శైలితో దూసుకు వెళుతున్నారు . దేశం మొత్తం తన వైపు చూసేలా తనను తాను మల్చుకున్నారు. ఇదంతా ఒక్క రోజూలో వచ్చింది కాదు ..కొన్నేళ్ల పాటు చేసిన శ్రమకు దక్కిన గౌరవం ఇది . ఇక భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కు తెలంగాణ చాఫ్టర్ కు చీఫ్ కమీషనర్ గా ఎన్నికయ్యారు . ఇది కూడా ఓ చరిత్రే. కవిత లో ప్రతిభ .. పట్టుదల ..అంకితభావం .. సమాచార విశ్లేషణ గమనించిన కేంద్రంలోని సర్కార్ పలు కమిటీల్లో సభ్యురాలిగా ప్రమోట్ చేసింది . అంచనాల కమిటీ , గ్రామీణాభివృద్ధి , పంచాయతీ రాజ్ , తాడిత కమిటీల్లో ఆమెను సభ్యురాలిగా నియమించారు . కామన్వెల్త్ వుమెన్ పార్లమెంటరీ కమిటీ ఇండియా రీజియన్ కు స్టీరింగ్ కమిటీ సభ్యురాలిగా కవితను నామినేట్ చేశారు . ఆమె సాధించిన విజయానికి మచ్చుతునక . మొత్తం మీద కవిత లేకుండా బతుకమ్మ లేదు . ఇది ఆమెకు మాత్రమే సాధ్యం . అది ఎవ్వరు కాదనలేని సత్యం .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి