ఆధ్యాత్మిక లోగిలి ..ఆనందపు వాకిలి..!
ఎవ్వరైనా గంటల తరబడి మాట్లాడగలరు. కానీ కొద్దీ సేపు మౌనంగా ఉండలేరు. నిశ్శబ్డం భయంకరమైనది..దానిని పొందాలంటే మన మీద మనకు పట్టుండాలి. అంతే కాదు దానిని తనివి తీరా తట్టుకోగలిగే శక్తి కావాలి. ఇదంతా కొన్నేళ్లుగా సాధన చేస్తే వచ్చే ఫలితం. ప్రతి ఒక్కరికి సంతోషం కావాలి. హాయిగా సమకూరే వస్తువులు ఉండాలి. అందరికంటే తామే గొప్పవాళ్లమని అనిపించు కోవాలి.మందీ మార్బలం ..రోడ్డుపై వెళితే ప్రజల చూపు వాళ్ళ మీద ఉండాలని ఆశిస్తారు. కోరుకుంటారు కూడా . ఇది సహజాతి సహజం. మానవ నైజమే అంత. అనాదిగా వస్తున్న ఈ పరంపర నుండి కాపాడేందుకు శ్రీ శ్రీ శ్రీ చినజీయర్ స్వామీజీ ముందుకు వచ్చారు.ఏది నిజం ఏది అబద్దం ..ఏది వెలుతురు ..ఏది చీకటి ..ఏది కష్టం ఏది సుఖం.. అన్నిటిని ఆయన అవపోశన పట్టారు . తాను ఆకళింపు చేసుకున్నారు . వాటిని భక్తులు అర్థం చేసుకునేలా కృషి చేస్తున్నారు.
ఈ ప్రయత్న పరంపర కొన్ని ఏళ్లుగా నడుస్తూ వస్తోంది. పిల్లలు ..పెద్దలు ..యువతీ యువకులు ..వికలాంగులు ..విజ్ఞులు ..విద్యార్థులు ..ఉద్యోగులు ..వ్యాపారులు ..సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు ..ప్రొఫెషనల్స్ ..డాక్టర్లు ..మహిళలు ..గృహిణులు ..మేధావులు ..అధ్యాపకులు ..గురువులు ..ఆచార్యులు ..పంతుళ్లు ..స్వాములు ..క్రీడాకారులు ..ఆధ్యాత్మిక వేత్తలు ..చింతనాపరులు ..బుద్ధిజీవులు ..ఆస్తికులు ..నాస్తికులు ..ఇలా అందరు జీయర్ అనుచరులే ..ఆయన శ్రేయోభిలాషులే. ఈ పరంపర ఇంకా పెరుగుతూ పోతూనే ఉన్నది.జగమెరిగిన రామాయణాన్ని చినజీయర్ స్వామిజీ వీనుల విందుగా ..వినసొంపుగా భక్తులకు ప్రవచిస్తున్నారు. భగవత్ గీతలో ని సారాన్ని జీవితానికి అన్వయిస్తూ భక్తితత్వం బోధపడేలా చేస్తున్న ప్రయత్నం కోట్లాది భక్తుల గుండెల్లో గూడు కట్టుకునేలా చేస్తోంది. అన్నిటికంటే దివ్య సాకేతం ఇప్పుడు దేదీప్యమానమై వెలుగులు పంచుతోంది . జై శ్రీమన్నారాయణ నామ స్మరణతో సాగుతోంది .
ఎవ్వరో ఏదో చెబితే వినే పరిస్థితులు ఇప్పుడు లేవు . అంతా త్వరగా అయిపోవాలి. సాధ్యమైనంత దాకా ఆనందం పొందాలి . ఇప్పుడున్న భక్తుల కోరికలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది . దీనిని గమనించిన స్వామిజీ వారిని భక్తి మార్గంలోకి తీసుకు వచ్చారు . ఒకరా ఇద్దరా వేలా కాదు లక్షలాది మంది ప్రజలు భక్తులుగా మారి పోయారు . ఇదంతా చినజీయర్ సాధించిన కృషికి దక్కిన గౌరవం .ఇదే సమయంలో ..ఇదే కర్కశపు కాలంలో ఇంకొకరు వుండి వుంటే ఏ మాత్రం సాధ్యమయ్యేది కాదు . ఇది ఆయన కొన్నేళ్లుగా తెలుగు భక్తి లోకానికి గోడలా నిలబడ్డారు . అదే విశిస్టాద్వైతం . అదే మూల మంత్రం . అదే జీవం ..అదే వికాసం ..అదే దివ్య సాకేతపు స్వర్గ ధామం. ఆశావాహ దృక్పథం తో ..సానుకూల వాతావరణంలో ..సంకల్ప శుద్దితో మనం విరామమెరుగక ప్రయత్నం చేస్తే చాలు ..అదే పది వేలు అంటారు స్వాముల వారు . కోరికలు సహజం ..ఆశలు సహజాతి సహజం ..అయితే లైఫ్ ను జాగ్రత్తగా ఎవరి వాళ్ళు పొదివి పోగు చేసుకుంటే వద్దంటే ఆనందం మీ స్వంతమవుతుంది అంటారు చినజీయర్.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి