రోగుల పాలిట దైవం కె.జె.రెడ్డి వైద్యం

ఆర్థోపెడిక్ విభాగంలో దేశంలోనే పేరెన్నిక‌గ‌న్న వైద్యుల జాబితాలో డాక్ట‌ర్ కె.జె.రెడ్డి ముందు వ‌రుస‌లో ఉంటారు. ప్ర‌పంచ వ్యాప్తంగా బ్రాండ్ ఇమేజ్‌ను సొంతం చేసుకున్న తెలంగాణ‌లో ఆయ‌న పేరు ఎవ‌రిని అడిగినా త‌డుముకోకుండా చెప్పేస్తారు. అపార‌మైన అనుభ‌వంతో పాటు 
రోగుల ప‌ట్ల ఆయ‌న చూపించే అనురాగం రెడ్డిని ప్ర‌త్యేక‌మైన వ్య‌క్తిగా నిలిచేలా చేసింది. ఆర్థోపెడిక్ ప‌రంగా ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ఆ విష‌యాన్ని ఆయ‌న ముందే గుర్తించారు. అందుకే తాను పుట్టిన ఊరికి, పాల‌మూరు జిల్లాకు పేరు తీసుకు వ‌చ్చారు. ఆయ‌న త‌న మూలాల‌ను మ‌రిచి పోలేదు. ఒక‌ప్పుడు వైద్యం కోసం  అష్ట‌క‌ష్టాలు ప‌డిన త‌మ ప‌ల్లె ప్ర‌జ‌లను చూసి రెడ్డి చ‌లించి పోయారు. ఏకంగా జిల్లా చ‌రిత్ర‌లో స‌క‌ల స‌దుపాయాలు, సౌక‌ర్యాల‌తో అత్యాధునిక‌మైన ఆస్ప‌త్రిని, మెడిక‌ల్ కాలేజీని ఏర్పాటు చేశారు. హైద‌రాబాద్‌, రాయిచూర్ ప్ర‌ధాన ర‌హ‌దారి ప‌క్క‌నే జిల్లా కేంద్రానికి ద‌గ్గ‌ర‌లో పేద‌ల‌కు మెరుగైన చికిత్స‌లు అంద‌జేస్తోంది.  కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేశారు.క్ర‌మ‌శిక్ష‌ణ‌, నిబద్ధ‌త‌, సింప్లిసిటీకి పెట్టింది పేరు కె.జె.రెడ్డి. క‌లాం క‌ల‌లు క‌న్నారు..దానిని నిజం చేశారు. రెడ్డి కూడా అసాధ్య‌మైన దానిని సుసాధ్యం చేశారు. ఆయ‌న చ‌ల‌వ వ‌ల్ల వేలాది మందికి త‌క్కువ ఖ‌ర్చుతో వైద్యం ల‌భిస్తోంది. విశాల‌మైన స్థ‌లం, క‌ళ్లు  చెదిరేలా భ‌వ‌నాలు, ఆధునిక‌మైన ప‌రిక‌రాలు, ఆప్యాయంగా ప‌ల‌క‌రించే సిబ్బంది, వైద్యులు 24 గంట‌ల పాటు అందుబాటులో ఉంటారు. ఆయ‌న చ‌ల‌వ వ‌ల్ల ఎంతో మంది మ‌ర‌ణం  అంచున నుంచి బ‌తికి బ‌య‌ట ప‌డ్డారు. పేద‌, మ‌ధ్య‌త‌ర‌గ‌తి రోగుల‌కు ఆయ‌న ప్ర‌త్య‌క్ష దైవం.

అనుభ‌వ‌జ్ఞుడు..మార్గ‌ద‌ర్శ‌కుడు  - అమెరికా, ఇంగ్లాండ్‌, త‌దిత‌ర దేశాల నుండి కెజె రెడ్డి వైద్యం కోసం త‌ర‌లి రావ‌డం ఈ జిల్లా ప్ర‌జ‌లు చేసుకున్న అదృష్టం అనే చెప్పాలి. స‌వాల‌క్ష రోగాల‌తో స‌త‌మ‌తం అయ్యే వారిలో ఎక్కువ‌గా ఎముక‌లు, కీళ్లు, న‌డుము నొప్పులే అధికం. ఎంతో క‌ష్ట‌మైన ఆర్థోపెడిక్ రంగాన్నే రెడ్డి ఎంచుకున్నారు. అందులో అపార‌మైన అనుభ‌వాన్ని సంపాదించారు. ఆ రంగంలో ఎంద‌రో వైద్యులున్నా ఆయ‌న అంద‌రికంటే ఎక్కువే. అంత‌గా ఆయ‌న పాపుల‌ర్ అయి పోయారు. ఆర్థోపెడిక్‌లో స్పెష‌లైజేష‌న్ చేశారు. ఎంఎస్ (పీజీఐ), డిఎన్‌బి, ఎఫ్ ఆర్ సీ ఎస్ (యుకె) , ఎఫ్ ఆర్ సి ఎస్ (ఆర్థో) చేశారు. ఎన్నో అవార్డులు, మ‌రెన్నో పుర‌స్కారాలు అందుకున్నారు. 2015-2016 సంవ‌త్స‌రానికి గాను ఇండియ‌న్ ఆర్థో్ప్లాస్ట్రి అసోసియేష‌న్ కు అధ్య‌క్షుడిగా ప‌ని చేశారు. 2016-2017 సంవ‌త్స‌రానికి గాను తెలంగాణ ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్స్ అసోషియేషన్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆర్థోప్లాస్ట్రి స‌ర్జ‌న్స్ ఇన్ ఏషియా (ఏఎస్ ఐ ఏ ) బోర్డ్ మెంబ‌ర్ గా వున్నారు. 1993లో మైఖేల్ బాస్ట్రో ఆడిట్ ప్రైజ్ ను , 1995లో రీజిన‌ల్ ఏఓ వ‌ర్క్ షాప్‌లో బెస్ట్ ఫ్రాక్చ‌ర్ ఫిక్సేష‌న్ చేసినందుకు రెడ్డి ఫ‌స్ట్ ప్రైజ్ అందుకున్నారు. 2011లో హైద‌రాబాద్‌లోని నోవా టెల్‌లో భార‌త ప్ర‌భుత్వం ఆధ్వ‌ర్యంలో నిర్వ‌హించిన కార్య‌క్రమానికి రెడ్డి ఛైర్మ‌న్‌గా వ్య‌వ‌హ‌రించారు. దానిని న‌భూ న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో స‌క్సెస్ ఫుల్ చేశారు.

ఎంబిబిఎస్ లో స్టేట్ అవార్డు అందుకున్నారు. 2010లో అపోలో హాస్పిట‌ల్స్ ఆధ్వ‌ర్యంలో ఏపీ ఏఓ ట్రామా ప్రిన్సిప‌ల్స్ ఇన్ ఆప‌రేటివ్ ఫ్రాక్చ‌ర్ మేనేజ్‌మెంట్ పేరుతో స‌ద‌స్సు నిర్వ‌హించారు. రెడ్డి గారి కృషి వ‌ల్ల ఆర్థోపెడిక్ రంగంలోనే ప్రైవేట్ ఆస్ప‌త్రుల్లోనే మొద‌టి వ‌రుస‌లో వుంది. ఏ గాయం త‌గిలినా కీళ్ల మార్పిడి విష‌యంలో రెడ్డిని క‌ల‌వాల్సిందే. అంత‌గా ఆయ‌న ప్రాచుర్యం పొందారు. అడ్వాన్స్ ఆర్థోపెడిక్ కోర్స్ చాలా ఫేమ‌స్‌. సింగ‌పూర్ ఎక్స్‌పోర్ట్ ఫోరంలో గెస్ట్ ఫ్యాక‌ల్టీగా పాఠాలు బోధించారు. జైపూర్ లో  జ‌రిగిన మిలినీయం మీటింగ్‌లో స్పెష‌ల్ గెస్ట్ గా పాల్గొన్నారు. టీ హెచ్ ఆర్ అండ్ బోన్ డిఫెక్ట్స్ టీకే ఆర్ పై చెన్నైలో జ‌రిగిన స‌ద‌స్సుకు హాజ‌ర‌య్యారు. ఐఏఏసీఓఎన్ కంప్రెష‌న్ ప్లేట్ పేరుతో నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు. గోవా, కేరళ‌, చెన్నై , ఢిల్లీ, బెంగ‌ళూరు, వైజాగ్‌, పాండిచ్చేరి, కోల్‌క‌త్తా,  క‌రీంన‌గ‌ర్ , త‌దిత‌ర ప్రాంతాల్లో జ‌రిగిన ప్ర‌తి స‌ద‌స్సులో ఆయ‌నే సెంట‌ర్ ఆఫ్ అట్రాక్ష‌న్‌. మారిష‌ష్‌, సింగ‌పూర్‌, అమెరికా, లండ‌న్ త‌దిత‌ర దేశాల్లో ఆయ‌న సంద‌ర్శించారు. టీకేఆర్ ఇన్ వ‌రుస్ డెఫార్మిటీ పేరుతో ఆయ‌న కూలంకుషంగా రాశారు.  ఇందులో కీళ్ల మార్పిడి అనేదే ప్ర‌ధాన అంశం.

2017 మార్చి నెల‌లో థీమ్ మెడిక‌ల్ ప‌బ్లిష‌ర్స్ రెడ్డి పేరుతో పుస్త‌కాన్ని రిలీజ్ చేశారు. ఆయ‌న వైద్యుడు, మాన‌వ‌తా వాది, ర‌చ‌యిత , ట్రైన‌ర్ కూడా. 2014లో  ద ఓపెన్ రెహోమాటాల‌జీ జ‌ర్న‌ల్‌, 2013 జూన్‌లో రిలీజ్ చేసిన ఇండియ‌న్ జ‌ర్న‌ల్ ఆఫ్ ఆర్థోపెడిక్స్ లో కీళ్ల మార్పిడిలో ఇన్‌ఫెక్ష‌న్ కాకుండా ఏం చేయాలి అనే అంశంపై రెడ్డి రాశారు. 2012లో సైంటిఫిక్ జ‌ర్న‌ల్ ఆఫ్ అపోలో మెడిసిన్ జ‌ర్న‌ల్‌లో రీసెంట్ అడ్వాన్సెస్ ఇన్ ఆర్థోపెడిక్స్ అనే స‌బ్జెక్టుకు రెడ్డి ఎడిట‌ర్‌గా ప‌ని చేశారు. జ‌ర్మ‌నీలోని బెర్లిన్ 2012 లో ప్ర‌చురించిన జ‌ర్న‌ల్‌లో లాంగ్‌ట‌ర్మ్ కింద ఒక ఏడాదికి గాను నొప్పి లేకుండా ఉండేలా 6 ఎంఎల్ ఇంజ‌క్ష‌న్ హైలాన్ జి-ఎఫ్ 20 పేరుతో వివ‌రంగా రాశారు. రెడ్డి రెఫ‌ర్ చేసిన ఎఫీసియ‌న్సీ అండ్ సేఫ్టీ ఆఫ్ సింగిల్ ఇంజ‌క్ష‌న్ ఆఫ్ హైలాన్ జీఎఫ్ 20 ఇండియ‌న్ పేటెంట్స్ కోసం 2012లో అమెరిక‌న్ అకాడెమీ ఆఫ్ ఆర్థోపెడిక్ స‌ర్జ‌న్స్ ఆధ్వ‌ర్యంలో శాన్ ఫ్రాన్సిస్కో లో జ‌రిగిన సంవ‌త్స‌ర స‌మావేశంలో చేసిన సూచ‌న‌కు మంచి ప్ర‌శంస‌లు వ‌చ్చాయి. 2009లో సైంటిఫిక్ జ‌ర్న‌ల్ ఆఫ్ అపొల్లో మెడిసిన్ జ‌ర్న‌ల్‌లో మేనేజ్‌మెంట్ ఆఫ్ ఇనెఫెక్ట‌డ్ టోట‌ల్ హిప్ రిప్లేస్‌మెంట్ ఇన్ పేటెంట్ ఆఫ్ బైలేట‌ర‌ల్ సీవియ‌ర్ ఓస్టోరోత్రిటిస్ పేరుతో అడ్వాన్సెస్ ఇన్ ఆర్థోపెడిక్ స‌ర్జ‌రీ , ఆర్థోస్కోపిక్ ఎంటీరియ‌ర్ క్రుసియేట్ లిజ‌మెంట్ రీక‌న్‌ష్ట్ర‌క్ష‌న్ పేరుతో సైంటిఫిక్ జ‌ర్న‌ల్‌లో రెడ్డి వివ‌రంగా రాశారు. 1992లో ప్ర‌చురించిన ఇండియ‌న్ జ‌ర్న‌ల్ ఆఫ్ ఆర్థోపెడిక్స్‌, జ‌ర్న‌ల్ ఆఫ్ హ్యాండ్ స‌ర్జ‌రీ లాంటి ఎన్నో అంశాల‌పై ఆయ‌న సోదాహ‌ర‌ణంగా తెలియ చేశారు.

అన్నింటా ఆయ‌నే టాప‌ర్ - చ‌దువు ప‌రంగా చూస్తే రెడ్డి అంద‌రికంటే బెస్ట్. నాగార్జున‌సాగ‌ర్ ఏపీఆర్‌జేసీలో చ‌దివారు. 1980లో నిర్వ‌హించిన ఎంసెట్‌లో స్టేట్ టాప‌ర్‌గా వ‌చ్చారు. ఉస్మానియా మెడిక‌ల్ కాలేజీలో మెడిసిన్ పూర్తి చేశారు. చండీఘ‌ర్లో పేరెన్నిక‌గ‌న్న పీజీఐలో ఆర్థోపెడిక్‌లో  పోస్ట్ గ్రాడ్యూయేష‌న్ చ‌దివారు. ఆ త‌ర్వాత రెడ్డి యుకెకు చ‌దువు కోసం వెళ్లారు. 14 ఏళ్ల పాటు అక్క‌డే వున్నారు. ఎఫ్ఆర్‌సీఎస్ జ‌న‌ర‌ల్ పూర్తి చేశాక‌..ఆర్థోపెడిక్ స్పెష‌లిస్ట్ గా రాయ‌ల్ లండ‌న్‌లో ట్రైనింగ్ పొందారు. ఎఫ్ఆర్‌సీఎస్ ఆర్థోపెడిక్ విభాగంలో లండ‌న్‌లోని సెయింట్ బార్తోలోమ్యూ హిస్పిట‌ల్స్‌లో పూర్తి చేశారు.  జాయింట్ రిప్లేస్‌మెంట్ స‌ర్జ‌రీ పై ఎన్ హెచ్ సీ హాస్పిట‌ల్స్ లో యూనిట్ కు చీఫ్‌గా స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేశారు. 2003లో అపోలో గ్రూప్ ఆఫ్ హాస్పిట‌ల్స్‌లో ఆర్థోపెడిక్ విభాగంలో జాయిన్ అయ్యారు. ఆర్థోపెడిక్ గురించి ఇండియాతో పాటు ఇత‌ర దేశాల్లో ప‌ర్య‌టించారు. ఎన్నో స‌ద‌స్సుల్లో పాల్గొన్నారు. త‌న అనుభ‌వాల‌ను పంచుకున్నారు. మోకాళ్ల కీళ్ల మార్పిడి లో రెడ్డి వైద్యం ఒక మైలు రాయిగా పేర్కొన‌వ‌చ్చు.

కాన్ఫ‌రెన్స్‌ల‌లో ప్ర‌త్య‌క్షంగా ఎలా ఆప‌రేష‌న్లు చేయొచ్చో చేసి చూపించారు. గెస్ట్ లెక్చ‌ర్స్ ఎన్నో ఇచ్చారు. పాఠాలు బోధించ‌డం , ఎంద‌రినో త‌న లాగా స‌ర్జ‌న్స్ ను త‌యారు చేస్తూనే వున్నారు రెడ్డి. ఇండియా, అబ్రాడ్‌ల‌లో ప్ర‌చురిత‌మైన జ‌ర్న‌ల్స్‌లో రెడ్డి రాసిన వ్యాసాలు కీల‌కంగా మారాయి.టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, స‌ర్ రిచ‌ర్డ్ హ‌డ్లీ లాంటి గ్రేట్ స్పోర్ట్స్ ప‌ర్స‌న్స్ కు స‌ర్జ‌రీ చేసిన ఘ‌న‌త ఆయ‌న‌దే. చీఫ్ జాయింట్ రిప్లేస్ మెంట్ స‌ర్జ‌న్ గా సేవ‌లందిస్తున్నారు.  ఎస్‌వీఎస్ మెడిక‌ల్ , డెంట‌ల్ అండ్ అసోసియేటెడ్ ఇనిస్టిట్యూష‌న్స్ కు రెడ్డి మెడిక‌ల్ డైరెక్ట‌ర్ గా ఉన్నారు. 2011లో ఇండియ‌న్ ఆర్థోప్లాస్ట్రీ అసోసియేష‌న్ జ‌న‌ర‌ల్ సెక్రెట‌రీగా ఎన్నిక‌య్యారు. ఐఓఏ ఈసీ మెంబ‌ర్‌గా ఉన్నారు. ఐఏఏ, ఇండియ‌న్ ఆర్తోస్కోపీ సొసైటీ, ఏఓ ఫ్యాక‌ల్టీ స‌ర్టిఫికేష‌న్స్ అండ్ ప్రొఫెష‌న‌ల్ మెంబ‌ర్‌షిప్స్ లో పాఠాలు బోధిస్తున్నారు. కీళ్ల మార్పిడి, స్పోర్ట్స్ మెడిసిన్ లో ఆయ‌న ప్ర‌త్యేక‌త‌.

ఎన్నో అవార్డులు..మ‌రెన్నో పుర‌స్కారాలు - ఆర్థోపెడిక్ రంగంలో విశిష్ట‌మైన సేవ‌లందించిన ఈ అరుదైన వైద్యుడు రెడ్డికి ఎన్నో అవార్డులు, పుర‌స్కారాలు ల‌భించాయి. నాటింగ్‌హోంలో మైఖేల్ బాస్టో, బెస్ట్ ఆడిట్ ప్రైజ్ ను కేంబ్రిడ్జి నుండి, బెస్ట్ ఆప‌రేటింగ్ టెక్నిక్ ను బ్లాక్ నోట్లే హాస్పిట‌ల్ నుండి అందుకున్నారు. భార‌త ప్ర‌భుత్వం నుండి స్టేట్ మెరిట్ స్కాల‌ర్ షిప్ ను పొందారు. ఎక్ఛేంజ్ ట్రైనింగ్ ప్రోగ్రాం పేరుతో ఫెలోషిప్ చేశారు.  దేశ‌, విదేశాల నుండి వైద్యులు త‌రుచూ క‌లుస్తూ వుంటారు రెడ్డిని. అపోలో హాస్పిట‌ల్స్ మ‌రియు హెడిల్‌బెర్గ్ యూనివ‌ర్శిటీ, జ‌ర్మ‌నీ తో, లండ‌న్ లోని రోమ్ ఫోర్డ్ ఎన్ హెచ్ ఎస్ తో అపోలో హాస్పిట‌ల్స్ ఎక్ఛేంజ్ ప్రోగ్రాం చేసుకున్నారు. ఇదంతా ఆయ‌న వ‌ల్ల‌నే.

ఎంద‌రికో మార్గ‌ద‌ర్శి- ఈ రంగంలో రాణించాలంటే ఎంతో సాధ‌న చేయాలి. అంత‌కంటే ఎక్కువ ఓపిక కావాలి. ఎప్ప‌టిక‌ప్పుడు వైద్య రంగంలో చోటు చేసుకుంటున్న మార్పుల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకుంటూ అప్ డేట్ కావాలి. అప్పుడే ఆర్థోపెడిక్ సర్జ‌న్స్‌గా రాణించే వీలుంది. గ‌తంలో కంటే ప్ర‌స్తుతం వైద్య రంగంలో విప్ల‌వాత్మ‌క‌మైన మార్పులు చోటు చేసుకున్నాయి. ఒక‌ప్పుడు ఆప‌రేష‌న్స్ అంటేనే ఎక్కువ స‌మ‌యం ప‌ట్టేది. క్ష‌ణాల్లోనే ఆప‌రేష‌న్స్ జ‌రుగుతున్నాయి. ఆధునిక ప‌రిక‌రాలు, మెషీన్స్ ఉండ‌డంతో స‌ర్జ‌రీలు చేయ‌డం వైద్యుల‌కు సులువుగా మారింది. ఈ రంగంలో చ‌దువుకుంటున్న వారు, ఇప్ప‌టికే ప్రాక్టీస్ నిర్వ‌హిస్తున్న వారు  ఎంద‌రో కెజె రెడ్డి అనుభ‌వం, వృత్తి మార్గ‌ద‌ర్శ‌కంగా నిలుస్తోంది. - అవ‌మానాలు రానీ, క‌ష్టాలు రానీ ..క‌న్నీళ్లు వుండ‌నీ..ఊరును మ‌రువ‌ద్దు.. దేశం తిరిగినా..విదేశాలు ప‌ర్య‌టించినా..జ‌న్మ నిచ్చిన  ఏదో ఒక‌టి చేయాల‌ని త‌పించే ఇలాంటి వైద్యులు ఉండ‌డం పాల‌మూరు జిల్లాకు గ‌ర్వ‌కార‌ణం కాక మ‌రేమిటి - ఎంత ఎత్తుకు ఎదిగినా మ‌నిషి మూలాలు మ‌రిచి పోని వీలైతే ఒక్క‌సారి కెజె రెడ్డిని క‌ల‌వండి - ఎంతో కొంత అనుభ‌వం మ‌న‌కు ద‌క్కుతుంది. 

కామెంట్‌లు