లివింగ్ లెజెండ్..కేసీఆర్..!
కేసీఆర్ ఈ పేరు ప్రపంచ చరిత్రలో ఓ పాఠం ..ఓ అధ్యాయం. పట్టుదలకు మారు పేరు ..అనుకున్నది సాధించే మొండి ఘటం. జనం మెచ్చిన నాయకుడు . ప్రజలు మెచ్చిన పరిపాలనాదక్షుడు. అపర భగీరథుడు . బహు భాషా కోవిదుడు . తాత్వికుడు ..పోరాట యోధుడు . వ్యూహకర్త ..కవి ..రచయిత ..గంటల తరబడి లక్షలాది సమూహాన్ని నియంత్రించే ఉపన్యాసకుడు. పలు అంశాల్లో పట్టు కలిగిన ధీరోదాత్తదుడు. లోకం నివ్వెర పోయేలా సుదీర్ఘ కాలం పాటు ఉద్యమాన్ని నడిపిన జగమెరిగిన నేత. ఆయనే కల్వకుంట్ల చంద్ర శేఖర్ రావు. అంతా ముద్దుగా పిలుచుకునే పేరు కేసీఆర్. కొందరు అనామకులుగానే ఉంటారు .ఇంకొందరు భావి తరాలను ప్రభావితం చేసే చరిత్రను సృష్టిస్తారు . అలాంటి చరిత్రను తీరుగా రాసిన జన హృదయ నేత కేసీఆర్.
బహుశా ఈ దేశంలో ఏ నాయకుడు ఎదుర్కోని అవమానాలను ఆయన ఎదుర్కొన్నారు . అయినా తెలంగాణ విముక్తి కోసం ఆయన చేయని పోరాటం లేదు ..ఆయన చేయని ప్రయత్నం లేదు . ఈ ప్రపంచంలో సూర్య చంద్రులు ప్రకాశిస్తున్నంత దాకా ఆయన పేరు సదా నిలిచే ఉంటుంది. అప్పటి సీఎం చంద్రబాబు తీరుతో విసిగి వేసారి ..తెలంగాణ ప్రాంతపు దుఃఖాన్ని దగ్గరుండి చూసిన వ్యక్తి ఆయన.దుఃఖం వచ్చినా ఆపు కోలేని మానవత్వం ఉన్న మనీషి కేసీఆర్. పలు భాషల్లో ప్రావీణ్యం ..అపారమైన సమాచార సంపద ఆయనకున్న గొప్ప అసెట్ . ఇలాంటి నేతలు కొందరే ఈ భువిలో జన్మిస్తారు . ఆయన జన్మ తెలంగాణ ప్రజలు చేసుకున్న పుణ్యం . అదృష్టం .తెలంగాణ గాంధీ ప్రొఫెసర్ జయశంకర్ మార్గ నిర్దేశనంలో కాళ్లకు బలపం కట్టుకుని ఆయన తిరుగని ప్రాంతం లేదు . సకల జనులను ఒకే తాటిపైకి తీసుకు వచ్చిన ఘనత ఆయనదే. ఎవరు ఎన్ని ఆరోపణలు చేసినా కేసీఆర్ లేక పోతే నేటి తెలంగాణ వచ్చే ఉండేది కాదన్నది జగమెరిగిన సత్యం. అటు ఉద్యోగ సంఘాలను ..ఇటు విద్యార్థులను సైతం బలోపేతం చేసి వెన్ను దన్నుగా నిలిచి ఉద్యమాన్ని ముందుండి నడిపించిన రథసారథి కేసీఆర్ .
ఆయన భోళా శంకరుడు ..మానవత్వం కలిగిన గొప్పనైన దార్శనికుడు కేసీఆర్ . తెలంగాణ తల్లి ఋణం తీర్చుకునేందుకు వయసును సైతం లెక్క చేయకుండా అహర్నిశలు ప్రజల బాగోగుల కోసం కృషి చేస్తున్న ప్రజా నేత కేసీఆర్ . దళితులు , బడుగు , బలహీన వర్గాలు , మైనార్టీలు ఇప్పుడు ఆయనను దేవుడిగా కొలుస్తున్నారు . కోట్లాది ప్రజల ఆశల్ని నిజం చేసేందుకు ఆయన అలుపెరుగక కృషి చేస్తున్నారు . పాలన అన్నది చాలా శ్రమతో కూడుకున్నది . కొన్ని పొరపాట్లు ఉంటవి . వాటన్నిటిని ఆయన గుర్తించి ..రాబోయే తరాలు బాగుండాలనే ఉద్దేశంతో సంక్షేమ కార్యక్రామాలు చేపడుతున్నారు .ఆయనకు అన్నిటా అపారమైన అనుభవం ఉన్నది . దానిని గుర్తించి ముందుకు సాగాలి తప్పా ..లేని పోనీ ఆరోపణలతో విలువైన కాలాన్ని వేస్ట్ చేయడం మంచి పద్ధతి కాదు అంటారు మేధావులు . నేడు విస్మరించలేని ఒకే ఒక్క పదం కేసీఆర్. ఇప్పుడు ఆ పేరు చెబితే చాలు జనం సముద్ర కెరటాలుగా తరలి వస్తారు. అంతటి శక్తి ..మహత్తు ఆ పేరులోనే ఉంది . ఆడో బ్రాండ్ . ఆయన అందరికి విలువిస్తారు . నీలో ప్రతిభ ఉంటే చాలదు .. తెలంగాణ పునర్ నిర్మాణంలో నీ శక్తి నీవు నిరూపించ దాల్చుకుంటే చాలు ఆయన గుర్తిస్తారు . ఏదో ఒక రోజు నీకు పిలుపు వస్తుంది . అదీ ఆయనకున్న విజన్ . ఇలా ఉండబట్టే ఎన్ని కుట్రలు ..కుతంత్రాలు పన్నినా వాటి నన్నిటిని దాటుకుని కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి పెట్టారు .
నాయకుడి నుండి దేశం మొత్తం ఎవరా అని తన కోసం ఎదురు చూసేలా తనను తాను మల్చుకున్న తీరు రేపటి తరానికి ఓ పాఠం కావాలి. అసలు ఆయన చరిత్రే ఓ ఉద్యేగాన్ని తీసుకు వచ్చేలా చేస్తుంది . అదీ ఆయనకున్న పట్టుదల ..నిబద్దత . సాధించే దాకా నిద్ర పోనీ వైనం. ఎంపీగా ..మంత్రిగా .. డిప్యూటీ స్పీకర్ గా ..ఎన్నో పదవులు నిర్వహించారు . భావ సారూప్యత కలిగిన మేధావులు , నేతలను ఆయన ఒకే చోటుకు చేర్చారు . తెలంగాణ తల్లికి స్వేచ్ఛను ప్రసాదించారు .విజేతలు ఎక్కడో వుండరు . వాళ్ళు మనలోనే ఉంటారు . జాతిని జాగృతం చేసి ఉద్యమం వైపు నడిపించే సత్తా కొందరికే ఉంటుంది . అలాంటి కోవలోకి కేసీఆర్ వస్తారు. ఆయన భోళా శంకరుడు . అన్నిటికంటే అపర భక్తుడు . పల్లెలు ..ప్రజలు ..గుళ్ళు ..ఆయనకు ఎంతో ఇష్టం . అందుకే జనం ఆయనకు ఆమోదం తెలిపారు . చాలా మంది నేతలు వచ్చారు ..వెళ్లి పోయారు ..ఇంకొందరు కనుమరుగై పోయారు . కానీ కేసీఆర్ మాత్రం చెప్పారు ..మాటిచ్చారు . తెలంగాణ తెచ్చి చూపించారు . జనం మెచ్చిన విజేతగా నిలిచారు . ప్రపంచ రాజకీయ చరిత్రలో కొత్త అధ్యాయం ప్రారంభించేలా చేసారు . కేసీఆర్ పది కాలాల పాటు ఇలాగే ఉండాలి. కోట్లాది ప్రజల ఆశలను నిజం చేయాలని కోరుకుందాం.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి