!..నువ్వు నీలాగే ఉండు..!

నీ ద‌గ్గ‌ర ఏముంది. నిన్ను పొగిడే వాళ్లున్నారా. నీ చుట్టూ మందీ మార్బ‌లం ఉందా. నిన్ను ఆకాశానికి ఎత్తేసి. లాబీయింగ్ చేసే వాళ్లున్నారా. ఎదుటి వాళ్ల‌ను మెస్మ‌రైజ్ చేసే లౌక్యం ఉందా..పోనీ సాయంత్రం అయితే బార్ లేదా ప‌బ్ కు తీసుకు వెళ్ల‌గ‌లిగే స్టామినా నీకుందా..గ్యాంగ్ ను మెయింటెనెన్స్ నీ వ‌ద్దుందా..పోనీ బెదిరించి ప‌నులు చేసుకునే ప‌వ‌ర్ వుందా..ప‌ర్స్ నిండా క‌రెన్సీ వుందా..ఆస్తులు, అంత‌స్తులు..అమెరికాను త‌ల‌ద‌న్నే కార్లున్నాయా..క‌ళ్లు చెదిరే స్మార్టు ఫోన్లున్నాయా. నీకెంత‌మంది ఫాలోయ‌ర్స్ ఉన్నారా..అయితే ఇప్పుడున్న దునియాలో నువ్వు తోపు. నిన్ను డామినేట్ చేసే వాళ్లుండ‌రు..అంతా అన్నా అని అనేటోళ్లే. ఇంకెందుకు ఆల‌స్యం. అమెరికా జ‌పం చేయండి చాలు. అబ్బో ఫ్ల‌యిట్లు..దిమ్మ తిరిగే బ్యాంకు బ్యాలెన్సులు నిండితే చాలు క‌దా. నీకో స‌ర్కార్ కొలువుంటే చాలు..అదే ప‌ది వేలు. అదే ధ్యాస‌..అదే శ్వాస‌. ప‌క్కోడు ఏమై పోతేనేం. నువ్వు బాగుంటే చాలు. ఇది కాదు జింద‌గీ అంటే. నీ వ‌ద్ద చిల్లి గ‌వ్వ లేక పోయినా..నీ ద‌గ్గ‌ర ద‌మ్ముంటే చాలు. దీనిని ఏలటానికి .

ఇక నీకు నీవే బ్రాండ్. నీ జీవితం నీది. ఇంకొకడి డామినేష‌న్ అక్క‌ర్లేదు. నిన్ను నీవు ప్రేమించుకో. నిన్ను ఉద్ద‌రించుకున్న‌ట్టే. దేశం ఏమై పోతే నీకెందుకు. రాష్ట్రం స‌ర్వ‌నాశ‌న‌మైపోతే ఎందుకు. నీ న‌మ్మ‌కమే నీకు బ‌లం. నీ నీడ‌నే ఆలంబ‌న. కావాల్సినంత స‌రుకుంది. గ‌నులు..భూములు.
నీళ్లు..నిధులు..వ‌న‌రులు..లెక్క‌నేంత ..ఆస్తులున్న‌యి. ఇంకెందుకు ఆల‌స్యం . అక్ష‌ర రూపం దాల్చిన సిరా చుక్క‌కు ప‌వ‌ర్ ఎక్కువ‌. నీ గ‌మ‌న‌మే నీ గ‌మ్యం. ప‌ట్టు వ‌ద‌ల‌కు. చ‌దువుకుంటే గొప్ప‌. కానీ అడుగులు వెయ్యి. సంచారం చేయి. విస్తృతంగా న‌డుస్తూనే వుండు. ప్ర‌కృతి నేర్పే పాఠం నీకు ఏ గురువు చెప్ప‌లేడు. క‌ల‌లు క‌ల్ల‌లై పోతాయి. స‌క్సెస్ నీ చెంత వాలిపోతుంది. ఈ ప్ర‌పంచం నీకు స‌లాం చేస్తుంది. ఆ రోజు త‌ప్ప‌కుండా వ‌స్తుంది.
ఇంకెవ్వ‌రికీ త‌లొంచ‌కు బాస్‌.వెన్నెముక పోయిందా..బాధ ప‌డ‌కు..నిటారుగా నిల‌బ‌డు.

భూమి బ‌ద్ధ‌లైనా..భూకంపం సంభ‌వించినా..తుపాను త‌ల్ల‌డిల్లేలా చేసినా..శిఖ‌రం నిలిచే వుంటుంది. మంచు క‌రిగి పోతుంది. న‌దులు..ప‌ర్వ‌తాలు శాశ్వ‌తం. నీదైన ముద్ర కావాలి. నీ పేరే స‌మ‌స్తం..నీకు నీవే రాజువి..బంటువి కూడా. ఆలోచించు. గ‌తం వెంటాడుతుంది. భ‌విష్య‌త్తు భ‌య‌పెడుతుంది. కానీ నీ చేతుల్లో వ‌ర్త‌మానం వసంతంలా ఉందిగా. లే..న‌డు..అడుగులు క‌దుల్చు. నీ శ‌క్తి నీకు తెలిసినంత‌గా ఇంకెవ్వ‌రికీ తెలియ‌దు. గెలుపుది ఏముంది.ఇవాళ ఊరిస్తుంది. రేపు మ‌రిచి పోయేలా చేస్తుంది. నిజం శాశ్వ‌తం. నీవు సైంధ‌వుడిలా లే..నీకు నీవే జ‌వాబుదారీ..నీకు నీవే గెలుపు గుర్రం. కాద‌నే ద‌మ్ము ఎవ‌డికైనా ఉందా..!

కామెంట్‌లు