కీప్ ఇట్ అప్ మలినేని
టాలెంట్ కలిగిన వాళ్ళను అభినందించడంలో తమిళ డైరెక్టర్ల తర్వాతే. అక్కడ పేరొందిన నటులు కూడా దర్శకులను ప్రశంసలతో ముంచెత్తడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఈ మంచి సంప్రదాయం మాత్రం టాలీవుడ్ లో అగు పించదు. ఇదిలా ఉండగా పాన్ ఇండియా డైరెక్టర్ మురుగదాస్ మాత్రం ఎలాంటి భేషజాలకు పోకుండా వెన్నుతట్టి ప్రోత్సహించడం చేస్తూ వస్తున్నారు. సందేశంతో కూడిన కమర్షియల్ చిత్రాలను తెర కెక్కించడంలో ఆయన దిట్ట. తాజాగా సూపర్‌స్టార్ రజనీకాంత్ హీరోగా మురుగదాస్ కాంబినేషన్‌లో వస్తున్న చిత్రం దర్బార్. త్వరలో విడుదల కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. చాలా కాలం తర్వాత రజనీ పోలీస్ గెటప్‌లో అభిమానులను కనువిందు చేయనున్నాడు.
ఇక చిత్ర ప్రమోషన్‌లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను గ్రాండ్‌గా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రజనీ, దర్బార్ టీంతో పాటు టాలీవుడ్‌కు చెందిన ప్రముఖులు హాజరయ్యారు. అయితే ప్రమోషనల్ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లోనే ఉన్న డైరెక్టర్ ఏఆర్ మురగదాస్..రవితేజ తాజా చిత్రం క్రాక్ సెట్‌ను సందర్శించారు. ఈ సందర్భంగా మూవీకి సంబంధించిన విషయాలను తెలుసుకున్న మురుగదాస్ అనంతరం డైరెక్టర్ గోపిచంద్ మలినేనికి, చిత్ర సభ్యులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఏఆర్ మురుగదాస్ క్రాక్ సెట్‌ను సందర్శించిన ఫోటోను గోపిచంద్ మలినేని తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ ఆనందం వ్యక్తం చేశాడు.
కాగా, డాన్ శీను, బలుపు వంటి చిత్రాలతో కమర్షియల్ డైరెక్టర్‌గా పేరొందిన మలినేని తాజాగా రవితేజతో మరో చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో టెంపర్ పోలీసాపీసర్‌గా రవితేజ కనిపించనున్నాడు. ఇప్పటికే న్యూ ఇయర్ కానుకగా విడుదలై క్రాక్ ఫస్ట్ లుక్ పోస్టర్‌కు అభిమానుల నుంచి విశేష స్పందన వస్తోన్న విషయం తెలిసిందే. సమ్మర్‌లో విడుదల కానున్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ అందిస్తుండగా, సరస్వతి ఫిలింస్ డివిజన్ బ్యానర్‌పై మధు నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే రవితేజ హీరోగా ఆనంద్ దర్శకత్వంలో రూపు దిద్దుకుంటోన్న డిస్కో రాజా చిత్రం విడుదలకు సిద్దంగా ఉంది. రిపబ్లిక్ డే సందర్బంగా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కనువిందు చేయనుంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి