నమ్రత ఫొటోస్..హల్ చల్
సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్బాబు నటించిన సరిలేరు నీకెవ్వరూ సినిమాపై అభిమానులు, చిత్ర యూనిట్ భారీ అంచనాలే పెట్టుకుంది. ఈ మూవీలో చాలాకాలం తర్వాత లేడీ అమితాబ్ గా పేరున్న విజయశాంతి నటిస్తుండటం విశేషం. ఇదే సమయంలో మహేశ్ బాబు సతీమణి, నటి, నిర్మాత నమ్రతా శిరోద్కర్ తన ఇన్‌స్టాలో చేసిన ఓ పోస్ట్ నెటిజన్లను తెగ ఆకట్టు కుంటోంది. అంతే కాకుండా ఆ ఫోటో సోషల్ మీడియాల్ వైరల్ అవుతోంది. ఫోటోతో పాటు తన మనసులోని ఆంతరంగిక భావాలను జోడించి ఓ సందేశాన్ని సైతం పోస్ట్ చేశారు. నమ్రత పోస్ట్ చేసిన ఆ ఉద్వేగ భరిత పోస్ట్ అందరి హృదయాలను హత్తు కుంటోంది.
ఇంతకీ ఆ ఫోటోలో ఏముందంటే కృష్ణ, మహేశ్, గౌతమ్‌లు ఒకే విధంగా, ఒకే రకమైన క్యాస్టూమ్స్ అందంగా అంతకు మించి హుందాగా ఉన్నారు. ప్రస్తుతం ఈ ఫోటో చూపరుల మది దోచేస్తోంది. ఈ ఫోటోతో పాటు వీరే నా సూపర్ హీరోలు. వీరే నా బలం. ఈ ముగ్గురితో నా జీవితం సంపూర్ణమైంది. నా మీద ఈ ముగ్గురు చూపిస్తున్న ప్రేమ, గౌరవాలకు నేను కృతజ్ఞురాలిని. ఇప్పటికీ ఈ ముగ్గురు నాకెన్నో కొత్త విషయాలు నేర్పిస్తున్నందుకు సంతోషంగా ఉందంటూ, నమ్రతా మనసు దోచుకునేలా మెసేజ్ పోస్ట్ చేశారు. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న సరిలేరు నీకెవ్వరూ చిత్రాన్ని అనిల్ సుంకర, దిల్ రాజు, మహేశ్‌బాబులు నిర్మిస్తున్నారు.
విడుదల కానున్న ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది. ఇక మహర్షి వంటి బ్లాక్ బస్టర్ విజయం తర్వాత మహేశ్ చేస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలతో ఈ సినిమాపై అంచనాలు పీక్స్‌కు వెళ్లాయి. రాజేంద్ర ప్రసాద్, ప్రకాష్ రాజ్, సంగీత, కౌముది, రఘుబాబు, జయప్రకాష్ రెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మొత్తం మీద ఓ వైపు రజనీ కాంత్ దర్బార్, అల్లు అర్జున్ ఆలా వైకుంఠపురంలో సినిమాలు కూడా మహేష్ మూవీతో పోటీ పడుతున్నాయి. ఏ సినిమాలు రికార్డులు తిరుగ రాస్తాయో వేచి చూడాలి.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి