మేడిన్ ఆంధ్రా..కియా ఆగయా..!
ఎప్పుడప్పుడా అని వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న వాహనదారుల అభిమానులకు తీపి కబురు అందింది. ఇప్పటికే కార్ల వినియోగంలో ఎన్నో కంపెనీలు ఉన్నప్పటికీ దేశీయ మార్కెట్ రంగంలో ఇండియాకు చెందిన మారుతి సుజుకీనే టాప్ రేంజ్ లో ఉంటూ వస్తోంది . మరో దేశీయ కంపెనీ టాటా మోటార్స్ కూడా తన వాటాను అంతకంతకు పెంచుకుంటూ వస్తోంది . వాహనదారుల అభిరుచులకు అనుగుణంగా సరికొత్త డిజైన్లు , కలర్స్ , ఫెసిలిటీస్ తో కార్లను రూపొందిస్తున్నాయి ఆయా కార్ల తయారీదారులు ..కంపెనీలు. మారుతీ , టాటా , హ్యుందాయి , హోండా , మహీంద్రా , ఫోర్డ్ , నిస్సాన్ , తదితర కంపెనీలకు చెందిన కార్లు దేశంలో హల్ చల్ చేస్తున్నాయి .
వీటితో పాటు మరో విదేశీ కంపెనీ వచ్చి చేరింది అదే ..కియా కార్ల కంపెనీ . సదరు కంపెనీ ఏపీ లోని అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేసింది . దాదాపు రెండు ఏళ్ళు అవుతోంది స్టార్ట్ చేసి . ఇప్పుడు శరవేగంగా కార్లు తయారవుతున్నాయి.. ఓ రకంగా ఏపీ ఆటోమొబైల్ రంగంలో నవశకం ఆరంభమైంది. ఆంధ్రా తయారీ కియా కారు లాంఛనంగా మార్కెట్‌లోకి విడుదలైంది. సెల్టాస్ మోడల్ వాహనాన్ని కియా సంస్థ ఆవిష్కరించింది. ఈ కార్యక్రమంలో కియా సంస్థ ప్రతినిధులతో పాటు రాష్ట్ర ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, బీసీ సంక్షేమశాఖ మంత్రి శంకరనారాయణ, ఏపీఐఐసీ ఛైర్ పర్సన్ రోజా పాల్గొన్నారు. 530 ఎకరాల విస్తీర్ణం ప్రారంభమైన కియా మోటార్స్ కంపెనీ అతి వేగంగా నిర్మాణం జరిగింది.
కార్ల ఉత్పత్తిని కూడా ప్రారంభించారు. ఈ ప్లాంట్‌లో తయారైన తొలి కారును విడుదల చేశారు. 22 నుంచి మార్కెట్‌లో కియా కార్లను విక్రయించనున్నట్టు కియా మోటార్స్ ఎండీ తెలిపారు .దేశవ్యాప్తంగా 206 షోరూమ్‌లలో ఈ కార్లఅమ్మకాలు జరుపుతామని చెప్పారు. వెబ్‌సైట్ తెరిచిన రోజునే 6వేల కార్లు ముందస్తు బుకింగ్ అయ్యాయన్నారు. కొందరు ఇప్పటికే కార్ల కోసం ముందస్తుగా తమ పేర్లను నమోదు చేసుకున్నారని తెలిపారు. న్యూ లుక్ తో యువతను ఎక్కువగా ఆకట్టుకునేలా ఉంది కియో కార్ డిజైన్ . మొత్తం ఫ్యామిలీ కంఫర్ట్ గా కూర్చునేలా , ప్రయాణం చేసేలా దీనిని తీర్చిదిద్దారు. మొత్తం మీద గత ప్రభుత్వం హయాంలో అప్పటి సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయం వల్ల కొందరికి ఉపాధి దొరుకుతోంది.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి