చెప్పవే చిరుగాలి ..చల్లగా ఎద గిల్లి ..!
దేశం హైదరాబాద్ నగరం వైపు చూస్తోంది. అవకాశాలతో పాటు బతికేందుకు కావాల్సినవన్నీ అత్యంత చౌక ధరల్లో లభిస్తుండటంతో , రవాణా పరంగా అనుకూలంగా ఉండటం , రియల్ ఎస్టేట్ పరంగా తక్కువ ధరల్లో అందుబాటులో లభించడంతో జనం , వ్యాపారులు దీనికే ఓటు వేస్తున్నారు. వీరితో పాటు వ్యాపారస్తులు , కంపెనీలు, బిజినెస్ పీపుల్స్ , రియల్ ఎస్టేట్ దారులు కూడా ఇక్కడికే పరుగులు పెడుతున్నారు . కొత్త ప్రభుత్వం కొలువు తీరడం , కంపెనీదారులకు , వ్యాపారులకు, పారిశ్రామికవేత్తలకు భాగ్యనగరం స్వర్గధామంగా మారింది. దీంతో కొత్తగా కంపెనీలు స్థాపించేందుకు ముందుకు వస్తున్నారు. ఇప్పటికే ఐటీ హబ్ గా ఈ నగరం పేరు పొందింది. మరో వైపు కార్ల కంపెనీలు , టెలికాం , ఆటోమొబైల్స్ , లాజిస్టిక్ తదితర రంగాలకు చెందినవి కొలువుదీరాయి.
ఇక పొద్దున్న లేచినప్పటి నుండి తిరిగి ఉదయం లేచే దాకా గాలి లేకుండా ..పీల్చుకోకుండా ఉండలేని పరిస్థితి . మాల్స్కు వెళ్లినా , కంపెనీలకు వెళ్లినా ఏసీలు , ఫ్యాన్లు ఉండాల్సిందే . ఇక అపార్ట్ మెంట్లు , ఇండ్లు అయితే చెప్పాల్సిన పనిలేదు . తిండి లేకుండా ఉండగలరేమో కానీ ఫ్యాన్లు లేకుండా ఉండలేరు . హైదరాబాద్ లో ఎలక్ట్రిక్ వస్తువులు , ఫ్యాన్ల వ్యాపారం రోజుకు కోట్లల్లో నడుస్తోంది . నిర్మాణ రంగం పుంజుకోవడంతో వీటికి డిమాండ్ పెరిగింది . ఇప్పటికే బజాజ్ , ఉషా , ఓరియంట్ తో పాటు వందలాది కంపెనీలు ఫ్యాన్లను తాయారు చేస్తున్నాయి. హైదరాబాద్ లోని జీడిమెట్లలో రాష్ట్రానికి చెందిన పలు కంపెనీలు తక్కువ ధరకే ఫ్యాన్లు తయారు చేస్తున్నాయి. కేవలం 400 రూపాయల నుండి 10 వేల రూపాయల దాకా లభిస్తున్నాయి . సామాన్య కుటుంబాల వారి తో పాటు డబ్బులు ఉన్న వారిని దృష్టిలో పెట్టుకుని కంపెనీలు వీటిని తయారు చేస్తున్నాయి. ఇక ఇప్పటికే ఇదే రంగంలో ఉన్న విద్యుత్ వైర్లు, స్విచ్‌లు ఉత్పత్తి చేసే గోల్డ్‌మెడల్ ఎలక్ట్రికల్స్ తెలంగాణలో రూ.125 కోట్ల పెట్టుబడితో ఫ్యాన్ల తయారీ కేంద్రం ఏర్పాటు చేయనుంది.
హైదరాబాద్ సమీపంలో ఈ కేంద్రాన్ని 3-4 ఎకరాల్లో నిర్మించ బోతున్నామని, రెండేళ్లలో పూర్తి కావచ్చని సంస్థ డైరెక్టర్ కిషన్ జైన్ తెలిపారు. గీజర్లలాంటి గృహోప కరణాలనూ ఇక్కడ ఉత్పత్తి చేసే వీలుంటుందని, 150 మందికి ఉద్యోగావకాశం కల్పిస్తామని, 3-4 ఏళ్లలో ఈ సంఖ్య 500కు చేరుకో వచ్చన్నారు. 2018-19లో సంస్థ రూ.1,400 కోట్ల టర్నోవర్ సాధించిందని, ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.2,000 కోట్ల టర్నోవర్ లక్ష్యమని తెలిపారు. ఏటా 40 శాతం వృద్ధి నమోదు చేస్తున్నామని, 2-3 ఏళ్లలో ఐపీఓకి వెళ్లే విషయాన్ని ఆలోచిస్తున్నామన్నారు. దేశంలో విద్యుత్ వైర్లు, స్విచ్చుల విభాగంలోని ఇతర ఉపకరణాల మార్కెట్‌లో గోల్డ్‌మెడల్‌కు 16% వరకు వాటా ఉందని వెల్లడించారు. దీంతో గోల్డ్ మెడల్ కంపెనీ ఫ్యాన్లు మనకు అందుబాటులో రానున్నాయి .

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి