తెలంగాణ అడ్డా ఇక బీఆర్‌కే భవన్

అనుకున్నదే అయ్యింది. ఇక సచివాలయం ఓ కలగా మిగిలి పోనున్నది. కేసీఆర్ తీసుకున్న నిర్ణయం తో నేటి నుంచి అన్ని శాఖల కార్యకలాపాలన్నీ సచివాలయం నుండి కాకుండా బీఆర్‌కే భవన్ నుంచే ప్రారంభం కానున్నాయి. రాష్ట్ర రాజధానికి కూతవేటు దూరంలో ఉన్న దానిని మార్చడంతో వివిధ పనుల నిమిత్తం వచ్చేవారికి ఇబ్బంది ఏర్పడే ప్రమాదం ఉన్నది. మొత్తం మీద సర్కార్ కూల్చి వేత్త దిశగా ప్రయత్నాలు ప్రారంభించేందుకు డిసైడ్ అయ్యింది. ఓ వైపు మేధావులు , ప్రజాస్వామిక వాదులు , ప్రజా ప్రతినిధులు , విపక్షాలు అభ్యంతరం చెప్పినా సర్కార్ వినిపించుకోలేదు . కోర్ట్ కూడా ఇంకా అనుమతి ఇవ్వలేదు.

అయినా ప్రభుత్వం తాను కోరుకున్న కొత్త సచివాలయం నిర్మాణం నేపథ్యంలో  బూర్గుల రామకృష్ణారావు  భవన్‌లో  కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. సచివాలయంలోని ప్రధాన శాఖలు ఇక్కడి నుంచే విధులు నిర్వర్తించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.  కార్యదర్శులు, ఉన్నతాధికారులు ఈ  భవన్‌ నుండి  కార్యకలాపాలను చేపట్టనున్నారు. సామగ్రి తరలింపు పూర్తయిన తర్వాత ఉద్యోగులు విధుల్లో చేరతారు. తరలింపు దృష్ట్యా ప్రస్తుత సచివాలయంలోని కార్యకలాపాలు  నిలిచి పోనున్నాయి. సందర్శకులకు అనుమతి ఉండదు. ఇప్పటికే రోడ్లు, భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి సునీల్‌శర్మ కార్యాలయం, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేషీ ఎర్రమంజిల్‌కు తరలి వెళ్లాయి.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కార్యాలయం నుంచి సామగ్రిని ఇప్పటికే  తరలించారు. దీంతో పాటు సాధారణ పరిపాలన శాఖ, ఆర్థిక, ప్రణాళిక శాఖల నుంచి ఫర్నీచర్‌, దస్త్రాలు తరలి వెళ్లాయి.  వరుసగా మూడు రోజులు సెలవులు వస్తుండడంతో  మొత్తం సామగ్రి తరలింపు ప్రక్రియను పూర్తి చేస్తారు. ఇక బీఆర్‌కే భవన్‌లో ప్రభుత్వ శాఖల కార్యాలయాలను సిద్ధం చేశారు. ఫర్నీచర్‌ను సమకూర్చి, బోర్డులను పెట్టారు. పార్కింగు, ఇతర వసతులను కల్పించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కోసం బేగంపేటలోని మైట్రో రైలు కార్యాలయం సిద్ధమైంది. వివిధ శాఖలకు ఎంపిక చేసిన ఇతర కార్యాలయాల్లోనూ ఏర్పాట్లు పూర్తయ్యాయి.  మొత్తం మీద ప్రభుత్వం తాను ఏదైతే అనుకుందో అదే చేస్తోంది . 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!