ముమ్మాటికీ మహా అపరాధమే
ఈ దేశం ఎటు పోతోంది. ప్రతి దానికి భారత రాజ్యాంగాన్ని ఉదాహరణగా చూపించే సాంప్రదాయం ఇవ్వాళ కనుమరుగై పోతోంది. దేశంలో రాజకీయాలు ఎంతగా దిగజారి పోయాయో ఇవ్వాళ కళ్ళ ముందు అగుపిస్తోంది మరాఠా. నిన్న కర్ణాటక నేడు మరాఠా. ప్రజలు ఏ పార్టీకి సంపూర్ణ మెజారిటీ ఇవ్వలేదు. దీనిని సాకుగా తీసుకున్న బీజేపీ పార్టీ తన సిద్ధాంతాలను, రాజకీయ విలువలను పూర్తిగా తిలోదకాలు ఇచ్చేసింది. చీటికీ మాటికీ హిందూత్వ ఎజెండాను ముందుకు తీసుకు వచ్చే ఆర్ఎస్ఎస్ చీఫ్ భగవత్ ఇప్పుడు ఏం సమాధానం చెబుతారో వారికే తెలియాలి. అందుకే బాబా సాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాస్తూ అణగారిన, సామాన్య, అట్టడుగున, గుర్తింపునకు నోచుకోని వర్గాలకు చట్ట సభల్లో ప్రాతినిధ్యం వహించాలని సూచించారు.
దాని కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కోరారు. ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన ప్రజా ప్రతినిధులు పార్టీలు సులువుగా మారుతున్నారు. విలువలకు తిలోదకాలు ఇస్తూ అధికారం కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. వీరిని కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో వుంటే వారికి అనుకూలంగా, తొత్తులుగా వ్యవహరిస్తున్నారు గవర్నర్లు. గతంలో దివంగత ఎన్ఠీఆర్ కు అనుభవంలోకి వచ్చింది. ఈ దేశంలో తాము మాత్రమే పవిత్రులమని, మిగతా వారంతా అవినీతి పరులని భావించే ట్రబుల్ షూటర్లు మోడీ, అమిత్ చంద్ర షా ఇప్పుడు పావులు కదుపుతున్నారు. తమకు ఏ ఒక్కరు, ఏ పార్టీ కూడా ఎదురే లేకుండా చేస్తున్నారు. ఆ దిశగా గ్రౌండ్ వర్క్ చేస్తున్నారు. కర్ణాటకలో సంకీర్ణ సర్కారును కొల్చి వేశారు. కన్నడ నాట కమలాన్ని కొలువు తీరేలా చేశారు.
ప్రస్తుతం యెడ్యూరప్ప ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తమకు ఎదురు నిలిచిన వారిని కేసుల పేరుతో వేధింపులకు గురి చేయడం. సీబీఐ పేరుతో దాడులు చేసేలా పురమాయించడం చేస్తూ వస్తున్నారు. తాజగా కాంగ్రెస్ పార్టీలో నంబర్ టూగా ఉన్న చిదంబరం, కర్ణాటకలో ట్రబుల్ షూటర్ గా ఉన్న డీకే శివకుమార్ లను జైలుకు పంపించారు. ప్రస్తుతం మరాఠాలో బీజేపీ కొలువు తీరేలా ప్లాన్ చేశారు మోడీ, షా. బీజేపీకి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు కావాల్సిన సంఖ్య లేకపోయినా ఉన్నట్టుండి ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా, అజిత్ పవార్ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కూడా చేశారు. మరో వైపు ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేన కలిసి సంకీర్ణ సర్కార్ ఏర్పాటు కు అనుమతి ఇవ్వాలని రాష్ట్ర గవర్నర్ ను కోరారు. వీరిని కాదని బీజేపీకి ఆఫర్ ఇచ్చాడు.
దీనిని సవాలు చేస్తూ విపక్షాలు సుప్రీంకోర్టులో పిల్ వేశారు. దీనిపై ధర్మాసనం విచారణ చేపట్టింది. వెంటనే ప్రభుత్వ ఏర్పాటు కోరుతూ ఇచ్చిన లేఖను తమకు సమ్పరించాలంటూ ఆదేశించింది. ఇది ఏరకమైన రాజనీతో మోడీ, షాలకే తెలియాల్సి ఉంది. ఇంకో వైపు కొన్ని తరాలుగా బద్ద శత్రువులుగా ఉన్న పార్టీలన్నీ ఇప్పుడు ఒక్కటి కావడమే విశేషం. ఎన్సీపీ, శివ సేన, కాంగ్రెస్ పార్టీలు జత కట్టడాన్ని అభిమానులు, నాయకులు, కార్యకర్తలు జీర్నించుకోలేక పోతున్నారు. తమ మీద తమకు పట్టు లేకపోయినా ఈ నాయకులు రేపు పరిపాలన ఎలా సాగిస్తారో వేచి చూడాలి. అధికారమే కావాలనుకుంటే మళ్ళీ ఎన్నికలకు పోయే అవకాశం ఉంది. ఏదైనా ప్రజా క్షేత్రంలో నిరూపించు కోవాలి. అలాంటిది ఏమీ లేదు.
ఏ పార్టీలో ఉన్నా సరే డబ్బులు ఎరగా చూపిస్తూ సంతలో పశువులను కొనుగోలు చేస్తునట్టు ఎమ్మెల్యేలు, ఎంపీలను కొంటున్నారు. తమ పార్టీలో చేరితే కేసులుండవు. అదే ప్రతిపక్షంలో లేదా విపక్షంలో వుంటే మాత్రం అధికారాన్ని అడ్డం పెట్టుకుని వేధింపులకు పాల్పడుతున్నారు. దేశంలో తిరుగులేని నాయకుడిగా, లీడర్ గా పేరు తెచ్చుకున్న ప్రధాని మోడీ ఇలా షా ను అడ్డం పెట్టుకుని వేధింపులకు పాల్పడుతున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తాయి. మోదీజీ అధికారం కొద్దీ సేపే. కానీ ఇప్పటికే దేశం మీ వైపు చూస్తోంది. సర్జికల్ స్ట్రైక్స్ కాదు కావాల్సింది. ఆర్ధిక సుస్థిరత. నిరుద్యోగం లేని భారతం కావాలి. కానీ మరాఠా లో ఏర్పడిన మాహా నాటకం అక్కడి ప్రజలకు కొంత వెగటు కలిగించి ఉండొచ్చు. కానీ ఇది ముమ్మాటికీ మహా అపరాధమే.

కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి