సెమీస్ ఆశ‌లు స‌జీవం - పాకిస్తాన్ ఘ‌న విజ‌యం

ఇండియాతో ఓట‌మి త‌ర్వాత పాకిస్తాన్ తీవ్ర‌మైన ఒత్తిడికి లోనైంది. ఆ దేశ క్రికెట్ అభిమానులు త‌మ జ‌ట్టు ఓడిపోవ‌డంతో తీవ్ర స్థాయిలో మండిప‌డ్డారు. ఒకానొక ద‌శ‌లో ప్ర‌పంచ‌క‌ప్ టోర్న‌మెంట్ నుండి తిరిగి వ‌చ్చేయ‌మంటూ నెటిజ‌న్లు పిలుపునిచ్చారు. జ‌ట్టు ప‌రంగా ఏమైనా కామెంట్స్ చేయండి కానీ వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌ల‌కు దిగ‌వ‌ద్ద‌ని, త‌మ స‌త్తా ఏమిటో చూపిస్తామంటూ పాక్ క్రికెట‌ర్లు సామాజిక మాధ్య‌మాల సాక్షిగా కోరారు. వారు చెప్పిన విధంగానే దెబ్బ‌తిన్న పులుల్లా తిరిగి త‌మ స‌త్తా ఏమిటో రుచి చూపించారు. న్యూజిలాండ్ తో జ‌రిగిన డూ ఆర్ డై మ్యాచ్ లో స‌మిష్టిగా ఆడి పాకిస్తాన్ ఘ‌న విజ‌యాన్ని న‌మోదు చేసుకుంది. టోర్నీలో సెమీ ఫైన‌ల్ ఆశ‌ల‌ను సజీవంగా ఉంచుకుంది. 6 వికెట్ల తేడాతో గెలుపొందింది.

ఎడ్జ్ బాస్ట‌న్ వేదిక‌గా జ‌రిగిన మ్యాచ్‌లో పాకిస్తాన్ జ‌ట్టుకు చెందిన బాబ‌ర్ అజామ్ అజేయ‌మైన సెంచ‌రీతో జ‌ట్టును గ‌ట్టెక్కించాడు. 127 బంతులు ఎదుర్కొన్న ఈ  క్రికెట‌ర్ 101 ప‌రుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఇందులో 11 ఫోర్లున్నాయి. బాబ‌ర్‌కు తోడుగా సోహైల్ 76 బంతులు ఆడి 68 విలువైన ప‌రుగులు చేశాడు. ఇందులో 5 ఫోర్లు, 2 భారీ సిక్స‌ర్లు ఉన్నాయి. అంత‌కు ముందు బ్యాటింగ్ చేసిన కివీస్ నిర్ణీత 50 ఓవ‌ర్ల‌లో 6 వికెట్లు కోల్పోయి 237 ప‌రుగులు చేసింది. ఈ జ‌ట్టులో నీష‌మ్ అద్భుతంగా ఆడాడు. 112 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 3 సిక్స‌ర్ల‌తో 97 ప‌రుగులు చేయ‌గా, గ్రాండ్ హోమ్ 71 బంతుల్లో 64 ప‌రుగులు చేశాడు. ఇందులో 6 ఫోర్లు ఒక సిక్స‌ర్ కొట్టాడు. మ‌రో ఆట‌గాడు కేన్ విలియ‌మ్స్ 69 బంతుల్లో 41 ప‌రుగులు చేశాడు. ఇందులో 4 ఫోర్లున్నాయి. పాకిస్తాన్ బౌల‌ర్లు క‌ట్టుదిట్టంగా బౌలింగ్ చేయ‌డంతో న్యూజిలాండ్ త‌క్కువ ప‌రుగుల‌కే ప‌రిమిత‌మైంది.

టార్గెట్ చిన్న‌దే అయినా పాకిస్తాన్ మొద‌ట త‌డ‌బ‌డింది. మూడో ఓవ‌ర్ లోనే ఆ జ‌ట్టుకు ఎదురు దెబ్బ త‌గిలింది. బౌల్డ్ బౌలింగ్‌లో ఫ‌క‌ర్ 9 ప‌రుగులే చేసి పెవిలియ‌న్ బాట ప‌ట్టాడు. 11వ ఓవ‌ర్‌లో ఓపెన‌ర్ ఇమాముల్ 19 ప‌రుగులు మాత్ర‌మే చేసి అవుట‌య్యాడు. ఆ త‌ర్వాత గ్రౌండ్‌లోకి వ‌చ్చిన హ‌ఫీజ్ 32 ప‌రుగులు చేసి జ‌ట్టును చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేశాడు. 25వ ఓవ‌ర్‌లో విలియ‌మ్స‌న్ అద్భుత‌మైన బంతికి చిక్కాడు. అప్ప‌టికి స్కోర్ 110 ప‌రుగుల‌కు 3 వికెట్లు. క్రీజులోకి వ‌చ్చిన బాబ‌ర్ , సోహైల్‌లు ఇద్ద‌రూ కివీస్ బౌల‌ర్ల‌కు ఎలాంటి ఛాన్స్ ఇవ్వ‌కుండానే ప‌రుగుల వ‌ర‌ద పారించారు. ఆచితూచి ఆడారు. మ‌ధ్య‌లో కాస్తా ఇబ్బంది ప‌డినా ఏ మాత్రం తొట్రుపాటుకు లోన‌వ్వ‌కుండా స్కోర్‌ను పెంచారు. 48వ ఓవ‌ర్‌లో బాబ‌ర్ సెంచ‌రీ పూర్తి చేశాడు. ఈ టోర్నీలో ఇత‌డికిదే తొలి సెంచ‌రీ. చివ‌ర్లో అన‌వ‌స‌ర‌పు ర‌న్ కోసం వెళ్లి అవుట‌య్యాడు. కెప్ట‌న్ స‌ర్ఫ‌రాజ్ చివ‌రి ఓవ‌ర్ లో రెండు ఫోర్లు కొట్ట‌డంతో పాక్ కు విజ‌యం వ‌రించింది. సెమీస్ బ‌రిలో తాను ఉన్నానంటూ మిగ‌తా జ‌ట్ల‌కు సిగ్న‌ల్ పంపించింది. బాబ‌ర్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ద‌క్కింది.  

కామెంట్‌లు