సిటీలో జర్నీ ..టోరా క్యాబ్స్‌తో ఈజీ
అన్నీ ఇంటి వద్దకే వచ్చేస్తున్నాయి. రోజూ వారీగా ఉదయం లేస్తేనే పేపర్ దగ్గరి నుండి, పాలు, పనివాళ్లు, కిరాణం, అవసరమైతే వంట చేసుకోలేక పోతే ..రెడీ ఫుడ్ ఆర్డర్ ఇస్తే చాలు ఇంటి వద్దకే క్షణాల్లో డెలివరీ అవుతోంది. దీంతో ఎక్కడికి వెళ్లాల్సిన పనిలేదు. ఎవరిపై ఆధారపడి బతకాల్సిన అవసరం లేదు. కావాల్సిందల్లా మీ సేవింగ్స్ అకౌంట్ లోనో లేదా కరెంట్ అకౌంట్‌లోనో డబ్బులుంటే చాలు. క్షణాల్లో డబ్బులు పంపించాలంటే బ్యాంకుల దగ్గరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా టెక్నాలజీ అప్ డేట్ అయింది. ఇంకేం గూగుల్ పే, పేటిఎం, ఫోన్ పే లాంటి ఆన్ లైన్ లావాదేవీల యాప్స్ కస్టమర్లకు, జనానికి సేవలందిస్తున్నాయి. గూగుల్ మ్యాప్స్ సాయంతో సిటీలో జర్నీ మరింత ఈజీగా మారిపోయింది. రైడ్ హైరింగ్ సర్వీసుల్లోకి మరో కొత్త యాప్ ఆధారిత సంస్థ టోరా క్యాబ్స్ హైదరాబాద్‌లోకి ప్రవేశించింది. టోరా క్యాబ్స్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ కింద దీని సేవలు గత నెల 12 నుంచి ప్రారంభమయ్యాయి.
మరో 45 రోజుల్లో తన సేవలను పూర్తిగా వినియోగదారుల ముందుకు తీసుకు రానున్నట్లు టోరా క్యాబ్స్ టెక్నాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ మార్కెటింగ్ హెడ్ అండ్ పబ్లిక్ పాలసీ డైరెక్టర్ కవితా బాస్కరన్ వెల్లడించారు. ఇప్పటి వరకు 1500 మంది డ్రైవర్లు తమ ఫ్లాట్ ఫామ్ పై రిజిస్టర్ చేసుకున్నట్లు తెలిపారు. జీరో కమిషన్, జీరో సర్ ఛార్జ్ అంటూ ఏమీ వుండదు. అంటే డ్రైవర్ల నుంచి ఎలాంటి కమిషన్ తీసుకోదు. కేవలం రోజూ వారీగా చందాగా డ్రైవర్ 199 రూపాయలు చెల్లిస్తే చాలు. అంతేకాకుండా ప్రయాణికుల నుండి ఎలాంటి సర్ ఛార్జ్ ను వసూలు చేయక పోవడం ఈ కంపనీ ప్రత్యేకత. మినిమం ఛార్జీగా మూడు కిలోమీటర్లకు 39 వసూలు చేస్తారు. ఆ తర్వాత ఒక్కో కిలోమీటర్‌కు బేస్ ఛార్జీగా 8 రూపాయలు నిర్ణయించారు. మొదటగా టోరా క్యాబ్స్ తన సేవలను హైదరాబాద్‌లో స్టార్ట్ చేసింది. ఆ తర్వాత మెట్రోలు, నాన్ మెట్రోల్లోకి కూడా ప్రవేశించనుంది. కొరియాకు చెందిన సంస్థ ద్వారా టోరా క్యాబ్స్ ..జాయింట్ వెంఛర్ ఏర్పడినట్లు డైరెక్టర్ షిన్ తెలిపారు. మొత్తం మీద నగర వాసులకు ఓబర్, ఓలా తో పాటు టోరా కూడా అందుబాటులోకి రావడంతో జర్నీ కష్టాలు ఉండవు.
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి