లెజెండ్స్ క‌ల‌యిక‌..అభిమానుల కేరింత..!

క్రికెట్ ఆట అంటే చాలు..చిన్నారుల నుంచి పెద్ద‌వాళ్ల దాకా ఫిదానే. ఇందులో ఐటీ కంపెనీల దిగ్గ‌జాలు కూడా ఉన్నారంటే న‌మ్మ‌లేం. ప్ర‌పంచ క‌ప్ క్రికెట్ టోర్న‌మెంట్ జ‌రుగుతుండ‌డంతో వ‌ర‌ల్డ్ వైడ్‌గా క్రికెట్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. కోట్లాది మంది జ‌నం టీవీల‌కు అతుక్కు పోయారు. ఓ వైపు హాట్ స్టార్ మ‌రో వైపు యూట్యూబ్‌ల‌లో వీక్షిస్తున్నారు. ఇక హొట‌ళ్లు, రెస్టారెంట్లు, ప‌బ్‌లు, బార్లు, లాడ్జ్‌లు , ప్ర‌యాణికుల ప్రాంగ‌ణాలు, రేడియోలు, రైల్వే స్టేష‌న్‌లు, విమానాశ్ర‌యాలు, మాల్స్, స్టోర్స్‌, ఇలా చెప్పుకుంటూ పోతే ప్ర‌తి చోటా క్రికెట్ మ్యాచ్‌లు ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. అంత‌గా ప్ర‌జ‌ల‌తో క‌నెక్ట్ అయ్యిందీ ఈ ఆట‌. ఒక‌ప్పుడు గిల్లీ దండా ఆడేటోళ్లు ఊర్ల‌ల్ల‌. అదే ఇపుడు బంతి, బ్యాట్‌కు మ‌ధ్య వార్ న‌డుస్తోంది.

తేడా అక్క‌డ గిల్లీ..దండా అంతే. కాలం మారింది. టెక్నాల‌జీ ప‌రుగులు తీస్తోంది. జ‌నం అభిరుచుల్లో , లైఫ్ స్ట‌యిల్‌లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. కాలాన్ని గుప్పిట బిగించి కోట్లాది గుండెల్ని ల‌య‌బ‌ద్ధంగా ఒకే గొంతుకై క‌లిపేది ఒక్క‌టే క్రికెట్. అదే ఇప్పుడు అంత‌టా డామినేట్ చేస్తోంది. ల‌క్ష కోట్ల‌కు పైగా వ్యాపారం జ‌రుగుతుందంటే న‌మ్మ‌లేం. ఇది పైపై లెక్క మాత్ర‌మే. ఈ క్రికెట్‌కు ఇంత డిమాండ్ ఉంది కాబ‌ట్టే స్టార్ గ్రూపు కంపెనీ ఏకంగా టెలికాస్ట్ చేసేందుకే ఇండియాలో హ‌క్కుల్ని పొందేందుకు 1647 కోట్ల‌కు బిడ్ లో పాడి ద‌క్కించుకుంది. ఒక్క పాక్, ఇండియా దేశాల మ‌ధ్య జ‌రిగే మ్యాచ్‌కే 100 కోట్ల‌కు పైగా యాడ్స్ రూపంలో స్టార్ గ్రూపున‌కు వ‌చ్చాయంటే క్రికెట్ ఆట‌కున్న క్రేజ్ ఎలాంటిదో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ ఆట‌కు ప్ర‌భావితం కాని వాళ్లు లేరంటే అతిశ‌యోక్తి కాదు. అలాంటి వారిలో పొలిటిక‌ల్ లీడ‌ర్స్ ఉన్నారు.

ఐటీ కంపెనీల ఛైర్మ‌న్లు, సిఇఓలు, ఎండీలున్నారు. సాఫ్ట్ వేర్ ప్రొఫ‌ష‌న‌ల్స్ తో పాటు సెల‌బ్రెటీస్ కూడా ఈ ఆటంటే ప‌డి చ‌స్తున్నారు. ఇంకొంద‌రి అభిమానం ఎలా వుంటుందంటే , ప్ర‌పంచంలో ఇండియా జ‌ట్టు ఎక్క‌డ ఆడినా స‌రే ముంద‌స్తుగా టికెట్లు బుక్ చేసుకుని మ్యాచ్‌లు చూస్తారు. త‌మ జ‌ట్టు ప‌ట్ల అభిమానాన్ని చాటుకుంటారు. ఇలాంటి వారిలో ఇద్ద‌రు దిగ్గ‌జాలు క‌లుసుకోవ‌డం ప్ర‌పంచ వ్యాప్తంగా చ‌ర్చ‌నీయాంశంగా మారడంతో పాటు ,క్ష‌ణాల్లో వైర‌ల్ అయింది. దీనిని కోట్లాది మంది క్ష‌ణాల్లో చూశారు. వ్యూవ‌ర్ షిప్ కోట్ల‌కు చేరుకుంది. ఇంకా చూస్తూనే ఉన్నారు.

దీనికంత‌టికి కార‌ణం, ప్ర‌పంచంలోనే ఐటీ రంగంలో టాప్ వ‌న్ కంపెనీగా ఉన్న గూగుల్ కంపెనీ సిఇఓ సుంద‌ర్ పిచ్చ‌య్‌కు క్రికెట్ అంటే చ‌చ్చేంత ఇష్టం. ఇంగ్లండ్ లో జ‌రుగుతున్న ప్ర‌పంచ క‌ప్ క్రికెట్ టోర్న‌మెంట్‌లో ఇండియా ఆడుతున్న మ్యాచ్‌ను చూసేందుకు సుంద‌ర్ వ‌చ్చారు. అక్క‌డే కామెంటేట‌ర్‌గా ఉన్న మ‌రో క్రికెట్ లెజండ్ స‌చిన్ ర‌మేష్ టెండూల్క‌ర్‌ను క‌లిశారు. వీరిద్ద‌రు ఎవ‌రి రంగంలో వారు అత్యున్న‌త శిఖ‌రాల‌ను అధిరోహించారు. కోట్లాది భార‌తీయుల మ‌న‌సుల‌ను దోచుకున్నారు. క్రికెట్ కే వ‌న్నె తెచ్చిన ఆట‌గాడు ఒక‌రైతే..ఐటీ రంగాన్ని శాసిస్తున్న కంపెనీ సిఇఓ ఇంకొక‌రు. వీరిద్ద‌రు వేర్వేరు రంగాల‌కు చెందిన వారైనా..క్రికెట్ వీరిని క‌లిపింది. ఫ్యాన్స్ ను ఆశ్చ‌ర్యానికి గురి చేసింది.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

ధిక్కార ప‌తాకం - మూగ‌బోయిన స్వ‌రం - జ‌న నాయ‌కుడు ఇక లేడు..!